కనిగిరి చట్టు బావి
స్వరూపం
ప్రకాశం జిల్లా కనిగిరి పట్టణం లోని తరతరాల చరిత్ర బావి కనిగిరి కొండకు చరిత్ర మల్లే ఈ బావికు సైతం ఓ చరిత్ర ఉంది. కనిగిరిని పరిపాలించిన కాటమరాజు అప్పటి తమ సైనికుల దాహార్తిని తీర్చడంతోపాటు గ్రామంలోని ప్రజలకు మంచినీటి సౌకర్యం కోసం చుట్టూ కొండల నడుమ నిర్మించారు. ఈ బావి చరిత్ర తెలిపే శాసనం సైతం ఇక్కడ మనకు కనిపిస్తుంది.ఈ బావి కాలాలతో నిమిత్తం లేకుండా ఎప్పుడు నిండి ఉండడమే కాక.. స్వచ్ఛమైన నీరును అందిస్తుంది. ఈ నీరు తాగడం వల్ల గ్రామంలో ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని గ్రామ ప్రజలు నమ్ముతారు. కొందరు ముసలి వాళ్లు తమ ఇంట్లో మినరల్ వాటర్ తీసుకువస్తున్నా సరే ఈ బావి నీరు తాగడం తప్ప మినరల్ వాటర్ ని తాగడానికి ఇష్టపడరు. అందుకోసం అని కొందరు కనిగిరికి రెండు కిలోమీటర్ల దూరం ఉన్నా సరే ఈ భావి వద్దకు వచ్చి నీళ్లు చేదుకొని తీసుకెళ్తారు.[1]
మూలాలు
[మార్చు]- ↑ "రాజులు, రాజ్యాలు పోయినా.. జనం దాహార్తి తీరుస్తున్న 'చట్టు బావి'". ETV Bharat News. Retrieved 2022-07-15.