కనులు తెరిచినా కనులు మూసినా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కనులు తెరిచినా కనులు మూసినా
దర్శకత్వంసందీప్ రెడ్డి కెటి
రచనమహేష్ ఎస్‌కె, బాలాజీ ప్రసాద్, శ్రీకాంత్ రాజ్ బిట్లింగ్
నిర్మాతఎస్‌ఎన్ స్వామి
తారాగణం
  • సాయి రోనక్
  • దేవికా సతీష్
  • అర్జున్ ఆనంద్
  • ఉషాశ్రీ
ఛాయాగ్రహణందాము నర్రావుల
కూర్పుశశాంక్ మాలి
సంగీతంగౌర హరి
నిర్మాణ
సంస్థ
ఫ్లయింగ్ ఈగిల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
విడుదల తేదీ
2023 జూన్ 16 (2023-06-16)
భాషతెలుగు

కనులు తెరిచినా కనులు మూసినా 2023లో విడుదలైన తెలుగు సినిమా. ఫ్లయింగ్ ఈగిల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి బ్యానర్‌పై ఎస్‌ఎన్ స్వామి నిర్మించిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి కెటి దర్శకత్వం వహించాడు.[1]  సాయి రోనక్, దేవికా సతీష్, అర్జున్ ఆనంద్, ఉషాశ్రీ, అభిలాష్ బండారి, అనీష్ కురువిల్లా ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా జూన్ 16న ఈటీవీ విన్ లో విడుదలైంది.[2]

కథ[మార్చు]

పునీత్ (సాయి రోనక్) రాక్ స్టార్. పెళ్లి సంబంధాల విషయంలో తండ్రితో గొడవపడి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఒక పార్టీలో, అతను తన కలల రాణిగా ఉండాలనుకునే లక్షణాలు కలిగిన అదితి (దేవికా శర్మ) అనే అమ్మాయిని చూస్తాడు. ఆమెను పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. అతను ఆమె గురించి తెలుసుకుంటాడు. ఒక రోజు అదితి కిడ్నాప్ చేయబడి ఆమె స్నేహితుడు హర్ష చేత రక్షించబడతాడు. హర్ష రాకతో పునీత్ జీవితం ఎలా మలుపు తిరిగింది? హర్ష ఏం చేసాడు? అదితితో మునుపటిలా రిలేషన్ షిప్ కొనసాగించాడా లేదా? అనేదే మిగతా సినిమా కథ.[3]

నటీనటులు[మార్చు]

  • సాయి రోనక్
  • దేవికా సతీష్
  • అర్జున్ ఆనంద్
  • ఉషాశ్రీ
  • అభిలాష్ బండారి
  • అనీష్ కురువిల్లా
  • సుచిత్ర ఆనందన్

సాంకేతిక నిపుణులు[మార్చు]

  • బ్యానర్: ఫ్లయింగ్ ఈగిల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఎల్‌ఎల్‌పి
  • నిర్మాత: ఎస్‌ఎన్ స్వామి
  • కథ, స్క్రీన్‌ప్లే: మహేష్ ఎస్‌కె, బాలాజీ ప్రసాద్, శ్రీకాంత్ రాజ్ బిట్లింగ్
  • దర్శకత్వం: సందీప్ రెడ్డి కెటి
  • సంగీతం: గౌర హరి
  • సినిమాటోగ్రఫీ: దాము నర్రావుల
  • పాటలు: కిట్టు విస్సాప్రగడ, భాస్కరభట్ల రవికుమార్‌
  • ఎడిటర్: శశాంక్ మాలి
  • గాయకులు: కపిల్ కపిలన్, యాజిన్ నిజార్, గౌరా హరి

మూలాలు[మార్చు]

  1. Andhra Jyothy (16 June 2023). "కళ్లు చెప్పే కథ". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.
  2. Prime9 (12 June 2023). "ఈ వారం ఓటీటీ/ థియేటర్లో సందడి చేయనున్న సినిమాలు / వెబ్ సిరీస్ లు ఏవంటే..!". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.{{cite news}}: CS1 maint: numeric names: authors list (link)
  3. Eenadu (16 June 2023). "రివ్యూ: కనులు తెరిచినా కనులు మూసినా". Archived from the original on 12 July 2023. Retrieved 12 July 2023.