టీకా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

What is VACCINE? టీకా (vaccine) అనగా వ్యాధి నిరోధకత (ఇమ్మ్యూనిటి)ని పెంచడానికి వాడే ఒకరకమయిన మందు. వాక్సిన్ అనే పదము ఎడ్వర్డ్ జెన్నర్ మశూచిని నివారించడానికి (గోమశూచికన్ని -లాటిన్ భాషలో vacca అంటే గోవు అని అర్థం) వాడడం వల్ల వచ్చింది. ఈ పదాన్ని లూయిస్ పాశ్చర్ వేరే శాస్త్రవేత్తలు వాడుకలోకి తీసుకువచ్చారు. వాక్సిన్‌లు అనే మందుల అభివృద్ధికి మూలాలు చైనా దేశంలో లభిస్తాయి. అక్కడ పూర్వం స్థానికులు మశూచిని అరికట్టేందుకు ఇంకోరకమయిన హానికలుగజేయని మశూచిని ఉద్దేశ్యపూర్వకంగా ఒక వ్యక్తికి ఇచ్చేవారు.

వాక్సిన్‌లలో రకాలు[మార్చు]

ఏవియన్ ఫ్లూ టీకా తయారీ

టీకా లో అనేక రకాలు వాడుకలో ఉన్నాయి. ఇవి శరీరం యొక్క రోగ నిరోధిక శక్తిని పెంచడం తో పాటు జబ్బు యొక్క విపరీతాన్ని తగ్గిస్తుంది తద్వారా వ్యాధి నుండి మనల్ని రక్షిస్తుంది [1]

వ్యాధి నిరోధకత[మార్చు]

టీకాలను భద్రపరచడం , సరఫరా[మార్చు]

ఇంతకుముందు టీకాలను ఎక్కువరోజులు నిలువ ఉంచడానికి సాధారణంగా థైమెరోసల్ అనే పదార్థాన్ని వాడేవారు. దీనిలో ఎక్కువశాతం ఒకరకమైన పాదరసం ఉంటుంది అందువల్ల డెన్మార్క్, అమెరికా వంటి దేశాల్లో దీని వాడుకను తగ్గించారు.[2][3]

ఎయిడ్స్ నివారణకై టీకాలపై పరిశోధన[మార్చు]

ఎయిడ్స్ వ్యాధి నివారణకొరకు టీకాలను అభివృద్ధి చేయడానికి మెర్క్ కంపెనీతో పాటు చాలా కంపెనీలు కృషి చేస్తున్నాయి. కాని ఇప్పటివరకు ఎవరూ సఫలీకృతం కాలేదు.[4]

ఇమ్యునైజేషన్ షెడ్యూల్[మార్చు]

భారతదేశంలోని టీకాల పద్ధతి[మార్చు]

క్రమసంఖ్య వయస్సు టీకా మందు
1. పుట్టుక నుంచి 2 వారాలు బి.సి.జి. ; ఒ.పి.వి.
2. 6 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
3. 10 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
4. 14 వారాలు ఒ.పి.వి. ; డి.పి.టి. ; హెపటైటిస్-బి ; హెచ్.ఐ.బి.
5. 9 నెలలు ఒ.పి.వి. ; తట్టు (మీజిల్స్)
6. 1 సం. తరువాత ఆటలమ్మ (చికెన్ పాక్స్)
7. 15 నెలలు ఎమ్.ఎమ్.అర్.
8. 18 నెలలు ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి.
9. 2 సం. తరువాత టైఫాయిడ్
10. 5 సం. తరువాత ఒ.పి.వి.; డి.పి.టి.; హెచ్.ఐ.బి, పోలిఓ
11. 10 సంవత్సరాలు. టి.టి.
12. 15-16 సంవత్సరాలు. టి.టి.; ఎం.ఎం.ఆర్

మూలాలు[మార్చు]

  1. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2015-09-05. Retrieved 2007-09-21.
  2. "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2007-10-13. Retrieved 2007-09-22.
  3. http://www.cdc.gov/od/science/iso/thimerosal.htm
  4. http://www.nytimes.com/2007/09/22/health/22vaccine.html?hp తీసుకున్న తేదీ 22-09-2007

బయటి లింకులు[మార్చు]


"https://te.wikipedia.org/w/index.php?title=టీకా&oldid=3019675" నుండి వెలికితీశారు