Jump to content

కగుర (నృత్య రీతి)

వికీపీడియా నుండి

కగురా (神楽 (かぐら) , "దైవ వినోదం" ("గాడ్-ఎంటర్‌టైన్‌మెంట్") అనేది షింటో ఆచార వేడుకల్లోని ఒక నిర్దిష్టమైన నృత్యం. ఆచరణలో దేవుని ఉనికిని సూచించే ఈ పదబంధం "కమి నో కురా (దైవ పీఠం) " కి సంక్షేపం. కగురా యొక్క ఒక ప్రధాన విధి "చింకోన్ (ఆత్మను శుద్ధి చేసి, కదిలించడం) ". ఇది ఊరేగింపు-పూనకాల తో కూడిన ప్రక్రియ. సాధారణంగా ఒక మంత్రగత్తె (షమన్) నృత్యం చేస్తూ, దేవతలను వంటిమీదికి వచ్చిన అనుభూతిని (ఒరాకిల్) లోనై ---- అలా ఏర్పడ్డ రంగంలో (సెట్టింగ్‌లో) , పూనకంతో నర్తిస్తూ ఆ నర్తకి తానే స్వయంగా దైవంగా మారుతుంది. [1] ఒకప్పటి కమి'గాకరి (神懸 (かみがかり) , (దైవీ కరణ "ఓరాక్యులర్ డివినిఫికేషన్") ప్రక్రియ నుంచి ఉద్భవించిన ఈ ఉత్సవ కళ, కగురా ఒక సహస్రాబ్ది కి పైగా భిన్న దిశల్లో వికసించింది. నేటికీ ఇదొక సజీవ సంప్రదాయంగా, వ్యవసాయ క్యాలెండర్ లయలతో పెనవేసుకున్న ఆచారాలుగా, ప్రధానంగా షిమనే మండలం (ప్రిఫెక్చర్‌) లోని కొన్ని ప్రాంతాల్లోనూ, హిరోషిమా వంటి పట్టణ కేంద్రాల్లోనూ వర్ధిల్లుతోంది.

మెయ్ -ఓడోరి

[మార్చు]

కాగురాలో మై, ఒడోరి అనేవి రెండు ప్రధాన రకాలు. మెయ్, వృత్తాకారం గా నిశ్శబ్దంగా, గాంభీర్యం తో అతి నెమ్మదైన కదలికలను ప్రదర్శిస్తుంది; ఇక ఒడోరి అతి వేగమైన కదలికలతో చురుకుగా గెంతటం, దూకడం లాంటి క్రియాశీల శక్తిని ప్రదర్శిస్తుంది. ఈ రెండూ కాగురా కు రెండు పదబంధాలుగా అర్థం చేసుకోవచ్చు --మెయ్ అనేది సమ్మోహక స్థితి (ట్రాన్స్) కి చేసే తొలి ప్రక్రియ అయితే ఓడోరి అనేది గాఢమైన అపస్మారక దశ.

మెయ్ నృత్యలో, మంత్రగత్తె (షమన్) , పూజారులు సమూహం తనను చుట్టుముట్టి, గోహీ లు (శుభ్రం లేదా శుద్ధి కోసం వాడే ఒక ఉత్సవ మంత్రదండం), ఇతర వాయిద్యాలను పట్టుకుని, దేవతలను పిలుస్తూ ప్రదక్షిణలు చేస్తుండగా, తను నెమ్మదిగా సమ్మోహన స్థితిలోకి ప్రవేశిస్తుంది, ఆమె కదలికలు ఒక్కసారిగా పూనకంగా మారిపోతాయి కదలికలకు, దీనిని ఓడోరి అంటారు. [2]

చరిత్ర

[మార్చు]

కోజికి, నిహోన్ షోకి లాంటి ఇతిహాసాలు ఈ నృత్యాల పుట్టుకకు సంబంధించిన ఒక జానపద కథను వివరిస్తాయి. ఈ గ్రంథాల్లో, సూర్య దేవత అమతెరసు కు సంబంధించిన ఒక ప్రసిద్ధ పురాణ కథ ఉంది. ఆమె ఒక గుహలోకి వెనుదిరిగి వెళ్లగా, ప్రపంచాన్ని చీకటి, చలి కమ్మెస్థాయి. అప్పుడు ఉషస్సు, ఉల్లాసాలకు దేవతైన అమే-నో-ఉజుమే, ఇతర దేవతలను ఆటవిక నృత్యంలోకి రప్పిస్తుంది, దాంతో ఆ గొడవ (రక్కస్) ఏమిటో చూడటానికి అమతెరసు బయటకు తిరిగి వచ్చేలా ఒత్తిడికి గురి చేస్తుంది. ఈ ఘటన నుంచి అనేక ఆచారాలు, కళలు ఉద్భవించాయి. వాటిలో కాగురా ఒకటి.

కముకురా లేదా కమికురా, కగుర అనేవి నిజానికి ప్రారంభంలో మందిరపు కన్యలు (మంత్రగత్తెలు,మికో( Miko)) రాజధర్బార్ లో చేసే పవిత్ర నృత్యాలు. ఆ కన్యలను ఆమె-నో-ఉజుమె వారసులుగా భావించేవారు. ప్రదర్శన సమయంలో, మందిరపు కన్యలు సాధారణంగా దైవ సమ్మోహితం (ట్రాన్స్‌) కోసం ముసుగులు, ఈటెలు లాంటి ఉపకరణాలు ఉపయోగిస్తారు. దేవతలను ఆవాహన చేయగల శక్తి ఉన్న కగురా సంగీతం వినిపిస్తుండగా, ఆ కన్య (మైకో) దేవతలకు ఆవాహనా మధ్యమంగా, దేవతల నుండి సందేశాలను ఆశీర్వాదాలను స్వీకరించడానికి నృత్యం చేయడం ప్రారంభిస్తుంది. [2] 1871లో, జపాన్‌కు పశ్చిమాన పూజారులు ప్రదర్శించిన కగుర కళా ప్రదర్శనలు తమ గౌరవాన్ని కించపరిచాయని, ఇవామి షింటో కార్యాలయాలు ప్రదర్శనను నిషేధించాయని పేర్కొన్నారు. పౌర ప్రదర్శన బృందాల మద్దతుతో, ఆ సమయంలోని ప్రదర్శన శకలాలూ ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. [3]

అయితే, కాలక్రమేణా, ఇంపీరియల్ కోర్టుల పవిత్ర, ప్రత్యేక ప్రాంగణాల్లో ఈ మికగుర ప్రదర్శనలు కొనసాగాయి. ఇది ఎన్నో ప్రసిద్ధ ఆచార నృత్యాలకు ప్రేరణనిచ్చింది. సతోకగుర (satokagura) పేరుతో దేశవ్యాప్తంగా ప్రసిద్ధ రూపాలుగా, గ్రామాలలోనూ, ఇతర జానపద సంప్రదాయాలకు అనుగుణంగానూ అనేక విభిన్న రూపాల్లోకి అభివృద్ధి చెందింది. వీటిలో మైకో కగురా, షిషి కగురా, ఇసే- స్టైల్, ఇజుమో- స్టైల్ కగురా నృత్యాలు ఉన్నాయి. శతాబ్దాలుగా మరెన్నో వైవిధ్య రూపాలుగా అభివృద్ధి చెందాయి. వాటిలో కొన్ని చాలా నూతనమైనవిగాను, వాటిలో అనేకం అత్యంత లౌకిక జానపద సంప్రదాయాలుగానూ మారాయి.

ఈ కగురా, ప్రత్యేకించి కథ చెప్పడం లేదా కల్పిత కథల పునర్నిర్మాణం వంటి రూపాల ద్వారా నోహ్ కళా రంగం (థియేటర్‌) పైన ప్రాథమికమైన ప్రభావం చూపింది.

ఇంపీరియల్ కగురా

[మార్చు]
నిక్కొ తోష్ఓ-గు వద్ద కగురా-గుహ

మికగుర (御神楽) రాజధర్బారుల్లోనూ, ప్రముఖ షింటో పుణ్యక్షేత్రాలైన కమో-జింజా, ఇవాషిమిజు హచిమాన్-గో లలో ప్రదర్శించే ఒక ఆచార నృత్యం. [4] ఇది హాస్య భరితంగానో, కవితాత్మకమగానో దేవతలను స్వాగతించడం, అలరించడం, పలకరించడం కోసం పాడే పాటలతో కూడుకొని ఉంటుంది. నేడు కొన్ని సార్లు ఇది గగాకు ఉప కళా రూపంగా భావించడం జరుగుతోంది. దీనిపైన ఆ ప్రభావమూ ఉంది. [5] దీనిపై పూర్వపు చైనీస్ స్ఫూర్తి ఉన్నా, ప్రాంతీయ మూలకాలతో బాటు, కంగెన్ (管弦) , బుగాకు (舞楽) , సైబారా (催馬楽) , లాంటి గగాకు రూపాల ప్రభావం ఉంది. [6][7] క్లుప్తంగా చెప్పాలంటే మికాగుర, గగాకు సంగీతం తో సాగే నృత్యం. [8]

కగురా-డెన్ ఔ నిక్కో టోషో-గు. కగురా ఉటా అనేది 26 పాటల (నివాబి, అచిమే, సకాకి, కరాకామి, హయకరకామి, కొమోమాకురా, సజానామి, సెంజాయ్, హయౌతా, హోషి, అసకురా, సోనోకోమా మొదలైనవి) తో కూడిన పవిత్రమైన స్వర కచేరీ. ఒక గాయకుడు కొన్ని రోజులపాటు సాంప్రదాయకంగా సాగించే ఈ కచేరీ నేడు ఆరు గంటలు సాగే 12 కీర్తనల కచేరిగా కుదించడం జరిగింది. [6] వీటలో ఒక జాపనీస్ వేణువు (Japanese transverse flute (?)) , లేదా ఒక సంప్రదాయ సన్నాయి (hichiriki) , వీలైతే ఒక యమాటోగొటో (yamatogoto) , శకుబ్యోషి క్లావ్స్ (shakubyoshi claves) [4] వాడతారు.

మికగురా నృత్యాలు అనేకం ఉన్నాయి, వాటిలో కొన్ని: [6]

  • యమటో మెయ్ (大和舞, "డాన్స్ ఆఫ్ జపాన్") , యమటో ఉటా (大和歌, "సాంగ్ ఆఫ్ జపాన్") తో అనుసంధానమై, వేణువు రయుటెకి లేదా హిచిరికితో, షకుబియోషి జంటను జితార్‌తో కలిపి, లేదా లేకుండా ఉపయోగించడం;
  • అజుమా అసోబి (東遊, "గేమ్ ఆఫ్ ఓరియంటల్ కంట్రీస్") , కొమాబు ఫ్లూట్‌ని ఉపయోగించడం;
  • కగురాబు, హిచిరికి, బండిని ఉపయోగిస్తూ కుమే మెయ్ (久米舞, "డ్యాన్స్ ఆఫ్ కుమే") , కుమే ఉటా (ఉటా కుమే?) తో అనుసంధానమైంది.

అధికారిక సార్వభౌమ (ఇంపీరియల్) ఆచార నృత్యాల (మికగురా) ప్రదర్శనలు, పవిత్ర స్థలాలలోనూ, అనేక ప్రత్యేక సందర్భాలలోనూ జరిగేవి. సార్వభౌమ అభయారణ్యంలో, పవిత్ర అద్దం ఉన్న చోట గగాకు ధర్బారు సంగీతంలోని భాగంగా ప్రదర్శించేవారు. ఇంపీరియల్ హార్వెస్ట్ ఫెస్టివల్ అప్పుడు, ఇసే, కామో, ఇవాషిమిజు హచిమాన్-గో వంటి ప్రధాన పుణ్యక్షేత్రాలల్లో కూడా ఈ మికాగురా ప్రదర్శనలు జరుగుతాయి. గత 1000 సంవత్సరాలుగా ప్రతి ఏటా ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

ఇంపీరియల్ హౌస్‌హోల్డ్ ఏజెన్సీ కి చెందిన ఆచార విభాగం ప్రకారం, ఇప్పటికీ ప్రతి డిసెంబరు మాసంలో ఇంపీరియల్ అభయారణ్యంలోనూ, ఇంపీరియల్ పంటల పండుగల వేడుకల్లోనూ మికాగురా ప్రదర్శనలు కొన సాగుతున్నాయి.

జానపద కగురా

[మార్చు]

సతోకగుర, లేదా "సాధారణ కగురా" అనేది విస్తృతార్థక పదం, ఇది ఇంపీరియల్ ఆచార నృత్యాల (మికాగురా) నుండి రూపు దిద్దుకుని, ఇతర జానపద సాంప్రదాయ రీతులను సమ్మిళితం చేసుకున్న ఒక వైవిద్య భరితమైన ఆచార నృత్యం. ఇది నోహ్, క్యోజెన్ ల మూలం వద్ద ఉంటుంది. [9] ఎంపిక చేసిన కొన్ని సాంప్రదాయాలు సంక్షిప్తంగా : [4]

మికో కగురా
  • మికో కగుర - పుణ్యక్షేత్ర కన్నెలు (Miko) రాజదర్బారుల్లో చేసే నృత్యాలు. నిజానికి ఇవి ఆ దర్బారుల్లో వారు జీవాత్మ (కమి) మాధ్యంగా చేసే కర్మాచార నృత్యాల నుండి రూపు దిద్దుకుంది. ఇవి నిజానికి బిగువ తనంలేని రూపంలో, దైవాన్ని ఆవహింప చేసుకునే ఇతర నృత్యాలలాగానో, ఆచారాల లాగానో ఉంటాయి, కానీ కాలక్రమేణా అవి అత్యంత నియమిత రూపాల్లోకి అభివృద్ధి చెందాయి. నేడు, వారు డెయిజో -సాయి (大嘗祭) పండుగ సందర్భంగా పుణ్యక్షేత్రాల్లోనూ, మట్సురి లో భాగంగా కమి ఆరాధన లోనూ ప్రదర్శిస్తున్నారు. బౌద్ధ దేవాలయాలలో కూడా వీటిని యుద్ధ కళా ప్రదర్శనాలుగా అభినయిస్తున్నారు. ఈ నృత్యాలలో తరచుగా కర్మాచారాలలో వాడే గంటలు, వెదురు కర్రలు, సకకి కొమ్మలు, లేదా కాగితపు జెండాల లాంటివి వినియోగిస్తారు.
ఇజుమో-రై కగురాలో సుసానూ, ఒరోచి
  • యిజుమో-ర్యు కగుర (Izumo-ryū kagura) – ఇజుమో పుణ్యక్షేత్రంలో ప్రదర్శనలను అనుసరిచి చేసే నృత్యాలు ఎన్నో శుద్ధి కర్మలలోనూ, పవిత్ర వేడుకల దినాలలోనూ, జానపద కథల పునర్నిర్మాణ ప్రక్రియలోనూ, ఇలా అనేక విధాలుగా ఉపయోగపడుతున్నాయి. నిజానికి ఇజుమో సమీపంలోని ఛుగోకు ప్రాంతం (chūgoku region) లో బాగా ప్రాచుర్యం లో ఉన్న ఈ నృత్యాలు, దేశవ్యాప్తంగా విస్తరించి, శతాబ్దాలుగా అభివృద్ధి చెందాయి. ఇవి ఒక అధికారిక మతపరమైన ఆచారాల కన్నా, లౌకిక జానపద వినోదంగానే ఎక్కువ ప్రసిద్ది. సదా పుణ్య క్షేత్రపు పవిత్ర నృత్యాన్ని, యునెస్కో 2011 [10]లో తన అమూల్యమైన మానవ సాంస్కృతిక వారసత్వ సంపదల జాబితాలో చేర్చింది.
  • హయచినే కగురా - ఇది యమబుషి (శక్తులను పొందేందుకు సన్యసించే సంచార సమూహం) నుండి గ్రహించిన నృత్యా శైలి. ఈ శైలి శక్తి, సత్తువల ప్రాధాన్యతగా సాగుతుంది. ప్రదర్శకులు ఎల్లప్పుడూ ముసుగులు ధరించి, యమబుషి మంత్ర శక్తి సూచించే ఢంకా, కత్తి లాంటి సాధనాలను ధరిస్తారు. [3] ఇది 2009 లో, తన UNESCO అమూల్యమైన మానవ సాంస్కృతిక వారసత్వ సంపదల జాబితాలో నమోదు చేసింది. [11]
  • యుటాటే కగుర – ఇది కన్నెలు (మికో) , పూజారులు కలిసి వెదురు ఆకులను వేడి నీటిలో ముంచి తీసి, ఆ వేడి నీటిని తమ పైకి, చుట్టూ ఉండే జనాలపైకి వెదజల్లుతూ చేసే నృత్యం.
  • శిశి కగుర - ఇది నృత్యకారులు శిషి సింహపు వేషధారులై పట్టణం అంతా బృందంగా తిరుగుతూ చేసే సింహ నృత్యం. వీరు ధరిచే సింహపు మసుగులు, దుస్తులు సింహపు ఆత్మలను ప్రతిబింబించేలా కనిపిస్తాయి. జానపద ఆరాధనా, ఆచారాలను ప్రతిబింబించే ఈ నృత్యమే కాకుండా, విభిన్న రీతుల్లో సింహ నృత్యాలు జాపాన్ లోనూ, ఇతర ప్రాంతాలలోనూ కనిపిస్తాయి.
  • దైకగుర- ఇది ఇసే గ్రాండ్ పుణ్యక్షేత్రం, అట్సుతా పుణ్యక్షేత్రం మధ్య సంచారం చేసే పూజారుల ఆచార వ్యవహారాల నుండి ఉద్భవించిన నృత్య రూపం. వారు దుష్టశక్తుల్ని తరిమికొట్టడం ద్వారా స్థానికులకు సహాయం చేయడానికి గ్రామాలు, కూడళ్లు, ఇతర ప్రదేశాలకు వెళతారు. ఈ ఆచారాలల్లో విన్యాసాలు, సింహ నృత్యాలది ప్రధాన పాత్ర.

టోకుగావా షోగునేట్ (1603–1868) పాలన ప్రారంభ కాలంలో, రూపుదిద్దుకున్న నృత్య రీతులు ఎడోలో వినోద ప్రధాన ప్రదర్శనలుగా మారాయి. షోగునేట్ పాలన ప్రారంభానికి సంబంధించిన వేడుకలలో సింహ నృత్యాలు, విన్యాసాలు, గారడీలు లాంటి అనేక వినోదాలను నగరం అంతటా వేదికలపై ప్రదర్శించారు. అన్నీ నామమాత్రంగా "దైకగురా"ల ఆధ్వర్యంలో జరిగాయి. కాలక్రమేణా, కధలు చెప్పే రకుగో కళనూ (రకుగో స్టోరీ టెల్లింగ్) , ఇతర ప్రసిద్ధ వినోద రీతులను మిళితం చేసుకుని, నేటికీ దైకగురాను వీధి వినోద అంశాలను కూడా కలుపుకుని

ప్రదర్శిస్తూనే ఉన్నారు.

ఇది కూడ చూడండి

[మార్చు]

ప్రస్తావనలు

[మార్చు]

 

  1. Averbuch, Irit (1998). "Shamanic Dance in Japan: The Choreography of Possession in Kagura Performance". Asian Folklore Studies. 57 (2): 293–329. doi:10.2307/1178756. ISSN 0385-2342. JSTOR 1178756.
  2. 2.0 2.1 Averbuch, Irit (1998). "Shamanic Dance in Japan: The Choreography of Possession in Kagura Performance". Asian Folklore Studies. 57 (2): 293–329. doi:10.2307/1178756. ISSN 0385-2342. JSTOR 1178756.
  3. 3.0 3.1 Lancashire, Terence (2001). ""Kagura" - A "Shinto" Dance? Or Perhaps Not". Asian Music. 33 (1): 25. doi:10.2307/834231. ISSN 0044-9202. JSTOR 834231.
  4. 4.0 4.1 4.2 Takayama Shigeru (February 20, 2007). "Performing Arts: Kagura". Encyclopedia of Shinto (in ఇంగ్లీష్). Archived from the original on 2011-05-19. Retrieved June 7, 2019.. ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; "EOS" అనే పేరును విభిన్న కంటెంటుతో అనేక సార్లు నిర్వచించారు
  5. Whitney Hall, John; M. Brown, Delmer; B. Jansen, Marius (1993). The Cambridge History of Japan (in ఇంగ్లీష్). Vol. 1. Cambridge University Press. p. 650. ISBN 978-0-521-22352-2. Retrieved June 7, 2019.
  6. 6.0 6.1 6.2 Akira Tamba. "Musiques traditionnelles du Japon". Actes Sud.
  7. S. Kishibe (March 1984). The Traditional Music of Japan, Ongaku no tomo edition. Tokyo: Ongaku No Tomo Sha Corp. p. 42.
  8. Véronique Brindeau. "Musiques du Japon". Philharmonie de Paris à la demande. Retrieved June 29, 2020..
  9. "Shinto Shrines". Japan National Tourism Organization (in ఇంగ్లీష్). Archived from the original on February 8, 2007. Retrieved May 4, 2009..
  10. "Le Sada shin noh, danse sacrée au sanctuaire de Sada, Shimane". ich.unesco.org. Retrieved June 7, 2019.
  11. "Le kagura d'Hayachine". ich.unesco.org. Retrieved June 7, 2019.

బాహ్య లింకులు

[మార్చు]
  • Media related to Kagura at Wikimedia Commons