సంస్కృత న్యాయములు
"సంస్కృతన్యాయములు" అనగా సంస్కృత లోకోక్తులు. ఇవి తెలుగు సామెతలు వంటివి. వీటిని మధురకవులునగు శ్రీ నాళం కృష్ణరావు గారు, వా రెన్నియో సంవత్సరములనుండి సేకరించుచున్నారు. తరువాత శ్రీ కూచిభొట్ల ప్రభాకరశాస్త్రి, ఘట్టి లక్ష్మీనరసింహశాస్త్రి సోదరులు 1939లో ప్రచురించారు. ఆధునికకవులు, శ్రీ టేకుమళ్ల కామేశ్వరరావుగారు కొన్ని సామెతలు, జాతీయములు నిచ్చిరి. మొదటగా "లోకోక్తిముక్తావళి" యను పేరుతో తెలుగు సామెతలు ప్రకటించారు.
- సంస్కృతన్యాయములు రచయిత పిల్లలమర్రి లక్ష్మీనారాయణ
అనువాదకులు ఎడిటర్ పిల్లలమర్రి లక్ష్మీనారాయణ చిత్రకర్త సంవత్సరం 1939 ప్రచురణకర్త లక్ష్మీ గ్రంథ మండలి. తెనాలి
|
సంస్కృత న్యాయముల జాబితా
అ
[మార్చు]- అగతికగతి న్యాయం
- అగ్నికుంభ న్యాయం
- అగ్నిగతశలభన్యాయం
- అగ్నివహ్ని న్యాయం
- అగ్నిశలభ న్యాయం
- అగ్నిశిఖా న్యాయం
- అగ్నిహోత్రన్యాయం
- అగ్న్యానయన న్యాయం
- అగ్నివమ్రిన్యాయము
- నిప్పునకు చెదలు పట్టునా?
- అగ్నివహ్నిన్యాయము
- అగ్నిని అగ్ని తగులఁ బెట్టఁ గలదా?
- అచలచలన్యాయము : నడచుచున్న యోడమొదలగువానిపై నెక్కి పోవునపుడు కదలక నిలచియున్న తీరము వృక్షములు మున్నగునవి నడచుచున్నట్లును, నడచుచున్న యోడ నిలిచినట్లును కన్పించును.
- అజగరన్యాయము : కొండచిలువ నిద్రబోవుచున్నట్లే పడియుండి తన్ను సమీపించిన జంతువును ఆకస్మికముగఁ బట్టి మ్రింగివేయును.
- అజాకృపాణీయన్యాయము : కత్తి లేనికారణమున దన్ను జంపఁజాలక యుపాయ మరయుచున్న యొకపురుషునిపై మేక యొకటి మదమున గాలు ద్రవ్వెను. అట్లు త్రవ్వినమట్టిలో నొకకృపాణము బయటపడెను. వాఁ డది గైకొని దానిం దెగటార్చెను.
- అజాగళస్తనన్యాయము :మేక మెడక్రింది చన్నులు నిష్ప్రయోజనములు. (కళా. 1-17 )
- అణుకులాచలన్యాయము : అణువునకు పర్వతమునకుఁ గల తారతమ్యము.
- అతిపరిచయన్యాయము :అతిపరిచయముచే నవజ్ఞ గలుగును.
- అపరాహ్ణచ్ఛాయాన్యాయము : అపరాహ్ణము దాటిన తరువాత మనుష్యుని నీడ క్రమక్రమముగ ఉత్తరోత్తర మభివృద్ధి నొందుచు జరకాలవ్యాపిని యవును. అట్లే ఉత్తరోత్తరాభివృద్ధి, చిరకాలవ్యాపకతలయం దీన్యాయ ముపయోగింపబడును.
- అపృచ్ఛోత్తరన్యాయము : అడుగ కుండగనే ప్రత్యుత్తరము చెప్పుట.
- అప్రసక్తనిషేధన్యాయము : వెనుకటి గ్రంథమువలన జెప్పఁబడిన ధర్మము సంబంధము లేని స్థలమందు గూడఁ బ్రసక్తించి నపుడు దానిని నిషేధించవలయును గాని ప్రసక్తించనిది నిషేధించ గూడదు.
- అభావవిరక్తి న్యాయము ఒక విషయమై ప్రయత్నించి అది లభించనియప్పుడు 'దానితో మనకేమి ప్రయోజనము' అని విరక్తి జెందినయట్లభినయించుట.'లోతున పడిపోయిన కాని గంగార్పణం .'
- అభ్రమయూరన్యాయము మేఘమును జూచినచో నెమలికి సంతోషము
- అయస్కాంతసూచీన్యాయము సూదంటురాయి సూదిని చటుక్కున నాకర్షించును.
- అరణ్యరుదితన్యాయముఅడవిలో నేడుచున్న వాని నాదరించి యోదారుచువారు లేరు. అరణ్యరోదనము
- అర్ధజరతీన్యాయముశరీరమునందు కొంతభాగము వార్ధకమును, కొంతభాగము యౌవనమును గలిగియుండుట యసంభవము. (ముఖలావణ్యమున యువతియు, స్తనపతనమున జరతియు ననుట యుపపన్నము గాదు.)
- అర్ధత్యాగసుఖన్యాయము ధనము వ్యయము చేసిన సుఖము గల దనుట.
- అలంకృతిశిరశ్ఛేదన్యాయము ఒడలుతయు నలంకరించి తల తెగ వేయుట.
- అలాతపిశాచన్యాయము కొఱవిని చూచి దయ్య మనుకొనునట్లు.
- అలాబూపాషాణన్యాయము రాతిలో బుట్టిన సొరకాయ రాతినెరియ యెట్లుండునో యట్లే పెరుగును.
- అవినాభావసంబంధన్యాయము ఒక దానికొకటి సంబంధించి యుండుట. (కుండయు, మట్టివలె పూవు, తావివలె)
- అవ్యాపారవ్యాపారన్యాయము పని లేని వాఁడు పనిగల్గినవానిని చెఱచుట. (కూసేగాడిద మేసేగాడిదను చెఱచెనన్నట్లు)
- అహికుందలన్యాయము కుండలాకారముగా చుట్టలు చుట్టుకొనుట సర్ఫమునకు స్వాభావికథర్మ మయీసటె మనుష్యునకుఁగల స్వాభావిక గుణము తదనుగుణముగ సవశ్యము ప్రవర్తించును.
- అశ్మలోష్టన్యాయము మంటిబెడ్డ దూదికంటె కఠీనమే యైనను పాషాణము కంటే మెత్తనిదె.
- అశ్వత్థపత్రన్యాయము గాలి యున్నను లేకున్నను, రావియాకు కదలుచునే యుండును.
- అక్షండభేషజన్యాయము కంటికి రాయు మందు బుడ్డకు రాచినట్టు.
అం
[మార్చు]గొప్పయేనుఁగు చిన్న అంకుశమునకు లోఁబడినట్లు.
ఊడుగచెట్టు గింజలు క్రింద రాలి యురుము వచ్చినతోడనే మరల మ్రాని నంటు కొనును.
బుడ్డను నమ్మి యేటఁ బడినట్లు.
కుండలోనున్న దీపము పైకి ప్రకాశింపక లోపలనే వెలుగును.
గ్రుడ్డివాని చేతిలోని దీపము వాని కేమియు నుపయోగింపదు.
పిచ్చుకదగ్గఱ చప్పట్లు కొట్టిన అది చేతిలోనికి వచ్చునా ? (అసంభవమని భావము.)
కొందఱు గ్రుడ్డివాండ్రు ఒకరివెనుక నొకరు బోవుచు, మొదటివాఁడు నూతిలోఁ బడఁ దక్కినవా రందఱు వాని త్రోవనే యనుసరించి నూతిలోఁ బడిరి.
నలుగురు గ్రుడ్డివాండ్రు ఏనుఁ గెట్లుండునో పరీక్షింపఁగోరి యొక యేనుఁగువద్దకుఁ బోయి నలుగురు నాలు గవయవములను తడవి చూచి పరీక్షించిరి. కాలు తడవినవాఁడు యేనుఁగు రోలువలె నుండుననియు, తోఁక తడవినవాఁడు చీపురువలె నుండుననియు, చెవులు తడవినవాఁడు చేటవలె నుండుననియు, తొండము తడవినవాడు రోకలివలె నుండుననియు వారు వాదింపఁజొచ్చిరి.
గ్రుడ్డియెద్దు చేనిలోఁబడి తన నోటికందినదెల్ల తినును.
గ్రుడ్డివాడు ఆవుతోక బట్టుకొని నడచినట్లు.
గ్రుడ్డివాని కద్దము చూపినట్లు.
గ్రుడ్డివానికి దీప మున్నను లేకున్నను నొక్కటే.
గ్రుడ్డివాని భుజమున కుంటివాఁడు కూర్చుండి మార్గము దెలుపుచుండ నిరువురును అన్యోన్యసాహాయ్యమున దమ గమ్యస్థానము చేరుట.
ఒక గ్రుడ్డివా డేదైన తెలివితక్కువపని చేసినయెడల తక్కినగ్రుడ్డివాం డ్రందఱు నదియే చేయుదురు.
గ్రుడ్డివాని కంటికి కాటుక పెట్టినట్లు.
గ్రుడ్డివానికి గ్రుడ్డివాఁడు త్రోవ చూపినట్లు.
గుఱ్ఱము గ్రుడ్డిదైనను గుగ్గిళ్ళు తినుటలో పెద్ద.
గ్రుడ్డికన్ను మూసినను తెఱచినను ఒకటే.
క
[మార్చు]తిత్తులు, పాలు ఉండుట అసంభవము, ఆపాలు త్రాగుట అంతకన్న అసంభవము.
కాకుల దంతములను పరీక్షింప బూనుకొన్నట్లు. 'కాకదంతపరీక్ష' కళా. 3.272.
చేతిలోని ముసిరికాయవలె (స్పస్టముగ) నున్నదన్నట్లు.
తన చేతిలోని దీపము తన కుపయోగించక యితరుల కుపయోగించునట్లు.
చేతిలోని రేగుపండువలె (తేలికగా) నున్న దన్నట్లు.
ఆవుండగా గాడిదను పాలు పితికినట్లు.
ఏనుగు మింగిన వెలగపండు పైకి పండువలె నున్నను లోపలిగుంజంతయు హరించును.
సూకరసంతానము వంతున.
పీత..... పిల్లలు పుట్టినతోడనే చచ్చును.
కాకి వాలగానే అప్రయత్నముగా తాటిపండు పండినటట్లు.
కాకిముక్కున దొండపండు గట్టినట్లు.
కోవెల కాకులచే బెంచబడినను కాకి కాకియే, కోవెల కోవెలయే. (కాక కాక పిక పిక.)
ఒంటికంటి చూపు గల కాకికి రెండు కన్నులు ఉండియేమి ప్రయోజనము?
పగలు కాకికూత విని జడిసి కాంతుని కౌగిలించుకొన్న కాంత రాత్రి నర్మదానదిని దాటి వెళ్లినదట.
కాకి యేప్రక్క చూచిన ఆప్రక్కనున్న కన్నే కనబడును గాని, ఒకసారిగ రెండు కన్నులును కనబడును.
కాకికి దంతము లుండవు. కావున కాకికి దంతము లెన్ని యని పరీక్షింపబోవుట నగుబాటు.
గాజుకుప్పెలోని దీపము ఎంతగాలివీచినను కదలదు.
కార్యమునుబట్టి కారణమును నిర్ధారణ చేసినట్లు.
కార్యసిద్ధి గోరువాడు గర్వపడరాదు.
దర్భ దొరకనిచో రెల్లే దర్భగా నుపయోగించుకొన్నట్లు. (ఏటబడి కొట్టుకొనిపోవువాడు దర్భపుడక దొరకినను పట్టుకొనును.)
కుండలో బెట్టినదీపము పైకి గాన్పించకున్నను లోపల వెలుగుచునే యుండును.
కుమ్మరపురువు మట్టిలో పొరలాడుదున్నను దానికి మట్టి యంటుకొనదు.
ఈగ చిన్నదైనను కడుపులో జొచ్చి తిన్న యన్నమంతయు వెడలగ్రక్కించును. "ఈగ కడుపు జొచ్చి యిట్టట్టు సేయదా" వేమన.
నూతిలో నున్న తాబేలు ఆనూయియే సమస్తప్రపంచమని భావించును.
కొంప లంటుకొన్న తరువాత నూయి త్రవ్వ నారంభించినట్టు.
నూతిలోనున్న కప్ప అనూయియే సమస్తప్రపంచమని భావించును. భీమే. 1.13.
నూతిలోని నీరు చేదునపుడు యంత్రము లోని ఘటమొకపుడూర్ధ్వగతిము నొకపు డథోగతియు నొందు చుండును.
తాబే లొకచో గ్రుడ్లుపెట్టి అటునుండి నెడలిపోవును. దానికి ఆగ్రుడ్ల సంగతియే జ్ఞాపకములో నుండదు. ఆగ్రుడ్లును చెడిపోక అట్లే యుండును. హఠాత్తుగ ఎన్నడో దానికి గ్రుడ్లవిషయము స్ఫురణకు వచ్చును. వెంటనే ఆగ్రుడ్లు పిల్ల లగును. ఈన్యాయము చాలవఱకు గురుశిష్యన్యాయమునకు సన్నిహితముగ నుండును.
తాబేలు తన తల కాళ్లు చేతులు మున్నగు నవయవము లన్నియు తనకడుపులోనికి లాగికొని జాగ్రతపెట్టుకొనును.
గుమ్మడికాయలదొంగ లెవరనిన భుజములు తడవి చూచు కొన్నట్లు.
లోభివానిధనము లోకులపాలు.
మెల్లకంటివా డొకవైపు చూచుచుండ వేఱొకవైపు చూచుచున్నట్లు కాన్పించును.
మొగలిపూవు సువాసనగలది యైసను, ముండ్లు గలిగి యుండుటచే కోసికొనుటకు శక్యముగాకుండును.
- కంటకన్యాయము
- ముల్లుతీసికొనుటకు ముల్లే కావలయును.
- "ఛలం ఛలేన వంచయేత్"
- కంబళభోజనన్యాయము
- గొంగళిలో భోజనముచేయుచు వెండ్రుక లేరినట్లు.
- కజ్జలజలజన్యాయము
- కాటుకయు నీళ్లును గలిసిన నీళ్లు నల్లబడవు, కాటుక కఱగదు.
- కణజమూషకన్యాయము
- గాదెక్రింది పందికొక్కు గాదెలోనే జీవించును.
- కతకరేణున్యాయము
- చిల్లగింజ అరుగదీసి బురదనీటిలో గలిపిన ఆగంధమ నీటిని బురద నుండి వేఱుపఱచి తా నదృశ్యమవును.
- ;కదళీకంటకన్యాయము *ముల్లు అరటియాకుమీద బడినను, అరటియాకు ముల్లు మీద బడినను అరటియాకునకే మోసము.
- కదళీకాకన్యాయము *కదళీవంధ్య, కాకవంధ్య.
- *ఒకమాఱుమాత్రమే ప్రసవించి మఱల గర్భములేని స్త్రీ 'కదళీవంధ్య' అనబడును.
- *కాకులు గ్రుడ్లుపెట్టుచునేయుండును. కాని కోవెల ఆ గ్రుడ్లను త్రోసివేసి తాను ఆ గూటిలో గ్రుడ్లుపెట్టును. కాకిపెట్టినగ్రుడ్లు కాకికి మాత్రము దక్కక వెంటనే నశించిపోవును. అట్లే శిశువులు పుట్టుట, వెంటనే పోవుట కల ఆడుది ' కాకవంధ్య ' అని చెప్పబడును.
- కదంబముకుళన్యాయము
- కడిమిచెట్టుపువ్వు లొకదానిలోనుండి మఱొకటి వరుసగ దండవలె నుండును.
- కపోణిగుడన్యాయము
- వంచకులు మోచేతికి బెల్లము రాచికొని మాధుర్యలోభమున జవిగొనవచ్చిన యమాయకుల నొప్పింతురు.
- కమఠీదుగ్ధపానన్యాయము
- ఆడుకప్పను గుర్తించుట కష్టసాధ్యము. దానికి సాల
ఖ
[మార్చు]- ఖండితశాఖాన్యాయము కొమ్మ తెగగొట్టినను మరల చిగిర్చుచుండును.
- ఖడ్గకోశన్యాయము ఒఱచూచి కత్తి కలదని భయపడి పాఱిపోయినట్లు.
- ఖరాశ్వన్యాయము చూడగా చూడగా గుఱ్ఱము గాడిదయైనట్లు.
- ఖర్వాపేక్షితఫలన్యాయము పొట్టివాఁడు అందని ఫలములకు చేయి జాపినట్లు.
- ఖలేకపోతన్యాయము కళ్ళములోఁ బావురములు వ్రాలి గింజలు తినుచుండ, వానిని బట్టుకొనుటకై యెఱుకవాడు వలవేయఁగా అవన్నియు నొక్కసారిగా లేచి వల యెత్తుకొని పోయినవి.
- ఖల్వాటబిల్వీయన్యాయము బట్టతలవాడు ఎండవేడిమికి తాళఁజాలక నీడకై మారేడు చెట్టుక్రిందికి రాఁగా కాయ తలపైఁబడి గాయము పడెను.
- ఖాదకఘాతుకన్యాయం
గ
[మార్చు]- గగనకుసుమన్యాయము - ఆకాశమున పుష్పములు పూచినట్లు.
- గగనరోమంధన్యాయము - ఆకాశమున ఆవులు నెమరవేసిన నురుగున్నట్లు. అసంభవమని తాత్పర్యము.
- గంధర్వనగరన్యాయం
- గంధాసక్తషట్పదన్యాయం
- గగనకుసుమన్యాయం
- గగనరోమంథన్యాయం
- గగనారవిందన్యాయం
- గజఘటాన్యాయం
- గజనిమీలనన్యాయం
- గజపర్దనన్యాయం
- గజభుక్తకపిత్థన్యాయం
- గజశర్ధన్యాయం
- గజస్నానన్యాయం
- గడూలికాప్రవాహన్యాయం
- గణపతిన్యాయం
- గతజలసేతుబంధనన్యాయం
- గతానుగతికన్యాయం
- గర్గశతదండన్యాయం
- గర్తజంబుకన్యాయం
- గర్తవర్తిగోధామాంసవిభజనన్యాయం
- గర్దభన్యాయం
- గర్దభరోమగణనన్యాయం
ఘ
[మార్చు]- ఘటీయంత్రన్యాయము
- ఘట్టకుటీప్రభాతన్యాయము
- ఘరట్టన్యాయము
- ఘుణాక్షరన్యాయము
- ఘృతకోశాతకీన్యాయము
- ఘోటకబ్రహ్మచర్యన్యాయము
చ
[మార్చు]- చండాలబ్రాహ్మణన్యాయము
- చంద్రచకోరన్యాయము :
చంద్రునిరాఁకకు చకోరాలు వేచియున్నట్లు.
- చంద్రచంద్రికాన్యాయము :
చంద్రునితో బాటు వెన్నెల - అవినాభావసంబంధము.
- చక్రభ్రమీన్యాయము
- చక్షుశ్శ్రవణన్యాయము
- చర్వితచర్వణన్యాయము :
నమలినదే మఱల నమలినట్లు.
- చాతకీ జీమూత న్యాయము
- చాలనీన్యాయము :
జల్లెడలో పోసి జల్లించినట్లు.
- చిత్రపట న్యాయము :
ముందు రేఖలు గీచి పిదప బొమ్మను వ్రాసినట్లు.
- చిత్రాంగనా న్యాయము :
చిత్రపటము లోని అందకత్తెను జూచి సంతసించినను కౌగిలించు కొనరు.
- చిత్రానలన్యాయము
- చిత్రామృతన్యాయము :
బొమ్మలోని అమృతమువలె అనుభవింప యాగ్యము కానిది.
- చోరాపహార్యన్యాయము
- చిత్రితాంగజంబుకన్యాయము
ఛ
[మార్చు]- ఛత్రిన్యాయము
- ఛాగపశున్యాయము
- ఛురికాకూశ్మాండన్యాయము : కడవెడు గుమ్మడికాయ కత్తిపీటకు లోకువ.
- ఊషరవృష్టిన్యాయము *చవిటినేలను వర్షము గురిసినట్లు.
- ఊషరబీజన్యాయము *చవిటినేలలో విత్తనములు చల్లినట్లు.
- ఉష్ట్రశూలన్యాయము *ఒంటెకు గలశూల రోకళ్ళతోగాని చక్కబడదు.
జ
[మార్చు]- జంబుకారగ్వధన్యాయము
- జతుకాష్ఠన్యాయము
- జపాస్ఫటికన్యాయము
- జలచంద్రన్యాయము
- జలతరంగన్యాయము
ర
[మార్చు]వ
[మార్చు]మూలాలు
[మార్చు]- ఆంధ్రభారతి లోని న్యాయములు.
- తిరుమల పెద్దింటి నరసింహాచార్యులు, సంస్కృత న్యాయాలు: అధ్యాత్మిక విశేషాలు, విశాఖపట్నం, 2013