కంప్యూటరు నిఘంటువు
స్వరూపం
కంప్యూటరు నిఘంటువు | |
కృతికర్త: | ప్రవీణ్ యిళ్ళ |
---|---|
దేశం: | భారత దేశము |
భాష: | తెలుగు |
విభాగం (కళా ప్రక్రియ): | నిఘంటువు |
ప్రచురణ: | సురవర.కామ్ |
విడుదల: | 2012 |
పేజీలు: | 96 |
2004 లో మొదలైన తెలుగు యూనీకోడ్ అంతర్జాల విప్లవం, అనేక మంది తెలుగు వారిని మరింత దగ్గరగా చేర్చి తెలుగు బ్లాగులు, వివిధ గుంపుల్లో పూర్తిగా తెలుగు లిపితో అంతర్జాల కార్యక్రమాలు చేసుకునే వెసులుబాటు కలిగించింది. ఈ వాతావరణంలో అనేక ఆంగ్ల సాంకేతిక పదాలకు తెలుగు పదాలు మరల ప్రాచుర్యం పొందే వేదికగా ఈ వాతావరణం దోహదం చేసింది. తెలుగు పదాలపై చర్చలు, పాత తెలుగు పదాలు మరింత వాడుకలోకి తీసుకురావడం, కొత్త తెలుగు పదాలు నిష్పాదించడం, లినక్స్,, ఇతర జాలగూళ్ళు తెలుగీకరించడం వంటి పలు కార్యక్రమాలు పురోగతి సాధించాయి. ఆ విధంగా వచ్చిన పదాలలో 1900వరకు ఏరికూర్చి, వివరము, ఆంగ్ల ఉదాహరణ, తెలుగు ఉదాహరణలతో పూర్తి యూనీకోడు ఖతులువాడి ముద్రించిన పుస్తకం ఈ కంప్యూటరు నిఘంటువు. దీనిలో ఖతి, అంతర్జాలం, వేగు ఇలా ప్రఖ్యాతి వహించిన అనేక తెలుగు సాంకేతిక పదాలు చోటుచేసుకున్నాయి.
బయటి లంకెలు
[మార్చు]- ప్రచురమకర్త జాల పుట http://suravara.com Archived 2013-01-02 at the Wayback Machine
- రచయిత బ్లాగు https://web.archive.org/web/20120924224440/http://telugulinux.blogspot.in/
- ఈ-పుస్తకం, ప్రింటు పుస్తకం సోల్ డిస్ట్రిబ్యూషన్ https://web.archive.org/web/20190428112414/http://kinige.com/