Jump to content

కమీ రీటా

వికీపీడియా నుండి
కమీ రీటా
2010 లో కమీ రీటా
జననం (1970-01-17) 1970 జనవరి 17 (వయసు: 56)
సోలుకుంబు జిల్లాలోని థేమ్‌
వృత్తిపర్వతారోహకుడు
క్రియాశీలక సంవత్సరాలు1992–ప్రస్తుతం
భాగస్వామిలాక్పా జంగ్ము
పిల్లలు2

కమీ రీటా (జననం 1970 జనవరి 17) నేపాల్‌లోని సోలుకుంబు జిల్లాలోని థేమ్‌లో జన్మించిన ఒక ప్రసిద్ధ పర్వతారోహకుడు.[1] ఇతను 31 సార్లు ఎవరెస్ట్ పర్వత శిఖరాన్ని అధిరోహించి విశేషమైన ఘనతను సాధించిన అత్యంత నిష్ణాతుడైన నేపాలీ షెర్పా గైడ్.[2] ఈ ఘనత అతనిని ప్రపంచంలోనే ఎవరెస్ట్ శిఖరాన్ని అధిక సార్లు అధిరోహించిన మొదటి వ్యక్తిగా చేసింది. ఈయన 2018 మే నుండి, ఎవరెస్ట్ శిఖరాన్ని అత్యధికంగా అధిరోహించిన రికార్డును కలిగి ఉన్నారు. 2025 మే 27 న తన 55 వ ఏట[3] 31 వ సారి ఎవరెస్టును అధిరోహించి,[2][4] తన స్వంత రికార్డును బద్దలు కొట్టాడు.[5][6] అంతేకాకుండా 27వ సారి 2023 మే 17 న ఎవరెస్టు శిఖరాన్ని ఎక్కి మరో రికార్డును సాధించాడు.[7] 1950లో విదేశీ పర్వతారోహకులకు ఎవరెస్ట్‌ను ప్రారంభించిన తర్వాత అతని తండ్రి మొదటి ప్రొఫెషనల్ షెర్పా గైడ్‌లలో ఒకరు. అతని సోదరుడు లక్పా రీటా కూడా గైడ్, ఎవరెస్ట్‌ను 17 సార్లు అధిరోహించాడు.[8][9]

2017లో, కమీ రీటా 21 సార్లు ఎవరెస్ట్ శిఖరాన్ని అధిరోహించిన మూడవ వ్యక్తి అయ్యాడు. ఈ రికార్డును అపా షెర్పా, ఫుర్బా తాషి షెర్పాతో పంచుకున్నారు.[10][11] ఆ తరువాత ఇద్దరు పదవీ విరమణ చేశారు.[12] 2018 మే 16 న, 48 ఏళ్ల వయస్సులో, కామి రీటా 8,850 మీటర్ల (29,035 అడుగుల) ఎవరెస్టు శిఖరాన్ని మళ్ళీ అధిరోహించి,[8] ఎవరెస్ట్‌ను 22 సార్లు అధిరోహించిన మొట్టమొదటి వ్యక్తిగా నిలిచారు.[13][14] అదే సంవత్సరం ఏప్రిల్‌లో, అతను రిటైర్‌మెంట్‌కు ముందు ఎవరెస్ట్‌ను 25 సార్లు ఎక్కాలని యోచిస్తున్నట్లు మీడియాతో చెప్పాడు, "నాకు మాత్రమే కాకుండా నా కుటుంబం, షెర్పా ప్రజలు, నా దేశం నేపాల్ కోసం" ఎక్కాలి అన్నాడు.[8][15] అతను తన 31 వ ఎవరెస్ట్ శిఖరారోహణను 2025 మే 27 న పూర్తి చేశాడు.

8,000 మీటర్ల పైచిలుకు శిఖరాలను అత్యధికంగా 42 సార్లు ఎక్కిన రికార్డు కమీ రీటా పేరిట ఉంది. అతను ఎవరెస్ట్ అధిరోహణతో పాటు, అతను చోయును ఎనిమిది సార్లు, మనస్లు, లోట్సే, K2 లను ఒక్కోసారి అధిరోహించాడు.[16][2]

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Angela Benavides (21 May 2019). "Everest Summit". explorersweb.com. Retrieved 18 December 2022.)
  2. 2.0 2.1 2.2 "Sherpa climbs Mount Everest for a record-breaking 31st time". CNN. Associated Press. 27 May 2025. Retrieved 27 May 2025.
  3. Dhungana, Niranjan (27 May 2025) [2025-05-27]. Dhungana, Niranjan (ed.). "The Record-Breaking Journeys of Kami Rita Sherpa". Eco Holidays Nepal. Eco Holidays Nepal (published 5 June 2025). Archived from the original on 24 జూన్ 2025. Retrieved 5 June 2025.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. Gopal Sharma (27 May 2025). "Nepali Sherpa scales Mount Everest for a record 31st time". reuters.com. Retrieved 29 May 2025.
  5. "Nepal's 'Everest Man' claims record 30th summit". france24.com. 22 May 2024. Retrieved 22 May 2024.
  6. "Kami Rita Sherpa scales Mt Everest for 30th time breaking own record". The Himalayan Times. 22 May 2024. Retrieved 22 May 2024.
  7. "Nepali Climber Makes Record, Climbs Mount Everest For 27th Time". NDTV.com. Retrieved 2023-05-18.
  8. 8.0 8.1 8.2 "Sherpa guide Kami Rita climbs Everest for record 22nd time". 16 May 2018 – via www.theguardian.com.
  9. "Kami Rita Sherpa scales Mt.Everest 23rd times".{{cite web}}: CS1 maint: url-status (link)
  10. "Nepalese Kami Rita Sherpa scales Mount Everest for record 21 times". The Financial Express (in అమెరికన్ ఇంగ్లీష్). 2017-05-27. Retrieved 2017-05-27.
  11. "Nepalese Sherpa scales Everest for record 21 times". The Tribune. India. PTI. 28 May 2017. Retrieved 23 April 2022.
  12. Gurubacharya, Binaj. "Sherpa climber scales Mount Everest for a record 23rd time". chicagotribune.com.
  13. "Kami Rita Sherpa scales Mt Everest for record 22 times". The Himalayan Times. Retrieved 16 May 2018.
  14. "Sherpa eyes record-breaking 22nd Everest climb". Gulf Times. Retrieved 16 May 2018.
  15. "This veteran Sherpa is trying to reach the top of Everest for a record-breaking 22nd time". The Independent. 11 April 2018.
  16. "Most ascents of 8,000ers". Guinness World Records. guinnessworldrecords.com. 7 May 2022. Retrieved 2025-05-29.
"https://te.wikipedia.org/w/index.php?title=కమీ_రీటా&oldid=4661223" నుండి వెలికితీశారు