Jump to content

కదిలే మెట్లు

వికీపీడియా నుండి
లండన్లో కానరీ వార్ఫ్ లో కదిలే మెట్లు.

కదిలే మెట్లు (escalator) అనునది కట్టడాలలో అంతస్థుల మధ్య జనుల పయనం వీలుచేసే ఒక కన్వేయర్ (వాహక) రవాణా పరికరం. దీనిలో వేరువేరు మెట్లు పట్టాలమీదుగా పైకి, క్రిందకి వెళ్ళు విధంగా గొలుసుతో కట్టబడి ఉంటాయి. పట్టాలు మెట్టు సమతలానికి సహకరిస్తాయి. సాధారణంగా ఒక మోటారుతో గొలుసు నడపబడుతుంది. లిఫ్టు అవకాశం లేని చోట పాదచార రవాణా కదిలేందుకు కదిలే మెట్లను వాడుతారు. ప్రధానంగా దీనిని వాడే ప్రాంతాలు ప్రభుత్వ భవానాలు, విమానాశ్రయాలు, షాపింగ్ మాల్లు, హోటల్లు, రైలు నిలయాలు మొదలైనవి.

వీటికి ప్రజలను ఎక్కువ సంఖ్యలో తరలించగలిగే సామర్థ్యం ఉంది. సాధారణ మెట్లు ఆక్రమించే స్థలాన్నే ఇవీ తీసుకుంటాయి. వేచి ఉండవలసిన ఘడియలు కూడా రావు (బారీ రద్దీ కల్గినప్పుడు తప్పించి). వెలుపలి వాడుకకు వాతావరణ నిరోదితం చేయవచ్చు. మిగిలిన రవాణా పరికారాలకు విరుద్ధంగా, పనిచేయనప్పటికీ కదిలే మెట్లు మామూల మెట్లులాగ ఉపయోగపడతాయి.

ఫుజిటెక్ ఎస్కలేటర్ చర్యలో ఉంది, 2020

కార్యచరణ

[మార్చు]
కత్తెర పోలియున్న కదిలే మెట్ల సమూహం

కదిలే మెట్లు సెకనకు సుమారు 0.3 నుండి 0.6 మీటర్ల స్థిరవేగంతో ఏసి విద్యుత్ శక్తితో నడుస్తాయి. నేలకు 30 డిగ్రీల కోణంలో వాలి, సుమారు 18 మీటర్ల ఎత్తు తీసుకెళ్తుంది. కదిలే మెట్లలో మూడురకాల ఆకృతీకరణలు చూడవచ్చు:

  • సమాంతర: ఎగువ దిగువ దారులు ప్రక్కప్రక్కన అమర్చి ఉంటాయి. కొన్నిసార్లు రెంటి మధ్యలో కాస్త ఖాళీస్థలం ఉండవచ్చు. సాధారణంగా ఈ రకమే అధికసంఖ్యలో కనబడతాయి.
  • కత్తెర-పోలి: ఎగువదారి వెళ్ళే మెట్లను అలాగే దిగువదారి మెట్లను ఒకదానిపై మరొకటి పేర్చి, విస్తరించే స్థలాన్ని తగ్గిస్తారు. ఇరుకు స్థలాలలో వీటిని వాడుతారు.
  • బహుళ సమాంతర: బహు ఎగువ దిగువ దార్లు ప్రక్కప్రక్కన ఉంటాయి. రద్దీగా ఉండే ప్రదేశాలలో వీటిని వాడుతారు.

వాడుకరుల భద్రత కొఱకు కదులుతున్న అడుగుల సమకాలికంగా చేతుల పెట్టుకోవటానికి కదిలే చేపట్టాలు (handrail) కూడా ఉండవలిసిన అవసరం ఉంది. కదిలే మెట్లు శాశ్వతంగా ఒకే దిక్కున వెళ్ళేవిధంగా, లేదా సిబ్బంది నియంత్రించే విధంగా రూపొందించవచ్చు.

రూపకల్పన మఱియు అమరిక పరిగణనలు

[మార్చు]

కదిలే మెట్ల రూపకల్పనకు స్థానిక రద్దీ, శారిరిక సదుపాయం, సౌందర్య ప్రాధాన్యతలు వంటి అంశాలు ప్రభావితం చేస్తాయి. ముందుగా, విస్తరించవలసిన నిలువు, అడ్డ దూరం వంటి భౌతిక కారకాలు పరిగణనతో కదిలే మెట్ల పొడువు, వెడల్పు నిర్ణయించబడతాయి. భవన నిర్మాణం భారీ భాగాలకు మద్దతు కల్పించి ఉండాలి. ప్రజానీకం సులువుగా కనుగొనే ప్రదేశంలో ఉండాలి. ఎగువ దిగువ దారులు తగిన దూరంలో ఉండి, తేలిక జనప్రవాహం వీలుచేయాలి. ట్రాఫిక్ నమూనాలను కూడా ఊహించాల్సియుంది. కొన్ని భవనాలు, ఒక అంతస్తు నుండి మరొకదానికి ప్రజలను తరలించడమే లక్ష్యం కావచ్చు, కానీ ఇతర భవనాలకు మరిన్ని నిర్దిష్ట అవసరాలు ఉండవచ్చు. వికలాంగుల, వీలుకుర్చీ అవసరాలను విస్మరించరాదు.

భాగాలు

[మార్చు]
  • దిగుటకు ప్లాట్ఫారం
  • ఇనుప దూలం
  • పట్టాలు
  • అడుగులు
  • చేపట్టాలు

ఉపయోగ స్థలాలు

[మార్చు]
  • షాపింగ్ మాల్లు
  • ప్రజా రవాణా స్థలాలు
  • కర్మాగారాలు, ఇతర పారిశ్రామిక ఉత్పత్తి అనువర్తనాలు
  • సైనిక అవసరాలు

వీటిని కూడా చుడండి

[మార్చు]

బయటి లింకులు

[మార్చు]