కథ 2017 (పుస్తకం)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కథ 2017
కృతికర్త:
సంపాదకులు: మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పలనాయుడు (కథ 2017)
వాసిరెడ్డి నవీన్, పాపినేని శివశంకర్ (కథా సాహితీ)
దేశం: భారతదేశం
భాష: తెలుగు
ప్రక్రియ: కథలు
ప్రచురణ: కథాసాహితి (సికింద్రాబాదు)
విడుదల: 2018
పేజీలు: 232

కథ 2017 కథాసాహితి వారు ప్రచురించిన 15 ఉత్తమ కథల సంకలన పుస్తకం. 51 తెలుగు పత్రికల్లో తెలుగు కథకులు రాసిన కథల నుండి 15 కథలను ఎంపిక చేశారు.[1]

పుస్తక నేపథ్యం[మార్చు]

సంపాదకులు[మార్చు]

  • కథ 2017: మధురాంతకం నరేంద్ర, అట్టాడ అప్పలనాయుడు
  • కథా సాహితీ: వాసిరెడ్డి నవీన్‌, పాపినేని శివశంకర్‌

ఆవిష్కరణ[మార్చు]

ఉత్తరాంధ్ర రచయితలు, కళాకారుల వేదిక (ఉరకవే) ఆధ్వర్యంలో శ్రీకాకుళంలోని గ్రాండ్‌ హోటల్‌లో 2018, నవంబరు 25న (ఆదివారం) పుస్తకావిష్కరణ జరిగింది. ఈ కార్యక్రమంలో కథా సాహితీ సభ్యులు, రచయిత, వయొలిన్‌ విద్వాంసుడు, సంగీత కళాశాల విశ్రాంత అధ్యాపకుడు ద్వారం దుర్గాప్రసాదరావు పుస్తకాన్ని ఆవిష్కరించగా, కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత, కథానిలయం వ్యవస్థాపకుడు కాళీపట్నం రామారావు, గంటేడ గౌరునాయుడు, కె.శివారెడ్డి, బి.వి.ఎ. రామారావు నాయుడు, పుస్తక సంపాదకులు, రచయితలు పాల్గొన్నారు.[2]

కథలు[మార్చు]

క్రమసంఖ్య కథ పేరు రచయిత పేరు ప్రచురణ
1 పూర్ణమాణిక్యం ప్రేమకథలు డా. వి. చంద్రశేఖరరావు ఆంధ్రప్రదేశ్ మాసపత్రిక, 2017 జనవరి
2 ద్వాదశి చిరంజీవి వర్మ చినుకు మాసపత్రిక, 2017 జనవరి
3 అనుత్తర కుప్పిలి సుదర్శన్ తెలుగు వెలుగు మాసపత్రిక, 2017 జనవరి
4 పిరమిడ్ పాపినేని శివశంకర్ ఆంధ్రజ్యోతి ఆదివారం, 2017 ఫిబ్రవరి 5
5 అమర్ కథ మధురాంతకం నరేంద్ర విశాలాంధ్ర ఆదివారం, 2017 ఏప్రిల్ 9
6 అతడి బాధ సన్నపురెడ్డి వెంకటరామిరెడ్డి తెలుగుపలుకు - తానాసభల జ్ఞాపిక 2017
7 కూసింత చోటు మోహిత తెలుగుపలుకు - తానాసభల జ్ఞాపిక 2017
8 ప్రవాసం రిషి శ్రీనివాస్ ఆంధ్రజ్యోతి ఆదివారం, 2017 జూలై 16
9 స్వల్పజ్ఞుడు తాడికొండ కె. శివరుమార శర్మ కౌముది.నెట్ అంతర్జాల మాసపత్రిక, 2017 ఆగస్టు
10 ముట్టు గుడిసెలు శాంతి నారాయణ పాలపిట్ట మాసపత్రిక, 2017 సెప్టెంబరు
11 కాకిగూడు ఎం.ఎస్.కె. కృష్ణజ్యోతి తెలుగు వెలుగు మాసపత్రిక, 2017 అక్టోబరు
12 అవినిమయం వాడ్రేవు చినవీరభద్రుడు విశాలాంధ్ర దినపత్రిక దీపావళి ప్రత్యేక సంచిక, 2017
13 ఇగురం గల్లోడు కొట్టం రామకృష్ణారెడ్డి ఆంధ్రజ్యోతి ఆదివారం, 2017 డిసెంబరు 10
14 ఇట్లు మీ స్వర్ణ పి. సత్యవతి చినుకు మాసపత్రిక, 2017 డిసెంబరు
15 శ్రేయోభిలాషి అట్టాడ అప్పల్నాయుడు చినుకు మాసపత్రిక, 2017 డిసెంబరు

మూలాలు[మార్చు]

  1. కథల ఎన్నిక కోసం పరిశీలించిన పత్రికలు, కథ 2017, కథాసాహితి ప్రచురణ, నవంబరు 2018, సికింద్రాబాదు, పుట. 219.
  2. ఆంధ్రజ్యోతి, తెలుగు వార్తలు (26 November 2018). "సిక్కోలులో 'కథ 2017' ఆవిష్కరణ". Archived from the original on 17 మార్చి 2020. Retrieved 17 March 2020.