కేఈ కృష్ణమూర్తి
(కంబాలపాడు కృష్ణమూర్తి నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation
Jump to search
కంబాలపాడు ఈడిగె కృష్ణమూర్తి (జననం: అక్టోబర్ 2, 1938) కేఈ కృష్ణమూర్తిగా బాగా గుర్తింపు. ఇతను 2014 సార్వత్రిక ఎన్నికలలో కర్నూలు జిల్లా, పత్తికొండ నియోజకవర్గం నుండి శాసనసభ్యునిగా ఎన్నికై చంద్రబాబు నేతృత్వంలో ఏర్పడిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సభ్యునిగా కొనసాగుతున్నారు. ఇతను 1978, 1983, 1985, 1989, 2009, 2014లలో శాసనసభ్యునిగా ఎన్నికయ్యారు. ఇతను తిరుపతి, ఎస్వీ యూనివర్శిటీలో ఎంఏ చదివారు. మధ్యప్రదేశ్ సాగర్ యూనివర్శిటీలో ఎల్ఎల్బీ చేశారు. ఈయన స్వగ్రామం కృష్ణగిరి మండలం కంబాలపాడు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
మూలాలు[మార్చు]
సాక్షి దినపత్రిక - 9-6-2014