కప్ప తల్లి ఆటలు
స్వరూపం
కప్పతల్లి ఆట వర్షాకాలం ఆరంభమైన తరువాత, వానలు అనుకున్న సమయానికి రాకుంటే వానల కోసం గ్రామాల్లో బాలలు ఆటలాడుతూ కప్పలకు పూజలు చేస్తారు. [1] ఈ ఆటకు ఆదిలాబాద్ జిల్లాలో ఇంద్రవెల్లి గ్రామం ప్రసిద్ధి చెందింది.
ఆట వస్తువులు
[మార్చు]- రోకలి
- కప్ప
- వేప కొమ్మలు
- బిందెలు
విధానం
[మార్చు]రోకలికి కప్పను కట్టి, పిల్లలు నడుముకు, కాలికి గజ్జెలు కట్టుకొని, కప్పను కట్టిన రోకలిని భుజాన మోసుకుంటూ నృత్యాలు చేస్తూ ఇంటింటికి తిరిగుతూ కప్పతల్లికి స్నానం చేయిస్తారు. చిన్నారులు కప్పతల్లితో ఇంటి ముందుకు రాగానే మహిళలు రోకలి కట్టిన కప్పపై నీళ్లు పోసి అభిషేకం చేసి, ప్రత్యేక పూజలు చేసి మొక్కులు తీర్చుకుంటారు.[2]
మూలలు
[మార్చు]- ↑ "Telangana : కప్పలను రోకలికి కట్టి పిల్లలతో ఊరేగింపు .. అటుపై అభిషేకం ఎందుకిలా చేస్తారంటే". News18 Telugu. 2022-05-31. Retrieved 2023-07-16.
- ↑ "ఈనాడు : Eenadu Telugu News Paper | Eenadu ePaper | Eenadu Andhra Pradesh | Eenadu Telangana | Eenadu Hyderabad". epaper.eenadu.net. Retrieved 2023-07-16.