కమ్లియా జుబ్రాన్
కమ్లియా జుబ్రాన్ | |
---|---|
వ్యక్తిగత సమాచారం | |
జన్మ నామం | కమ్లియా జుబ్రాన్ |
జననం | 1963 అక్రే, ఇజ్రాయిల్ |
మూలం | పాలస్తీనా |
వృత్తి | గాయకురాలు, పాటల రచయిత్రి , సంగీత దర్శకురాలు |
క్రియాశీల కాలం | 1983 - ప్రస్తుతం |
కమ్లియా జుబ్రాన్ పాలస్తీనా గాయకురాలు, పాటల రచయిత్రి, సంగీత దర్శకురాలు.
జననం
[మార్చు]కమ్లియా జుబ్రాన్ 1963లో ఇజ్రాయిల్, అక్రే లోని పాలస్తీనా కుటుంబంలో జన్మించింది.[1][2] ఈవిడ తండ్రి ఎలియాస్ సంగీత ఉపాధ్యాయుడు, సాంప్రదాయ పాలస్తీనా వాయిద్యాల తయారీదారుడు.[3] కమ్లియా సోదరుడు ఖలేద్ కూడా సంగీతకారుడు.[4] జుబ్రాన్ తన కుటుంబ సభ్యులతో కలిసి, టెల్లింగ్ స్ట్రింగ్స్ (2007) అనే డాక్యుమెంటరీని తయారుచేసింది. ఇందులో తరాలు మారుతున్నకొద్ది ఇజ్రాయిల్ సాంస్కృతి యొక్క మార్పును, గుర్తింపును చూపించడం జరిగింది.[5]
హీబ్రూ యూనివర్సిటీలోని సామాజిక కార్యక్రమాలను అధ్యయనం చేసేందుకు 1981 లో జెరూసలేంకు వెళ్లింది.[2]
కమ్లియా 2002లో ఐరోపాకు వెళ్లింది.[6]
వృత్తిజీవితం
[మార్చు]1982-2002 వరకు తూర్పు జెరూసలెం లోని అరబిక్ సంగీత బృందమైన సబ్రీన్ లో ప్రధాన గాయకురాలుగా పనిచేసింది. వాద్యాలను కూడా వాయించగలదు. 2002 నుండి వేర్నేర్ హాల్లర్ వంటి పలు యూరోపియన్ సంగీతకారులతో కలిసి పనిచేయడమేకాకుండా, సోలోగా కూడా ప్రదర్శనలు ఇచ్చింది.[1] 2013లో "మల్టీ_వైరల్" అనే చిత్రంలో టామ్ మోరెల్, జూలియన్ అస్సాంగ్ లతో కలిసి అతిథి పాత్రలో నటించింది.
గ్రామఫోన్ రికార్డుల జాబితా
[మార్చు]- దుఖన్ అల్-బరాకిన్ (1984)
- మావ్ట్ అల్-నబి (1988)
- జై అల్ హమమ్ (1994)
- అల ఫెయిన్ (2000)
- వమీడ్ (2006)
- వనాబ్ని (2010)
- మకాన్ (2009)
- నహౌల్ (2013)
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Biography". Kamilya Jubran. Retrieved 23 June 2017.
- ↑ 2.0 2.1 "Finishing a musical odyssey alone". The Daily Star (Lebanon). June 23, 2004. Retrieved 2017-06-23.
- ↑ Torstrick, Rebecca L. (2004). Culture and Customs of Israel. Greenwood Publishing Group. p. 165. ISBN 0313320918.
- ↑ Brinner, Benjamin (2009). Playing across a Divide: Israeli-Palestinian Musical Encounters. Oxford University Press. p. 6. ISBN 9780195175813.
- ↑ "2007 Telling Strings". Balzli & Fahrer GmbH Filmproduction. Archived from the original on 10 మే 2017. Retrieved 23 June 2017.
- ↑ "Kamilya Jubran, voix jaillissante de la chanson orientale". Le Monde. January 1, 2009. Retrieved 2 July 2016.
ఇవి కూడా చూడండి
[మార్చు]- సరస్వతీ దేవి, ఖోర్షెడ్ మినోచెర్-హోమ్జీ: భారతీయ సంగీతంలో హిందీ చలన చిత్ర మొదటి సంగీత దర్శకురాలు, స్కోర్ కంపోజర్