కంచెర్ల రమేశ్
డాక్టర్ రమేశ్ కంచర్ల.రెయిన్‌బో హాస్పిటల్ అధినేత. నెల్లూరు జిల్లా అనుమసముద్రంపేట మండలంలోని చీరమన స్వగ్రామం.మంగళూరులో చ్రిల్డన్ స్పెషాలిటీతో ఎండీ చేశారు. ఇంగ్లండ్ రాయల్ కాలేజ్‌లో ఎంఆర్‌సిపి చేశారు.
భావాలు,అనుభవాలు
[మార్చు]- పరిస్థితి మన చేతుల్లోంచి దాటిపోయిన తరువాత మనం ఎలాగూ ఏమీ చేయలేం. కానీ చేయడానికి ఎంతో కొంత ఇంకా మిగిలి ఉన్నప్పుడు ఎంత ఎక్కువగా సేవలు అందించగ లిగితే అంత బెటర్ .
- వైద్యం ఒక వృత్తి కాదు ఒక ప్రాణం.
- వారానికి ఐదు రోజులే హాస్పిటల్‌కు వెళ్లాల్సి ఉన్నా వారానికి ఏడు రోజులూ వెళ్లే వాణ్ని. డాక్టర్ వృత్తి నిజంగా నాకొక అబ్సెషన్‌గా మారింది. పసిపిల్లల ప్రాణాలు కాపాడే ఏ చిన్నఅవకాశాన్నీ జారవిడుచుకోకూడదన్న భావన నాలో అణువణువునా వ్యాపించింది.
- 'ఏం సాధించాలన్నా చివరిదాకా పోరాడాలి. అప్పటిదాకా లేనిదేదో ఆ చివర్లో ఉంటుందని కాదు. ఒక్కొక్కటిగా మనకు ఎదురైన వైఫల్యాలు మనకు నేర్పిన పాఠాలతో ఆ తరువాత్తరువాత మనలో వ్యవహార దక్షత పెరుగుతుంది. అది ఎదుటివారికి మన మీద విశ్వాసం కలిగేలా చేస్తుంది.
- రెండు వైపులా ప్రాణాపాయమే ఉన్నప్పుడు చేష్టలుడిగిపోయి విఫలమైపోవడం కన్నా, ప్రాణాల్ని కాపాడే ప్రయత్నంలో విఫలమైపోవడం మేలు.
అన్ని దశల్లోనూ విమర్శలు ఉంటాయి. అయినా అవసరమైనప్పుడు తెగించి అడుగు ముందుకు వేయకపోతే, అమూల్యమైన వాటిని శాశ్వతంగా కోల్పోతాం. నిస్సహాయతలోంచి నిలదొక్కుకోవాలి. కొన ఊపిరిని నిలబెట్టినప్పుడు ఒక గొప్ప ఆనందాన్నే పొందుతాం. ఎంత శ్రమించినా ఒక్కోసారి ఏ ఫలితమూ ఉండదు. ఒక నిస్సహాయ పరిస్థితి నిలువునా ముంచేస్తుంది. ఆ క్షణంలో ఈ మాత్రానికి ఎందుకీ వైద్య వృత్తి అని కూడా అనిపిస్తుంది. మన నిస్సహాయతను అర్థం చేసుకోకుండా, పరుషాతిపరుషంగా నిందించే వారిని చూసినప్పుడు ఇవన్నీ భరించడానికేనా ఈ వృత్తిలోకి వచ్చిందీ అని కూడా అనిపిస్తుంది. కానీ, ఆ నిస్సహాయ స్థితిలోనూ నిబ్బరంగా ఉండడం ఎంతో ముఖ్యం. నీ శక్తిని నూటికి నూరు శాతం ఉపయోగించావా లేదా అన్నదే ముఖ్యం కానీ అధిగమించలేని పరిమితులను చూసి నీరుగారి పోవడం వల్ల ఫలితమేముంది? ఈ రోజు అసాధ్యంగా ఉన్నవి రేపు సాధ్యమవుతాయి. నిస్సహాయత నుంచి నిలబెట్టేది, ముందుకు నడిపించేది ఎప్పటికైనా ఆశావహ దృక్పథమే.
మూలాలు
[మార్చు]- https://web.archive.org/web/20131110023415/http://www.andhrajyothy.com/node/24207 ఆంధ్రజ్యోతి 8.11.2013