Jump to content

కన్యాదానం

వికీపీడియా నుండి
(కన్యా దానం నుండి దారిమార్పు చెందింది)
హిందూ వివాహం-సౌగంధికా పరిణయం నుండి ఒక దృశ్యం

కన్యాదానం అనగా పెళ్ళిలోని అతిముఖ్యమైన కార్యక్రమం. పెళ్ళికూతురు తండ్రి తన కూతుర్ని వరునికి దానం ఇచ్చేది ఒక హిందూ సాంప్రదాయం. ఈ తంతులో అత్త మామలు కన్యకయైన తమ కుమార్తెను సాక్షాత్తు దైవ స్వరూపుడైన వరునికి ఇవ్వడం ద్వారా పాపములు హరించునని భావించును. కన్యాదానం ముఖ్యముగా - పురుషర్ధములైన ధర్మము, అర్ధము, కామము, మోక్షము కేవలం భార్య వద్దే దొరకునని చెప్పును. తద్వారా వరుడు తనును అత్త మామలు దైవంగా భావించారని, తన జీవితంలో వెలకట్టలేని అపురూపమైన బహుమతి తన భార్యేనని భావించుకొనును. వాస్తవానికి ఈనాటి స్త్రీవాదులు పొరబడినట్లుగా ఈ తంతులో ఎంత మాత్రమునూ పురుష ఆధిక్యత గాని, స్త్రీని ఒక నిర్జవమైన వస్తువుగా భావించబడటం గాని లేదు. భర్త విడిచిన స్త్రీలను, విధవరాండ్రును కన్యాదానముగా ఇవ్వరాదు. అన్ని దానములలో అతి శ్రేష్టమైన దానం కన్యాదానం.

కన్యాదానకాండ లక్ష్యం ఒక్కటే. పుట్టింట్లో లభించిన ప్రేమాభిమానాలు, రక్షణ, ప్రోత్సాహకాలూ అత్తింట్లోనూ నిరాటంకంగా లభించాలన్నదే దీని ముఖ్య ఉద్దేశ్యం. ఈ ఘట్టం అత్తవారింట్లో కలిసిపోవడానికి, సర్దుకుపోవడానికి మానసికంగా సంసిద్ధపరుస్తుంది. భరోసా కల్పిస్తుంది. దైర్య స్థైర్యాలనిస్తుంది. వరుని కాళ్ళు కడిగి కన్యాదాత శచీదేవిని పూజించి కన్యాదానం చేస్తాడు. వధూవరుల మధ్య తెరను సుముహూర్తం వరకు అలానే ఉంచి కన్యాదానం చేస్తూ, నాకు బ్రహ్మలోకం సిద్ధించే నిమిత్తం.. సువర్ణ సంపన్నురాలైన ఈ కన్యను విష్ణుస్వరూపుడైన నీకు ఇస్తున్నాను. నా పిందులు చరించడానికి ఈ కన్యను దానం చేస్తున్నాను. భగవంతుడు, పంచదూరాలు, సర్వదేవతలు సాకులగుదురుగాక. సాధుశీలమైన, అలంకరింపబడిన ఈ కన్యను. ధర్మ, కామార్ధ సిద్ధి కలిగి నిమిత్తము మంచి శీలం కలిగిన, బుద్ధిమంతుడవైన నీకు దానం చేస్తున్నాను. అంటూ చతుర్దేవిభక్తి వేయకుండా కన్యాదాత దానం చేస్తాడు.[1]

మూలాలు

[మార్చు]
  1. link, Get. "కkanyadanam Importance in Telugu". Retrieved 2023-04-15.