కన్వర్ రాయ్ సింగ్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కన్వర్ రాయ్ సింగ్
వ్యక్తిగత సమాచారం
పుట్టిన తేదీ(1922-02-24)1922 ఫిబ్రవరి 24
దర్కాటి, పంజాబ్, బ్రిటిషు భారతదేశం
మరణించిన తేదీ1993 నవంబరు 12(1993-11-12) (వయసు 71)
డెహ్రాడూన్, ఉత్తరాఖండ్
బ్యాటింగుకుడిచేతి వాటం
అంతర్జాతీయ జట్టు సమాచారం
జాతీయ జట్టు
ఏకైక టెస్టు (క్యాప్ 42)1948 జనవరి 1 - ఆస్ట్రేలియా తో
కెరీర్ గణాంకాలు
పోటీ టెస్టులు First-class
మ్యాచ్‌లు 1 38
చేసిన పరుగులు 26 1,778
బ్యాటింగు సగటు 13.00 30.13
100లు/50లు 0/0 4/7
అత్యధిక స్కోరు 24 158
వేసిన బంతులు 1,448
వికెట్లు 21
బౌలింగు సగటు 33.33
ఒక ఇన్నింగ్సులో 5 వికెట్లు 0
ఒక మ్యాచ్‌లో 10 వికెట్లు 0
అత్యుత్తమ బౌలింగు 4/31
క్యాచ్‌లు/స్టంపింగులు 0/– 12/–
మూలం: ESPNcricinfo, 2013 జనవరి 11

కన్వర్ రాయ్ సింగ్ (1922 ఫిబ్రవరి 24 - 1993 నవంబరు 12) 1948లో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడిన భారతీయ క్రికెట్ ఆటగాడు.[1] కుడిచేతి వాటం బ్యాట్స్‌మన్, రాయ్ సింగ్ 1947-48లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. 1940 నుండి 1961 వరకు సాగిన అతని కెరీర్‌లో, రాయ్ సింగ్ ఫస్ట్-క్లాస్ క్రికెట్‌లో 30.13 సగటుతో 1,778 పరుగులు చేశాడు. ఇందులో నాలుగు సెంచరీలు, ఏడు అర్ధ సెంచరీలు ఉన్నాయి. [2]

ఫస్ట్ క్లాస్ క్రికెట్[మార్చు]

కన్వర్ రాయ్ సింగ్ ఫస్ట్-క్లాస్ జీవితం 1940-41 సీజన్ నుండి 1960-61 సీజన్ వరకు కొనసాగింది. కన్వర్, కుడి చేతి వాటం బ్యాట్స్‌మెన్. నాలుగు సెంచరీలు, ఏడు అర్ధసెంచరీలతో 30.13 సగటుతో 1778 పరుగులు చేశాడు.[3]

అంతర్జాతీయ క్రికెట్[మార్చు]

కన్వర్ రాయ్ సింగ్ తన కెరీర్ మొత్తంలో ఒకే ఒక్క టెస్టు ఆడాడు.ఉల్లేఖన లోపం: చెల్లని <ref> ట్యాగు; పేరు లేని ref లలో తప్పనిసరిగా కంటెంటు ఉండాలి అతను 1948 జనవరి 1 న మెల్‌బోర్న్‌లో ఆతిథ్య ఆస్ట్రేలియాపై తన తొలి టెస్టు ఆడాడు. ఆ తర్వాత టెస్టులేమీ ఆడలేదు.

కుడిచేతి వాటం బ్యాట్స్‌మెనైన కన్వర్, 1947-48 సీజన్‌లో ఆస్ట్రేలియా పర్యటనకు ఎంపికయ్యాడు. అతనిని జాతీయ జట్టులోకి తీసుకోవడంపై అనేక వివాదాస్పద నివేదికలు వచ్చాయి. దిగువ వరుసలో ఎనిమిదో నంబర్‌లో బ్యాటింగు చేసే అవకాశం లభించింది. ఆడిన ఏకైక టెస్టులో తొలి ఇన్నింగ్స్‌లో 2 పరుగులు, రెండో ఇన్నింగ్స్‌లో 24 పరుగులు చేసి జట్టు తరఫున అత్యధిక పరుగులు చేసిన రెండో ఆటగాడిగా నిలిచాడు.

కన్వర్ రాయ్ సింగ్ ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో 71 సంవత్సరాల వయస్సులో 1993 నవంబరు 12 న మరణించారు.

ఇవి కూడా చూడండి[మార్చు]

మూలాలు[మార్చు]

  1. "Kanwar Rai Singh". cricketarchive. Retrieved 11 February 2015.
  2. "Player Profile: Kanwar Rai Singh". ESPNcricinfo. Retrieved 14 January 2013.
  3. "Kanwar Rai Singh Profile - Cricket Player India | Stats, Records, Video". ESPNcricinfo (in ఇంగ్లీష్). Retrieved 2023-08-30.