Jump to content

కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్

వికీపీడియా నుండి

భూ లావాదేవీలు మరి ఇతర లావాదేవీల నమోదుని సౌకర్యవంతం చేయటానరి కార్డ్ కంప్యూటర్ ఎయిడెడ్ అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ రిజిస్ట్రేషన్ డిపార్టుమెంట్ అనబడే కంప్యూటరీకరణ విధానం అమలులోకి వచ్చింది.కార్డ్ను రెవెన్యూ శాఖతో అనుసంధానం చేశారు దీనివలన .తహసీల్దారు కార్యాలయాల్లోని తాజా భూ వినియోగ సమాచారం, నిషేధించిన ఆస్తుల వివరాలు, వ్యవసాయేతర ప్రయోజనాలకు మార్పుచెందిన భూముల వివరాలు లాంటి విషయాలన్నీ తెలుస్తాయి. మీ సేవ వ్యవస్థ ద్వారా ఆస్తులను కొనే ముందు పరిశీలించుకొనే"ఇన్‌కంబరెన్స్ (ఈసీ) పత్రాలు పొందడం సులభమైంది

రిజిస్ట్రేషన్ ప్రక్రియ

[మార్చు]

భూమి పై హక్కు ప్రభుత్వ ఆధ్వర్యంలో ఏర్పాటయిన నమోదు కార్యాలయాలద్వారా లావాదేవీలను నమోదు చేసినప్పుడే చట్టబద్ధత కలుగుతుంది. లావాదేవీని తెలిపే పత్రాన్ని [1] నమోదు చేయాలి.దీనిని సంబంధిత రిజిష్ట్రార్ కార్యాలయం లోనే చేయాలి. దీనికి లావాదేవి సమ్మతమని తెలిపే వ్యక్తి, దానివలన హక్కును పొందే వ్యక్తి తగిన ఫీజులు చెల్లించి, రిజిష్ట్రార్ ముందు సాక్షుల సమక్షంలో సంతకాలు చేయాలివేలిముద్రలు వేయాలి. ఈ తరహా వివరాలను దస్తావేజు వెనక భాగం వాడతారు. రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తయ్యాక దానికి సంబంధించిన దస్తావేజులను స్కాన్‌ చేసి ఒక కాపీని సబ్‌ రిజిస్ట్రార్‌ తనవద్ద ఉంచుకుని, అసలు మూలపత్రాన్ని రిజిస్ట్రేషన్‌ చేయించుకున్న వ్యక్తులకు ఇస్తారు.

సాధారణంగా ఒక ప్రాంతానికి చెందిన భూమిని సంబంధిత రిజి స్ట్రార్‌ వద్దే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవాల్సి ఉంటుంది.సంబంధిత సబ్‌ రిజిస్ట్రార్‌ వైఖరి వల్ల రిజిస్ట్రేషన్‌ చేయించుకునేం దుకు వీలుకావటం లేదని ఫిర్యాదులు వచ్చినందున ఏ ప్రాంతానికి చెందిన స్థిరాస్తినైనా ఏ సబ్‌రిజిస్ట్రార్‌ వద్దనైనా రిజిస్ట్రేషన్‌ చేయించుకొనే వీలుని ప్రయోగాత్మకంగా ఇందుకోసం మొదటిగా హైదరాబాదు‌, హైదరాబాదు‌ దక్షిణం, రంగారెడ్డి, రంగారెడ్డి దక్షిణం, విశాఖపట్నం, అనకాపల్లి, విజయవాడ, విజయవాడ తూర్పు, గుంటూరు, తిరుపతిల్లో అమలుచేయనున్నారు. దీనికొరకు భూముల మదింపు విలువలను, వాటి రిజిస్ట్రేషన్‌ ఛార్జీల వివరాలను ఆన్‌లైన్‌లో అందుబాటులోకొచ్చాయి.

ఆస్తి విలువలు

[మార్చు]

ఒక సర్వే నెంబరులోని భూమి మొత్తానికి ఇల్లు, పొలానికి ఒకే రకం మార్కెట్‌ ధర ఉంటుంది. ఆ ప్రాంతంలో ఇళ్లు ఎక్కువగా ఉంటే ఇళ్లకు సంబంధించిన విలువలనే లెక్కగడతారు.రోడ్ల వెంబడి గల ఇళ్లకు అధిక ధరలను లెక్కగడతారు. ప్రభుత్వం నిర్ధారించిన ధరలను కాదని, తక్కువ ధరలకు రిజిస్ట్రేషన్‌ చేయడం కుదరదు. ఇందుకు అనుగుణంగా ప్రస్తు తం ఉన్న12 రిజిస్ట్రేషన్‌ స్లాబుల సంఖ్యను గ్రామాల్లో 5 నుంచి 6 స్లాబులకు, పట్టణాల్లో 6 స్లాబుల నుంచి 3-4కు తగ్గిస్తారు.

బ్యాంకుల నుంచి రుణాలు తీసుకోవాలనుకునేవారికి ఆస్తి తనఖా రిజిస్ట్రేషన్‌ చేయాలి.

ఎన్‌కంబరెన్సు సర్టిఫికెట్‌ (ఈసీ)

[మార్చు]

భూమి విలువపై హక్కులను తెలిపే ధ్రువపత్రాన్ని ఎన్కంబరెన్స్ సర్టిఫికేటు (ఈసీ) అని అంటారు. భూమిని తనఖా పెట్టి రుణం తీసుకున్నప్పుడు ఆ భూమిపై ఆప్పు ఇచ్చిన వారికి హక్కు వుంటుంది. ఈ తనఖాని నమోదు చేసినప్పుడు ఈ భూమిపై ఆసక్తిగలవారెవరైనా ఈ వివరాలు కార్యాలయం ద్వారా తెలుసుకొనగలుగుతారు.

పౌరుని హక్కులు

[మార్చు]

నమోదు శాఖ పనితీరుని పారదర్శకంగా చేయాటానికి పౌర హక్కుల విధానాన్ని ప్రవేశపెట్టారు.

  • సాధారణంగా ఏ తరహా దస్తావేజుకైనా సబ్‌ రిజిస్ట్రార్‌ గంట వ్యవధిలోనే రిజిస్ట్రేషన్‌ ప్రక్రియ పూర్తిచేసి, దాన్ని సంబంధిత వ్యక్తులకు అందజేయాలి. ఆస్తి విలువను తక్కువగా చూపించారనో, మరో కారణంతోనో దస్తావేజును నెలల తరబడి పక్కన పెట్టేందుకు వీలులేదు. దానిపై కేవలం ఏడు రోజుల్లో నిర్ణయం తీసుకోవాలి.
  • దస్తావేజులో ఆస్తి విలువను తక్కువగా చూపించారని సబ్‌ రిజిస్ట్రార్‌ భావిస్తే దాన్ని 5 రోజుల్లోగా జిల్లా రిజిస్ట్రార్‌కు పంపాలి.
  • తన వద్దకు వచ్చిన దస్తావేజును జిల్లా రిజిస్ట్రార్‌ 3 నెలల్లోగా పరిష్కరించాలి.
  • స్టాంపు రుసుముకు సంబంధించి నిర్ణయాన్ని తీసుకోవాల్సిన దస్తావేజులను జిల్లా రిజిస్ట్రార్‌ ఐజీకి పంపకూడదు స్టాంపు రుసుం ఎక్కువ, తక్కువలపై జిల్లా రిజిస్ట్రార్‌ స్థాయిలోనే ఓ కొలిక్కి తేవాలి. అవసరమనుకుంటే ఆస్తి కొనుగోలుదారుడే ఐజీకి అప్పీలు చేసుకోవాలి.
  • తన వద్దకు వచ్చిన స్టాంపు రుసుం వ్యవహారాలన్నింటిపైనా జిల్లా రిజిస్ట్రార్‌ నిర్ణయం తీసుకొని ఆ విషయాన్ని ఆరు రోజుల్లోగా సబ్‌ రిజిస్ట్రార్‌కు తెలియజేయాలి.

స్టాంపు పేపర్లు

[మార్చు]
తెలుగులో రాయబడిన ఇండియా రిజిష్ట్రేషన్ దస్తావేజు (సా.శ. 1945 కాలం నాటిది), స్కాన్ లో చాలావరకు ఉంది.

121సాంప్రదాయకంగా లావాదేవీలను నాణ్యతగల కాగితం పై వ్రాయవలసి వచ్చేది. ప్రభుత్వం స్టాంపు ఫీజు రాబట్టుకొ నటానికి ఆ కాగితం పై ప్రభుత్వం స్టాంపు ముద్రించి దానిని అమ్మేవారు. నాసిక్‌లో ముద్రితమయ్యే స్టాంపు పేపర్లను రాష్ట్రానికి తరలించడానికి, పంపిణీ చేయడానికి పలు సమస్యలు ఎదురవుతున్నాయి.రాష్ట్రంలో 2వేల మంది స్టాంపుల విక్రయదారులున్నారు. వీరు రూ.10, రూ.20, రూ.50 రూ.100 విలువగల స్టాంపు పేపర్లను అమ్ముతుంటారు. స్టాంపు పేపర్లను కొన్నిసార్లు ప్రైవేటు విక్రేతలు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. ఒప్పందాలను రాసుకోవడానికి తప్పనిసరిగా స్టాంపు పేపరు ఉండాలనే నిబంధనేదీ లేదు, వాటిని దళసరి తెల్లకాగితంపైనా రాసుకోవచ్చు.స్టాంపు పేపరుపై రాసుకున్నా రిజిస్ట్రేషన్‌ చేయిస్తేనే చట్టబద్ధత లభిస్తుంది.

స్టాంప్‌ ఫీజులు

[మార్చు]

ప్రస్తుతం వసూలు చేస్తున్న 9.5 శాతంలో స్టాంపు రుసుం, బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్‌ రుసుంలు కలిసి ఉంటున్నాయి. స్టాంపు రుసుం గరిష్ఠంగా 5 శాతంగాను, దానికి బదిలీ సుంకం, రిజిస్ట్రేషన్ల రుసుం కలిపి ఇకపై గ్రామాల్లో 8.5 శాతం, పట్టణాల్లో 7.5 శాతం చొప్పున ఉంటుంది.

వనరులు

[మార్చు]
  1. దస్తావేజులు వ్రాయడం ఎలా? గిరిజ శ్రీభగవాన్, 2006,జెపి పబ్లికేషన్స్, విజయవాడ