కరపత్రం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
న్యూయార్క్ సిటీలో కరపత్రాలు అందజేస్తున్న చిత్రం [1973]

కరపత్రంను ఇంగ్లీషులో flyer, Flyer (pamphlet), flier, circular, handbill or leaflet అని అంటారు. తెలియపరచాలని భావించిన ప్రకటనను ఒక కాగితంపై ముద్రించి, దానిని ఉత్తరం ఇచ్చునట్లుగా ప్రతి ఇంటికి పంచిపెట్టడం లేదా బహిరంగ ప్రదేశాలలో (public places) లో పంపిణీ చేయటం చేస్తుంటారు. ఈ విధంగా పంచే కాగితాలను కరపత్రాలు అంటారు. ఈ కరపత్రంలతో ప్రచారం చాలా సులభమైనది, వేగవంతమైనది, తక్కువ ఖర్చుతో అందరికి అందుబాటులో ఉంది.వ్యక్తిగతంగా, వ్యాపార పరంగా అభ్యర్ధనల నిమిత్తం, సమాజిక కార్యక్రమాల ఆహ్వానాల నిమిత్త ఈ కరపత్రంలను ఉపయోగిస్తుంటారు:

 • రెస్టారెంట్ లేదా నైట్ క్లబ్ వంటి చోట్ల వస్తువు లేదా సేవను ప్రోత్సహించడానికి.
 • మత ప్రచారం ద్వారా ఆ మతం యొక్క ఆదర్శ భావాలు తెలియ చేయడానికి.
 • రాజకీయ పార్టీ లేదా అభ్యర్థి తరపున రాజకీయ ప్రచార కార్యకలాపాలు చేయడానికి.
 • కరపత్రాలను సాయుధ పోరాటంలో ఉపయోగిస్తున్నారు: ఉదాహరణకు సాయుధ పోరాట యోధులకు గాలిలో కరపత్రాలను చేరవేయడం ద్వారా వ్యూహ సమాచారాన్ని అందించి మానసికంగా చేయడానికి.

ఈ కరపత్రంలను ముఖ్యంగా A4, A5, DL, A6 సైజులలో ముద్రిస్తారు.

 • A4 - (roughly letterhead size)
  A5 - (roughly half letterhead size)
  DL - (compslip size)
  A6 - (postcard size)

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]

"https://te.wikipedia.org/w/index.php?title=కరపత్రం&oldid=3429843" నుండి వెలికితీశారు