కోవిడ్-19 వాక్సిన్

వికీపీడియా నుండి
(కరోనా టీకా నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కోవిడ్-19 టీకా మనుషులలో కరోనావైరస్ 2ని ఎదురుకోడానికి అవసరమైన 'అనుకూల రోగనిరోధక' శక్తిని అందిస్తుంది. కోవిడ్ ‑ 19 మహమ్మారికి ముందే, కరోనావైరస్ల నిర్మాణం, పనితీరు గురించి స్థిరమైన సమాచారం అందుబాటులో ఉంది, ఇది వివిధ వ్యాక్సిన్ సాంకేతికతల అభివృద్ధి ప్రక్రియను వేగవంతం చేసింది.[1] 2021 మే 7 నాటికి ప్రపంచ వ్యాప్తంగా 14 టీకాలు ఆమోదం పొంది వాడుకలో, ఇంకా సుమారు 60 టీకాలు అభివృద్ధి దశలో ఉన్నాయి.[2]

2021 మే 1 నాటికి, జాతీయ ఆరోగ్య సంస్థల అధికారిక నివేదికల ఆధారంగా ప్రపంచవ్యాప్తంగా 115 కోట్ల మోతాదుల కోవిడ్ ‑ 19 వ్యాక్సిన్ ఇవ్వబడింది.[3] 2021 మే 8 నాటికి, భారతదేశంలో 16 కోట్ల మంది టీకా తీసుకున్నారు. తెలంగాణలో 51 లక్షల మంది, ఆంధ్రప్రదేశ్ లో లక్ష మంది టీకా తీసుకున్నారు[4]. 2020 డిసెంబరు నాటికి, 1,000 కోట్లకు పైగా వ్యాక్సిన్ మోతాదులను దేశాలు ముందుగానే బుక్ చేసుకున్నాయి, [5] వీటిలో సగం ప్రపంచ జనాభాలో 14% ఉన్న అధిక-ఆదాయ దేశాలు కొనుగోలు చేసాయి.

సార్స్-కరోనావైరస్-2 చిత్రం[6]

ప్రణాళిక, అభివృద్ధి[మార్చు]

2020 జనవరి నుండి, బహుళజాతి ఔషధ పరిశ్రమల, ప్రభుత్వాల మధ్య అపూర్వమైన సహకారం ద్వారా వ్యాక్సిన్ అభివృద్ధి వేగవంతం చేయబడింది[7]. కోఎలిషన్ ఫర్ ఎపిడెమిక్ ప్రిపేర్డ్‌నెస్‌ ఇన్నోవేషన్స్ (సెపీ) ప్రకారం, కోవిడ్‑19 వ్యాక్సిన్ అభివృద్ధి తొలి దశ కార్యకలాపాల భౌగోళిక పంపిణీ ఇలా ఉంది: ఉత్తర అమెరికా సంస్థలు 40%, ఆసియా ఆస్ట్రేలియాలలో 30%, ఐరోపాలో 26%, ఇంకా దక్షిణ అమెరికా, ఆఫ్రికాలో కొన్ని ప్రాజెక్టులలో పని జరిగింది[7][8]. కోవిడ్‑19 కోసం వ్యాక్సిన్‌ను రూపొందించే ఆవశ్యకత షెడ్యూల్ల కుదింపుకు దారితీసింది, ఇది ప్రామాణిక టీకా అభివృద్ధి కాలపరిమితిని తగ్గించింది. సాధారణంగా వరసలో సంవత్సరాలు పట్టే ప్రక్రియను, కొన్ని కేసుల్లో క్లినికల్ ట్రయిల్ దశలను కలిపేసి నెలలకు తగ్గించారు[9].

కోవిడ్-19 వాక్సిన్ ని అభివృద్ధి చేసి దానిని ప్రపంచంలోని అందరికి అందించాలనే ఉద్దేశంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 ఏప్రిల్లో "ఆక్సెస్ టు కోవిడ్-19 టూల్స్" (ఎ.సి.టి) అక్సిలరేటర్ ని ప్రారంభించింది, ఇది అందరికీ కోవిడ్-19 పరీక్షలు, చికిత్స, వాక్సిన్ అందించడానికి కృషి చేస్తుంది. ఈ కార్యాన్ని డయాగ్నొస్టిక్స్, చికిత్స, వాక్సిన్ ("కోవాక్స్" అని కూడా పిలుస్తారు), ఆరోగ్య వ్యవస్థల సమన్వయ వ్యవస్థ అనే నాలుగు స్తంభాల కింద విభజించారు.[10]

టీకా తయారీ[మార్చు]

టీకా అభివృద్ధికి తొలుత వైరస్‌ ఆకృతిని, డీఎన్‌ఏ లేదా ఆర్‌ఎన్‌ఏను గుర్తించాలి. తర్వాత మనుషుల్లో ఆ వైరస్‌ ఎలా పనిచేస్తుందో పరీక్షలు చేస్తారు.

టీకాకు ప్రభుత్వ అనుమతులు రావాలంటే 3 దశల్లో మానవులపై విజయవంతంగా ప్రయోగించాలి. ఒక్కో దశకు 6-8 నెలలు పడుతుంది. ఈ దశలను అధిగమించి ముందుకు సాగే టీకాలు అతికొద్ది సంఖ్యలోనే ఉంటాయి.

మూలాలు[మార్చు]

  1. Li, Yen-Der; Chi, Wei-Yu; Su, Jun-Han; Ferrall, Louise; Hung, Chien-Fu; Wu, T.-C. (2020-12-20). "Coronavirus vaccine development: from SARS and MERS to COVID-19". Journal of Biomedical Science. 27. doi:10.1186/s12929-020-00695-2. ISSN 1021-7770. PMC 7749790. PMID 33341119.{{cite journal}}: CS1 maint: unflagged free DOI (link)
  2. "COVID-19 vaccine tracker". www.raps.org. Retrieved 2021-05-08.
  3. "Coronavirus (COVID-19) Vaccinations - Statistics and Research". Our World in Data. Retrieved 2021-05-08.
  4. "#IndiaFightsCorona COVID-19". MyGov.in (in ఇంగ్లీష్). 2020-03-16. Retrieved 2021-05-08.
  5. Mullard, Asher (2020-11-30). "How COVID vaccines are being divvied up around the world". Nature (in ఇంగ్లీష్). doi:10.1038/d41586-020-03370-6.
  6. Giaimo, Cara (2020-04-01). "The Spiky Blob Seen Around the World". The New York Times (in అమెరికన్ ఇంగ్లీష్). ISSN 0362-4331. Retrieved 2021-05-10.
  7. 7.0 7.1 Le, Tung Thanh; Cramer, Jakob P.; Chen, Robert; Mayhew, Stephen (2020-09-04). "Evolution of the COVID-19 vaccine development landscape". Nature Reviews Drug Discovery (in ఇంగ్లీష్). 19 (10): 667–668. doi:10.1038/d41573-020-00151-8.
  8. Le, Tung Thanh; Andreadakis, Zacharias; Kumar, Arun; Román, Raúl Gómez; Tollefsen, Stig; Saville, Melanie; Mayhew, Stephen (2020-04-09). "The COVID-19 vaccine development landscape". Nature Reviews Drug Discovery (in ఇంగ్లీష్). 19 (5): 305–306. doi:10.1038/d41573-020-00073-5.
  9. "Corona Vaccine: ఆగస్టు 15న భారత్‌లో కరోనా వ్యాక్సిన్!". Zee News Telugu. 2020-07-03. Retrieved 2021-05-10.
  10. "190 దేశాలకు వాక్సిన్ అందించే COVAX ఒప్పందాన్ని భారత్ లో తయారు చేస్తున్న టీకాని బుక్ చేసుకున్నట్టు తప్పుగా అర్థం చేసుకున్నారు". FACTLY (in అమెరికన్ ఇంగ్లీష్). 2021-01-11. Retrieved 2021-05-11.

వెలుపలి లంకెలు[మార్చు]