కతల గంప

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కతల గంప తెలుగు కథలసంకలన పుస్తకము.పుస్తక రచయిత స. వెం. రమేశ్.

రచయిత

[మార్చు]

స. వెం. రమేశ్ తెలుగు భాషాభిమాని, తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషా పరిరక్షణ సమితిలో చుఱుకైన సభ్యులు. వీరు వ్రాసిన ప్రళయ కావేరీ కథలు చాలా ప్రసిద్ధి పొందాయి. ప్రస్తుతం పులికాట్ సరస్సుగా వ్యవహరింపబడుతున్న ప్రళయకావేరీ తీరాన రచయిత గడిపిన బాల్యంలోని కొన్ని సన్నివేశాలను రచయిత కథలుగా మలిచి చదువరులకు అందించారు.ఈయన శ్రీలంకలోని తెలుగు వారి తెలుగు భాషా భివృద్దికి అధ్భుతంగా కృషిచేస్తున్నారు.ఒక దశాబ్దం క్రిందట ఆయన నెల్లూరు యాసలో వ్రాసిన ప్రళయ కావేరి కథలు వలన ఆశేషాంధ్ర చదువరుల్ని ఉర్రూతలూరించాడు.రమేశ్ గారు తెలుగు భాషోద్యమ కార్యకర్త .తెలుగు భాషాలోకంలో అచ్చ తెలుగు పదాల వేట కొనసాగిస్తున్న అన్వేషకుడు, అలుపెరగని భాషాభిమాని. తెలుగులో ఇతర భాషా పదాలకు బదులుగా ఎంత అందమైన మధురమైన తెలుగు పదాలున్నయో తనరచనలో ఉపయోగించి తెలుగు పాఠకులను, చదువరులను అబ్బురపరచాడు.

పుస్తక పరిచయం

[మార్చు]

పుస్తకంలో ఉన్న 18 కతలు ఉన్నాయి. వాటి క్రమం:

  • తెలుగు సిన్నోడు తిమ్మరాయప్ప
  • మీసర వాన
  • ఊడల్లేని మర్రి
  • పదిమందికి పెట్టే పడసాల
  • ఆ అడివంచు పల్లె
  • కాకికి కడవడు పిచిక్కి పిడికిడు
  • రయికముడి ఎరగని బతుకు
  • చెట్లు చెప్పిన కత
  • సిడిమొ‌యిలు
  • బడకొడితి
  • వాడు గోపాలకృష్ణ కొటాయి
  • ఒంటినిట్టాడి గుడిసె
  • ఎందుండి వస్తీవి తుమ్మీదా
  • అబ్బిళింత
  • కతలగంప
  • మాదిగపుటక కాదు
  • మొ‌యిలు నొగులు
  • పాంచాలమ్మ పాట

అట్టమీద బొమ్మ వేసింది బి కిరణ్ కుమారి.ప్రతి కథ చివర అందులో తను వాడిన కొన్ని పదాలకి…అందరికీ అర్ధం అయ్యే తెలుగు పదాల అర్ధం ఇచ్చాడు.చెట్లు చెప్పినకత, అబ్బిళింత, పదిమందికి పెట్టేపడసాల, మీసరవాన, ఎందుండివస్తీవి తుమ్మీదా, కతల గంప వంటికథలు తెలుగులో అచ్చమైన మానవ సంబంధాలను ఎత్తి చూపించాయి.అచ్చమైన, స్వచ్ఛమైన గ్రామీణ మట్టివాసన వెదజల్లే, పరిమళించే గ్రామీణ తెలుగు పదాల కమ్మదనాన్ని పాఠకులకు అనుభవంలోకి తీసుకు వచ్చాడు రచయిత రమేశ్.కొని చదువవలసిన, దాచుకోదగిన, సాహితీ మిత్రులకు కానుకగా ఇవ్వదగిన పుస్తకము.

ఇవికూడా చదవండి/చూడండి

[మార్చు]
  • ప్రళయకావేరి కథలు[1]
  • ఎల్లలు లేని తెలుగు[2]
  • "మొరసునాడు కతలు" (ఇదిస.వెం.రమేశ్ మరియుస. రఘునాథ సంపాదకత్వంలో వెలువడిన కథల సంకలనం) [3]

మూలాలు

[మార్చు]
  1. "ప్రళయకావేరి కథలు. స.వెం.రమేశ్. స. వెం. రమేశ్". patrika.kinige.com/. Archived from the original on 2014-07-14. Retrieved 2015-03-01.
  2. "ఇతరములు". andhrajyothy.com. 2 Feb 2015. Retrieved 2015-03-01.[permanent dead link]
  3. "KinigeFebruary 22, 2013". facebook.com/Kinige/posts. February 22, 2013. Retrieved 2015-03-01.
"https://te.wikipedia.org/w/index.php?title=కతల_గంప&oldid=3805363" నుండి వెలికితీశారు