ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి
నాణ్యతను మెరుగుపరచేందుకు గాను ఈ వ్యాసానికి శుద్ది అవసరం. వికీపీడియా శైలిని అనుసరించి వ్యాసాన్ని మెరుగు పరచండి. వ్యాసంలో మెరుగు పరిచవలసిన అంశాల గురించి చర్చా పేజిలో చర్చించండి. లేదా ఈ మూస స్థానంలో మరింత నిర్దుష్టమైన మూస పెట్టండి. |
ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి ప్రముఖ కవి, ఉభయభాషా ప్రవీణులు. (జననం: 1909)
వ్యక్తిగత విషయాలు
[మార్చు]- తల్లి : పుల్లమాంబ
- తండ్రి : బంగారేశ్వర శర్మ
- భార్య: భాస్కరమ్మ
- విద్య : ఉభయభాషాప్రావీణ వ్యాకరణాచార్య, షడ్దర్శని విశారద
- వృత్తులు : శ్రీ దంతులూరి వేంకట రాయపరాజోన్నత పాఠశాల కోలంక తెలుగు పండిట్, జ్యోతిషం, వైద్యం.
- బిరుదములు : విద్వత్కవిశేఖర
రచనలు
[మార్చు]- ధన్వంతరి చరిత్ర
- ద్విభాష్యం వేంకటేశ్వర్లు గారి జీవిత చరిత్ర
- భీమేశ్వర స్తవము
- ఆంధ్రకథా సరిత్సాగరము (7-18 లంబకములు)
- కర్మయోగి
- వేంకటేశ్వర శతకము
- వేంకటేశ్వర స్తవము
- నూర్జహాన్ నాటకం
- ఖండ కావ్య సంపుటి
- సూర్యరాయాంధ్ర నిఘంటువు( తె - న్ర భాగం)
ఆంధ్ర కథా సరిత్సాగరము
[మార్చు]ఓలేటి వేంకటరామశాస్త్రి కథా సరిత్సాగరాన్ని ఆంధ్రీకరించడం మొదలుపెట్టి 5వ లంబకము వరకు పూర్తిగావించి 6వ లంబకములో 1,2,3 తరంగాలు వ్రాసినట్టుగా ఉవాచగా తెలుస్తున్నప్పటికి ఆ మూడు తరంగాలు లభ్యం కాలేదు.తదుపరి తాళ్ళరేవు మండలం ఇంజరం గ్రామం ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (1909) 7వ లంబకము నుండి 18వ లంబకము వరకు అనువదించి 1963సం..లో వేంకటేశ్వరుని దివ్యదామమైన వైకుంఠము చేరితిరి. తదనంతరం వారి జ్యేష్ఠపుత్రుడైన ఓలేటి శ్రీనివాసశర్మ (1942) శ్రీ దంతులూకి వేంకటరాయపరాజోన్నత పాఠశాల కోలంకలో గ్రేడ్-1 తెలుగు పండితుడిగా రిటైరైతిరి (2000). పిదప 1-5, 7-18 లంబకములు పూర్తియైనవి 6వ లంబకము పూర్తి గావించిన గ్రంథమునకు పూర్ణత్వము, పూర్వికులకు యశః కాయము లభించునన్న తలంపుతో 6వ లంబకము 2009నాటికి పూర్తిగావించితిరి. ఆంధ్ర కథా సరిత్సాగరము - ఓలేటి వేంకట రామశాస్త్రి (పల్లిపాలెం) 1-5లంబకములు, ఓలేటి సూర్యనారాయణ శాస్త్రి (ఇంజరం) 7-18, ఓలేటి శ్రీనివాసశర్మ -6వ లంబకము ఈవిదమున ఓలేటి త్రయంచే పూర్తిగావింపబడింది.