కనకలత (మలయాళ నటి)
స్వరూపం
కనకలత | |
---|---|
జననం | |
మరణం | 2024 మే 6 తిరువనంతపురం, కేరళ, భారతదేశం | (వయసు 63)
జాతీయత | భారతీయురాలు |
వృత్తి | నటి |
క్రియాశీల సంవత్సరాలు | 1981–2024 |
తల్లిదండ్రులు |
|
కనకలత (1960 ఆగస్టు 24 - 2024 మే 6) ప్రధానంగా మలయాళ సినిమాలో పనిచేసిన భారతీయ నటి.[1][2] ఆమె మలయాళం, తమిళ భాషల్లో 360కి పైగా చిత్రాలు చేసింది. ఈ రెండు భాషల్లో ఆమె టెలివిజన్ ధారావాహికలలో కూడా ఎక్కువగానే నటించింది. ఆమె ప్రామాణి, ఇందులెఖ, స్వాతి తిరునాల్ వంటి నాటకాలలో తన నటనకు ప్రసిద్ధి చెందింది.
వ్యక్తిగత జీవితం
[మార్చు]కేరళ కొల్లాంలో పరమేశ్వరన్ పిళ్ళై, చిన్నమ్మ దంపతులకు 1960 ఆగస్టు 24న జన్మించింది. ఆమె కొల్లాంలోని ప్రభుత్వ బాలికల పాఠశాలలో చదివింది.[3] సినీ నటి కావడానికి ముందు ఆమె రంగస్థల నటిగా పనిచేసింది. 22 ఏళ్లకే వివాహం చేసుకున్న ఆమె 16 ఏళ్ల తరువాత భర్తతో విడాకులు తీసుకుంది.[4] పిల్లలు లేరు.
మరణం
[మార్చు]ఆమె 2024 మే 6న, 63 సంవత్సరాల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో మరణించింది.[5] ఆమె చాలా కాలంగా పార్కిన్సన్స్, మతిమరుపుతో బాధపడుతున్నది.[6]
మూలాలు
[మార్చు]- ↑ "Kanakalatha Death News: Mollywood actress Kanakalatha passes away at 63 after battle with Parkinson's and Dementia: Report". The Times of India. 6 May 2024. Retrieved 8 May 2024.
- ↑ "അനുഭവങ്ങള് പാളിച്ചകള്... | mangalam.com". Archived from the original on 7 December 2013. Retrieved 21 February 2014.
- ↑ "CiniDiary".
- ↑ "അനുഭവങ്ങള് പാളിച്ചകള്... - Page 2 | mangalam.com". Archived from the original on 5 November 2013. Retrieved 21 February 2014.
- ↑ "Actress Kanakalatha passes away; death at home in Thiruvananthapuram". Kerala Kaumudi. 6 May 2024. Retrieved 6 May 2024.
- ↑ "సినీ ఇండస్ట్రీలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత | Malayalam Actress Kanakalatha Passes Away at 63 | Sakshi". web.archive.org. 2024-12-19. Archived from the original on 2024-12-19. Retrieved 2024-12-19.
{{cite web}}
: CS1 maint: bot: original URL status unknown (link)