కపట నాటక సూత్రధారి
కపట నాటక సూత్రధారి | |
---|---|
దర్శకత్వం | క్రాంతి సైన |
నిర్మాత | మనీష్ |
తారాగణం | విజయ్ శంకర్ సంపత్ కుమార్ చందులాల్ |
ఛాయాగ్రహణం | సుభాష్ దొంతి |
కూర్పు | ఛోటా కె ప్రసాద్ |
సంగీతం | రామ్ తవ్వా |
నిర్మాణ సంస్థ | యాక్షన్ కట్ మూవీస్ ఎల్ఎల్‌పి |
విడుదల తేదీ | 12 నవంబర్ 2021 |
దేశం | భారతదేశం |
భాష | తెలుగు |
కపట నాటక సూత్రధారి 2021లో తెలుగులో విడుదలైన సస్పెన్స్ థ్రిల్లర్ సినిమా.[1] ఫ్రెండ్స్ అడ్డా బ్యానర్‌పై మనీష్ నిర్మించిన ఈ సినిమాకు క్రాంతి సైన దర్శకత్వం వహించాడు. విజయ్ శంకర్, సంపత్ కుమార్, చందులాల్ నటించిన ఈ సినిమా నవంబర్ 12, 2021న విడుదలైంది.[2]
కథ
[మార్చు]ఒక బస్తీకి చెందిన యాదగిరి(విజయ్ శంకర్ ), సెంథిల్(సంపత్ కుమార్), పూర్ణ(చందులాల్), పుష్ప(అమీక్ష), కల్పన(సునీత) స్వశక్తితో ఎదగాలని అనుకొంటున్న ఈ ఐదుగురికి లోన్ ఇప్పిస్తామని బ్యాంక్ ఉద్యోగి చెప్పడంతో రుణం కోసం దరఖాస్తు చేసుకొంటారు. ఈ క్రమంలో బ్యాంకులో తాకట్టు పెట్టిన బంగారానికి బదులు ఖాతాదారులకు నకిలీ బంగారం ఇస్తున్నారనే విషయం బయటకు వస్తుంది. భారీ స్కామ్ బయటకు రావడంతో పోలీస్ ఆఫీసర్ అరవింద్ (రుద్ర) రంగంలోకి దర్యాప్తు చేపడుతారు. అయితే బ్యాంక్ అధికారులు ఈ స్కామ్ నుంచి బయటపడటానికి నేరాన్ని ఈ ఐదుగురిపై నెట్టేస్తారు. ఈ స్కామ్ నుంచి ఈ ఐదుగురు బస్తీ వాసులు ఎలా బయటపడ్డారు? అనేదే మిగతా సినిమా కథ.[3]
నటీనటులు
[మార్చు]- విజయ్ శంకర్ - యాదగిరి
- సంపత్ కుమార్ - సెంథిల్
- చందులాల్ - పూర్ణ
- అమీక్ష - పుష్ప
- సునీత - కల్పన
- అరవింద్ - రుద్ర
- భాను ప్రసాద్ - బ్యాంక్ మేనేజర్
- రవిప్రకాశ్
- మేక రామకృష్ణ
- విజయ్
- అమన్ ఖాన్
- శ్రీరాగ్
- నిరంజన్
- మాస్టర్ బాబా ఆహిల్
సాంకేతిక నిపుణులు
[మార్చు]- బ్యానర్: ఫ్రెండ్స్ అడ్డా
- నిర్మాత: మనీష్ (హలీమ్)
- సహా నిర్మాతలు: ఉమా శంకర్
వెంకటరామరాజు
శరత్ కుమార్
జగదీశ్వర్ రావు
శేషు కుమార్
ఎండి హుస్సేన్ - కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: క్రాంతి సైన
- సంగీతం: రామ్ తవ్వా
- నేపథ్య సంగీతం: వికాస్ బడిస
- సినిమాటోగ్రఫీ: సుభాష్ దొంతి
- ఎడిటింగ్: ఛోటా కె ప్రసాద్
- మాటలు: రామకృష్ణ
- పాటలు: శ్రీనివాస్ సూర్య [4]
- డాన్స్ : జిత్తు మాస్టర్
మూలాలు
[మార్చు]- ↑ Namasthe Telangana (11 November 2021). "సస్పెన్స్ థ్రిల్లర్‌గా కపట నాటక సూత్రధారి". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
- ↑ Andrajyothy (10 November 2021). "నవంబర్ 12 రిలీజ్ లిస్ట్‌లోకి 'కపట నాటక సూత్రధారి'". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
- ↑ Sakshi (12 November 2021). "'కపట నాటక సూత్రధారి' మూవీ రివ్యూ". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.
- ↑ NTV (15 June 2021). "ఆకట్టుకుంటున్న "కపట నాటక సూత్రధారి" సాంగ్". Archived from the original on 14 November 2021. Retrieved 14 November 2021.