Jump to content

కథా కావ్యాలు

వికీపీడియా నుండి

కథా ప్రక్రియ ఎప్పుడు మొదలయ్యిందో ఏమో తెలియదు. బహుశా ఆదిమానవులు రాత్రి వేళల్లో నెగడు చుట్టూ చేరినప్పుడు తాము చూసిన, విన్న సాహసాలను, వింతలను వర్ణించి చెప్పుతూ చెపుతూ, కథలకు బాటలు వేశారేమో. లేదా నలుగురు కలిసి దారివెంబడి నడుస్తూ తమ ప్రయాణములో అలసట తెలియకుండా ఉండటానికి తమకి ఉన్న ఊహలకి రంగులు అద్ది కథలకి రూపం ఇచ్చాడేమో. తమ ఆలోచనలకి , అనుభవాలకి అందమైన కల్పనలను జోడించి జానపదుల జీవనంలో సన్నివేశాలను కథలుఅగా అందించారేమో. ఏదైనా కావచ్చు. రామాయణ కథను నారదుడు వాల్మీకి మహర్షికి సంక్షిప్తంగా చెప్పినట్టు మనము చదువుకున్నాము. ఈ వ్యాసములో కొన్ని కథల పేర్లని , ఆయా రచయితలని , కొన్ని కథలని గుర్తుకు తెచ్చుకుందాము.

హాలుని గాధాసప్తశతి కథలు. ఇందులో మొత్తము ఏడు వందల కథలు ఉన్నాయి. అవన్నీ చిన్న చిన్న పద్యములుగా మనకు కనిపిస్తాయి.

భేతాళ పంచవింశతి. బేతాళ పంచవింశతి యొక్క సంస్కృత మూల గ్రంథం దొరకడము లేదు.. దీనికి రెండు సంస్కృత పాఠంతరాలు లభ్యం అవుతున్నాయి. అవి 1) క్షేమేంద్రుని విరచితమైన బృహత్కథామంజరి 2) సోమదేవసూరి విరచితమైన ‘కథాసరిత్సాగరం’ ఈ రెండింటిలోనూ 25 బేతాళ కథలు చోటుచేసుకొన్నాయి.

పంచతంత్ర కథలు. సంస్కృతములో విష్ణుశర్మ అనే పండితుడు రచించిన కథలు ఇవి. తెలుగులో పరవస్తు చిన్న్నయ్య సూరి, కందుకూరి వీరేశలింగంపంతులుగారు తెలుగులోనికి అనువదించారు. విష్ణుశర్మ మూర్ఖులైన రాజకుమారులను వివేకవంతులుగా మార్చటానికి ఎన్నుకున్న విధానము కథా ప్రక్రియ.కథలు అనేవి చిత్రవిచిత్రాలైన మలుపులు ,మహిమలు , వినోద ,నీతి అంశాలతో కూడుకున్నవి కథల సంపుటి గా రాసేటువంటి వాటిని విమర్శకులు కథా కావ్యాలుగా చెప్పడం జరిగింది . ముఖ్యంగా కథా కావ్యాలలో ఆ నాటి సాంఘిక , సామజిక , ఆర్థిక , పరిస్థితులను తెలుసుకోవడానికి ఎంతగానో దోహదపడుతాయి . అంతే కాకుండా కథ కథనం లో శిల్పం ఉంటుంది. ఆలాంటి కథలకు ఉదాహరణ ఈ కాశీ మజిలీ కథల వంటి పద్ధతులు కూడా కావ్యాల్లో కనబడుతుంది అయితే తెలుగులో  అనేకం కనబడతాయి.

కేతన దశకుమార చరిత్ర

[మార్చు]

క్రీస్తుశకం  1200-1280 మధ్యకాలం వాడైనా , కేతన   ఇతను తిక్కన శిష్యుడు సంస్కృతంలో దండి రాసిన దశకుమార చరిత్ర అనే గద్య కావ్యాన్ని చంపూ కావ్యంగా రచించాడు .

దశకుమార చరిత్రము తెలుగులో లో మొట్టమొదటి కథాకావ్యం గా పేర్కొన్నారు. కానీ ఇది అది అనువాదం అని కొందరు వ్యతిరేకిస్తున్నారు.

ఇందులో దశకుమారుల సాహస చర్యలను వారి ప్రేమ వృత్తాంతాన్ని కావ్యంలో మనోహరమైన వర్ణాలతో, సామాజిక చిత్రణతో కేతన 12 ఆశ్వాసాలు రచించాడు.

మంచన కేయూరబాహు చరిత్ర

కథాకావ్యాలు మంచన   కాలంలో కూడా ప్రారంభమైనాయి అయితే క్రీస్తుశకం 1300 ప్రాంతం నాటి వాడైనా తన గురించి ఎక్కడ లేకపోవడం వల్ల వివరాలు తెలియకున్నాయి . మంచన రచించిన కేయూరబాహు చరిత్ర వెలనాటి చోళరాజు  ఆస్థాన మంత్రి అయిన గుండ మంత్రి అంకితమివ్వడం జరిగింది.  

సంస్కృతంలో రాజశేఖరుడు రచించిన ‘’ విద్ధసాలభంజిక ‘’  అనే నాటిక కి కేయూరబాహు చరిత్ర చంపు రూపమైన స్వతంత్ర అనువాదమైన మనోహర కావ్యాన్ని మంచన పంచతంత్రం    హితోపదేశాలనుంచి, జన ప్రచారంలో ఉన్నవాటిని కథలన్నీ గ్రహించాడు ప్రధాన కథతో సంబంధంలేని చిన్న చిన్న కథలు చాలా ఉన్నాయి.