ఓరుగంటి నీలకంఠశాస్త్రి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓరుగంటి నీలకంఠశాస్త్రి ఒక ప్రసిద్ధి చెందిన పండితుడు, ఉభయభాషా పారంగతుడు.

విశేషాలు

[మార్చు]

ఇతడు జూలై 19 వ తేదీన విజయనగరంలో జన్మించాడు. ఇతడు విజయనగర మహారాజా సంస్కృత కళాశాలలో విద్యను కొనసాగించాడు. సంస్కృత అలంకార, వ్యాకరణశాస్త్రాలు, పూర్వోత్తర మీమాంసలు, తర్కశాస్త్రము, ప్రస్థాన త్రయము సమగ్రంగా అభ్యసించినాడు. ఇతడు 1971 వరకు గుంటూరు హిందూ కళాశాలలోను, 1971-72లో కె.వి.కె సంస్కృత కళాశాలలోను సంస్కృత అధ్యాపకుడిగా పనిచేశాడు. తరువాత గుంటూరు పి.జి.కాలేజీలో తెలుగు శాఖలో యు.జి.సి.గౌరవాచార్యునిగా పనిచేశాడు.[1]

రచనలు

[మార్చు]

ఇతని రచనలు అనేకం భారతి వంటి పత్రికలలో ప్రచురితమయ్యాయి. ఇతని రచనలలో కొన్ని:

  1. తల్లి విన్కి (లలితా సహస్రనామ వివృతి)
  2. తిక్కయజ్వ హరిహరనాథతత్త్వము
  3. శ్రీ దక్షిణామూర్తి స్తోత్రం
  4. సూతసంహిత
  5. అక్షర సమామ్నాయము
  6. లోచనము
  7. కళ్యాణలీల మొదలైనవి.

బిరుదములు

[మార్చు]
  • వ్యాకరణ విద్యా ప్రవీణ
  • ఉభయ భాషా ప్రవీణ
  • వేదాంత పారీణ మొదలైనవి.

మూలాలు

[మార్చు]
  1. కె. సుధాకరరావు (12 June 1981). "శ్రీ ఓరుగంటి నీలకంఠశాస్త్రి". ఆంధ్రపత్రిక దినపత్రిక. No. సంపుటి 68 సంచిక 70. Retrieved 12 February 2018.[permanent dead link]