కటోచు రాజవంశం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కటోచు చంద్రవంశానికి చెందిన రాజపుత్ర రాజవంశం. వారి సంప్రదాయ నివాసిత ప్రాంతం జలంధరు కేంద్రగా పాలించిన త్రిగర్త రాజ్యం.[1] ఇది కంగ్రా కోట వద్ద ఉంది.

పేరు వెనుక చరిత్ర

[మార్చు]

కటోచు అనే పదానికి రెండు మూలాలు ఉన్నాయి. కాటు (సైన్యం), ఉచు (ఉన్నత తరగతి).[2] అనే పదాల నుండి వచ్చినట్లు వంశస్థులు చెబుతున్నారు. కాని ఇతర వనరులు ఇది కోట (కోట) నుండి వచ్చినట్లు చెబుతున్నాయి. కాంగ్రా కోటను నాగరకోట లేదా కోట కాంగ్రా అని పిలుస్తారు. పాలకులు ఆ ప్రత్యేకమైన కోటలోనే నివసిస్తున్నందున వారిని "కోట్చు" (कोटच) అని పిలుస్తారు. అంటే కోట లోపల ఉన్నవారు.[3] ఇది కాలక్రమేణా కటోచు అయింది.

చరిత్ర

[మార్చు]
The strategic Kangra fort commanded the respect of the region.[3]

కటోచు వంశం ప్రధాన శాఖ కాంగ్రా రాష్ట్ర పాలకులు, ఇది కొన్ని సాక్ష్యాల ఆధారంగా ఆధునిక కాలానికి పూర్వం రవి, సట్లెజు నదుల మధ్య ఉన్న ప్రముఖ రాజ్యం.[4][5] కాంగ్రా రాజ్యాన్ని త్రిగర్త అని కూడా పిలుస్తారు. ఈ పేరు మహాభారతంలో పేర్కొన్న పురాతన త్రిగర్తరాజ్యం నుండి వచ్చింది.[6] సాంప్రదాయం ఆధారంగా మహాభారతం కాలం నుండి స్వాతంత్ర్యానికి పూర్వం వరకు కాంగ్రా పాలకులు కటోచును పాలించారు.[7]

కొండలలో పోరాడలేకపోయిన కారణంగా వీరు ముహమ్మదు బిను తుగ్లకు సైన్యాన్ని ఓడించారు. సా.శ. 1333 లో ఆయన 10,000 మంది సైనికులు మరణించిన కారణంగా ఆయన వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.[8]

ఆధునిక కాలానికి పూర్వం ఆధునిక హిమాచలు ప్రదేశు లోని కొండ రాజ్యాల మద్య బంధుత్వం, వివాహ సంబంధాలు ఉన్నప్పటికీ ఒకరితో ఒకరు నిరంతరం యుద్ధం చేసుకున్నట్లు భావించబడుతుంది. అప్పుడు వారిని అక్బరు చక్రవర్తి మొఘలు సామ్రాజ్యం ఆధ్వర్యంలోకి తీసుకువచ్చారు. అయితే మొఘలు నియంత్రణ పరిమితంగా ఉండేది. రాజ్యాల పాలకులు స్వాతంత్ర్య స్థాయిని నిలుపుకున్నారు. 1610 లో చక్రవర్తి జహంగీరు కాంగ్రా కోటను స్వాధీనం చేసుకుని చుట్టుపక్కల ప్రాంతాన్ని స్వాధీనం చేసుకుని కటోచు రాజాలను సామంతుల హోదాకు తగ్గించాడు.[5]

మొఘలు శక్తి క్షీణించిన తరువాత రాజా ఘమండు చందు (r. 1751–1823) మొఘలులకు అప్పగించిన భూభాగాన్ని చాలావరకు తిరిగి పొందాడు. రాజా సంసరు చందు (r. 1775–1823) చుట్టుపక్కల ఉన్న అన్ని కొండ రాష్ట్రాల మీద కాంగ్రా ఆధిపత్యాన్ని స్థాపించారు. ఆయన పాలనలో కాంగ్రా కళలకు ప్రధాన కేంద్రంగా మారింది. అనేక రాజభవనాలు నిర్మించబడ్డాయి.[5]

1805 వ సంవత్సరంలో పొరుగున ఉన్న కొండ రాజ్యాలు గూర్ఖా సైన్యం సహాయంతో తిరుగుబాటు చేశాయి. రాజా సంసరు చందు లాహోరు మహారాజా రంజితు సింగు సహాయంతో గూర్ఖా సైన్యాలను బహిష్కరించారు. కాని రంజితు సింగు కాంగ్రా లోయ అత్యంత సారవంతమైన భూభాగాన్ని స్వాధీనం చేసుకుని కాంగ్రా కటోచ్లతో పాటు పొరుగున ఉన్న రాజాలను సామంతుల హోదాకు తగ్గించాడు. 1846 మొదటి ఆంగ్లో-సిక్కు యుద్ధం తరువాత ఈ ప్రాంతం మొత్తం బ్రిటిషు ఈస్టు ఇండియా కంపెనీకి అప్పగించబడింది, చివరికి పంజాబు ప్రావింసులో కలిసిపోయింది. కటోచులు, చుట్టుపక్కల ఉన్న కొండ రాజాలకు చిన్న జాగీర్లను కేటాయించారు. దాని మీద వారికి ఆదాయ హక్కులు, న్యాయనిర్ణయాధికారాలు అధికారం ఉన్నాయి.[5]

వంశాలు, కుటుంబనామాలు

[మార్చు]

మధ్యయుగ కాలంలో హిమాచల ప్రదేశు, జమ్మూ ప్రాంతంలోని 14 పాలక వంశాలలో కటోచు వంశం ఒకటి. ఇతర ప్రధాన వంశాలలో జస్వాలు, గులేరియా, సిబియా, దాద్వాలు, పథానియా ఉన్నాయి.[9] దాదా అనే ప్రదేశం నుండి దాద్వాలు వచ్చింది. సిబా నుండి సిబియా వచ్చింది. గులేరు ప్రాంతం నుండి గులేరియా వచ్చింది. 11 వ శతాబ్దం తరువాత నాలుగు శాఖలు ఉనికిలోకి వచ్చాయి.[10]

పంజాబులో సిక్కు రాజవంశం పెరిగే వరకు కటోచులు తమ పేర్లకు 'చంద్ర' అనే ప్రత్యయం ఇచ్చారు. ఆ తర్వాత కొంతమంది వంశ సభ్యులు 'సింగు'అనే పేరును చేర్చడం ప్రారంభించారు. ఏదేమైనా ఈ రోజు చాలా మంది వంశ సభ్యులు, ఉప వంశాలతో సహా, చందు వంశానికి సబంధితమై ఉన్నాయి.[11] 1930 ల సంస్కరణల వరకు కటోచు మహిళలు పశ్చిమ దిశగా మాత్రమే వివాహం చేసుకున్నారు. సాధారణంగా పథానియా, జామ్వాలు, జమువాలు పురుషులతో. ఉప-వంశం దాని స్వంత స్థితిని వర్గీకరించింది. పశ్చిమానికి దూరంగా వారు వివాహం చేసుకున్నారు.[12]

రాజవంశాలు పాలించిన ప్రాంతాలు

[మార్చు]

గత శతాబ్దాలలో వంశం, దాని శాఖలు త్రిగర్త ప్రాంతంలో అనేక రాచరిక రాజ్యాలను పరిపాలించాయి. త్రిగర్త మూడు నదుల మధ్య ఉన్న భూమిని సూచిస్తుంది. అవి బియాసు, సట్లెజు, రవి.[13] ఏదేమైనా రాజవంశం భూములను కోల్పోయి 17 వ శతాబ్దం నాటికి ఒక చిన్న కొండ రాజ్యంగా తగ్గించబడింది. వంశం మూలం " రాజనక భూమి చందు".[14] వారి పాలకులలో రెండవ సంసార చందు, రాజనక భూమి చందు ఉన్నారు. తరువాతి వారు హిమాచల ప్రదేశు లోని జ్వాలముఖి ఆలయాన్ని స్థాపించాడు.

మూలాలు

[మార్చు]

వనరులు

[మార్చు]
  1. Brentnall, Mark (2005), The Princely and Noble Families of the Former Indian Empire: Himachal Pradesh, Indus Publishing, p. 312, ISBN 978-81-7387-163-4
  2. Anthropological Survey of India (1998). Singh, Kumar Suresh (ed.). India's Communities. Vol. 5. Oxford University Press. p. 1613. ISBN 978-0-19-563354-2. KATOCH They derive their nomenclature from the word Kat (army) and uch (upper class)
  3. 3.0 3.1 Jeratha, Aśoka (2000). Forts and Palaces of the Western Himalaya (2000 ed.). Indus Publishing. p. 20. ISBN 9788173871047. The Kangra fort is situated at a peculiar strategical situation overlooking deep furrows leading to wide spanned stream. The fort, now in ruins, once commanded respect among the hill chieftains... It was popularly known as Nagarkot or Kot Kangra. Kot denotes a fort and Nagar denotes a town, so collectively it meant the fort of the town. The clan who ruled Kot Kangra was named Katoch after Kot. In fact, this fort was so peculiar in its situation and formidable features that it became a unique structure among the prevailing forts. So the clan ruling this fort was known as Katoch.
  4. Prasad, Shankar (2005), The Gallant Dogras: An Illustrated History of the Dogra Regiment, Lancer Publishers, pp. 16, 21, 34, ISBN 978-81-7062-268-0
  5. 5.0 5.1 5.2 5.3 Parry, Jonathan P. (2013), Caste and Kinship in Kangra, Routledge, pp. 11–13, ISBN 978-1-136-54585-6
  6. Chakrabarti, Dilip K.; Hasan, S. Jamal (1984), The antiquities of Kangra, Munshiran Manoharlal, p. 7
  7. Jeratha, Aśoka (2000). Forts and Palaces of the Western Himalaya (2000 ed.). Indus Publishing. p. Preface. ISBN 9788173871047.
  8. Chandra, Satish (1997). Medieval India: From Sultanate to the Mughals. New Delhi, India: Har-Anand Publications. pp. 101–102. ISBN 978-8124105221.
  9. Charak, Sukh Dev Singh (1978). History and culture of Himalayan states Himachal Pradesh Volume I. Light & Life Publishers. p. 17. ISBN 9788120609426.
  10. Jeratha, Ashok (1998). Dogra Legends of Art & Culture (1998 ed.). Indus Publishing. p. 22. ISBN 9788173870828.
  11. Jeratha, Ashok (1998). Dogra Legends of Art & Culture (1998 ed.). Indus Publishing. p. 22. ISBN 9788173870828. These rajput clans suffixed their family names after their proper names for instance Katoch rajas suffixed Chandra. Chambials suffixed Varman, Suketias suffixed Sen while as Jaswal and Sibials suffixed Chand.
  12. Parry, Jonathan P. (2013). Caste and Kinship in Kangra. Routledge. p. 220. ISBN 978-1-136-54585-6.
  13. Jeratha, Asoka (2000). Forts and Palaces of the Western Himalaya (2000 ed.). Indus Publishing. p. 21. ISBN 9788173871047. Trigarta, meaning land of three rivers. The three rivers referred are the Ravi, the Beas, and the Sutlej
  14. Charak, Sukh Dev Singh. History and Culture of Himalayan States, Vol. 1 (1978 ed.). pp. 134–136.