ఓవర్‌త్రో
క్రికెట్‌లో, అవుట్‌ఫీల్డ్ నుండి విసిరిన బంతిని మధ్యలో ఉన్న ఫీల్డర్ పట్టుకోలేక వదిలేస్తే, అపుడు బ్యాటర్ చేసే అదనపు పరుగులను ఓవర్‌త్రోలు అంటారు. దీన్ని కొన్నిసార్లు బజర్ అని కూడా అంటారు. ఓవర్‌త్రోలు సాధారణంగా బ్యాటర్‌ను రనౌట్ చేసే ప్రయత్నంలో ఫీల్డర్ స్టంప్స్‌పై గురిపెట్టి బంతిని విసిరినపుడు, అది స్టంపులకు తగలనపుడూ వస్తాయి. అయితే కొన్నిసార్లు బంతిని అందుకున్న ఫీల్డరు దాన్ని సరిగ్గా పట్టనప్పుడు కూడా వస్తాయి.
ఈ పద్ధతిలో వచ్చే పరుగులు, ఫీల్డింగ్ లోపం సంభవించే ముందు అప్పటికే చేసిన పరుగులకు అదనంగా లెక్కించబడతాయి. వాటిని బ్యాటర్ స్కోరుకు కలుపుతారు. ఓవర్‌త్రో ఫలితంగా బంతి బౌండరీకి చేరుకుంటే, ఓవర్‌త్రోకు ముందు పూర్తి చేసిన పరుగుల సంఖ్యకు బౌండరీ నాలుగు పరుగులు కలుపుతారు.[1] ఒక బ్యాటర్ ఒకే బంతికి ఆరు కంటే ఎక్కువ పరుగులు చేసే అసాధారణ సంఘటనకు ఇది దారి తీయవచ్చు. పాపింగ్ క్రీజ్‌లో బ్యాటర్ ఉన్నప్పుడు బంతి వికెట్‌కు తగిలి, ఆపై బ్యాటర్ పరుగులు తీస్తే వాటిని కూడా ఓవర్‌త్రో పరుగులుగా పరిగణిస్తారు.
టెస్ట్ క్రికెట్‌లో ఒకే బంతికి ఎనిమిది పరుగులు చేసిన సందర్భాలు కనీసం నాలుగు ఉన్నాయి. [2] 2008 నవంబరులో బ్రిస్బేన్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా తరపున ఆండ్రూ సైమండ్స్ ఆడుతూ, నాలుగు పరుగులు చేసాడు. ఆ సమయంలో ఫీల్డరు బంతిని వికెట్ కీపర్ తలపై నుంచి విసిరితే అది బౌండరీ దాటి, మరో నాలుగు పరుగులు వచ్చాయి.
ఒకే బంతి ఒకటి కంటే ఎక్కువసార్లు విసిరే అవకాశం కూడా ఉంది. ఇది మరిన్ని పరుగులు చేయడానికి దారితీస్తుంది. సిద్ధాంతపరంగా ఒక బంతికి ఎన్ని పరుగులు స్కోర్ చేయాలనే పరిమితి లేదు.
విక్షేపాలు
[మార్చు]బ్యాటరును గానీ, బ్యాట్‌ను గానీ తాకి, బంతి బౌండరీకి వెళ్లే దాన్ని కొన్నిసార్లు ఓవర్‌త్రోగా పరిగణిస్తారు. 2019 క్రికెట్ ప్రపంచ కప్ ఫైనల్‌లో బెన్ స్టోక్స్ బ్యాట్ నుండి ఆరు పరుగులు తీయడం దీనికి సంబంధించిన ముఖ్యమైన సంఘటన. 2022 లో ఇంగ్లండ్‌లో న్యూజిలాండ్ పర్యటనలో జరిగిన మొదటి టెస్ట్‌లో ఇదే విధమైన సంఘటన పునరావృతమైంది. అదే వేదిక (లార్డ్స్) పై, అదే బౌలర్ ట్రెంట్ బౌల్ట్ వేసిన బంతి బెన్ స్టోక్స్ బ్యాట్ కు తగిలి పక్కకు పోయింది, ఈసారి బౌండరీకి వెళ్లలేదంతే. [3]
మూలాలు
[మార్చు]- ↑ The Laws of Cricket - Law 19.6 Archived 2008-09-15 at the Wayback Machine
- ↑ Cricinfo - Ask Steven
- ↑ "2019 World Cup final | Ben Stokes asked umpires not to add four overthrows to total, says James Anderson". The Hindu (in Indian English). PTI. 2019-07-17. ISSN 0971-751X. Retrieved 2020-09-10.
{{cite news}}
: CS1 maint: others (link)