ఓ చెలియా నా ప్రియ సఖియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

ఓ చెలియా నా ప్రియ సఖియా 2015లో విడుదలైన తెలుగు సినిమా. పసుపుల సోమిరెడ్డి సమర్పణలో కమలేశ్వరా ఆర్ట్ క్రియేషన్స్ బ్యానర్ పై పి.రమేష్ బాబుల్ రెడ్డి స్వీయ నిర్మాణ దర్శకత్వం వహించాడు. మ‌నోజ్ నంద‌న్‌, స్మితిక, మోనిక సింగ్ హీరోహీరోయిన్లుగా నటించిన ఈ సినిమా 3 జులై 2015న విడుదలైంది.[1][2]

ప్రతి విషయంలోనూ బెటర్‌మెంట్‌ను కోరుకుంటూ ఉండే మురళి (మనోజ్ నందం), ప్రేమకు కూడా ఇదే సిద్ధాంతాన్ని పాటిస్తాడు. ఈ క్రమంలోనే అతడికి కావ్య (స్మితిక) తో పరిచయం అయి కొద్దిరోజుల్లోనే ఆమెకు దగ్గరవుతాడు. మురళి తనను ప్రేమిస్తున్నాడని అనుకుంటున్న తరుణంలోనే తాను ఒక పరిచయం లేని అమ్మాయి ప్రేమలో ఉన్నానని మురళి కావ్యకు చెప్తాడు. తాను ప్రేమించిన అమ్మాయి నమీ (మోనికా సింగ్) అనుకోకుండా అతడి జీవితంలోకి రావడం, ఓ ధనిక కుటుంబానికి చెందిన ఆ అమ్మాయితో అతి తొందర్లోనే మురళి దగరవుతుంది. మురళికి అన్ని తాను ఉహించుకున్నట్టే జరుగుతుందని అనుకునేలోపే నమీ, మురళికి ఓ షాక్ ఇస్తుంది. నమీ మురళికిచ్చిన షాక్ ఏంటి ? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు

[మార్చు]

సాంకేతిక నిపుణులు

[మార్చు]
  • బ్యానర్: కమలేశ్వరా ఆర్ట్ క్రియేష
  • నిర్మాత: పి.రమేష్ బాబుల్ రెడ్డి
  • కథ, స్క్రీన్ ప్లే, దర్శకత్వం: పి.రమేష్ బాబుల్ రెడ్డి
  • సంగీతం: సాకేత్ నాయుడు
  • సినిమాటోగ్రఫీ:

మూలాలు

[మార్చు]
  1. The Times of India (3 July 2015). "O Cheliya Naa Priya Sakhiya Movie: Showtimes, Review, Trailer, Posters, News & Videos | eTimes". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  2. The Hans India (2 July 2015). "Movie Releases This Week" (in ఇంగ్లీష్). Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  3. CineJosh (5 July 2015). "సినీజోష్‌ రివ్యూ: ఓ చెలియా నా ప్రియ సఖియా". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.
  4. Teluguwishesh (20 June 2015). "O Cheliya Naa Priya Sakhiya Movie Censor Report". Archived from the original on 11 September 2021. Retrieved 11 September 2021.