ప్రకృతి వైద్యము
ఆరోగ్య జీవన విధానమే ప్రకృతి వైద్యము. మనము ఎలా జీవించాలి, ఏమి తినాలి అనేది తెలుపుతుంది. దీని ముఖ్యోద్ధేశం ప్రజలలో అరోగ్యకరమైన జీవన అలవాట్లని పెంపొందించడమే.
దీని ప్రకారం, మానవ శరీరం పంచ భూతాలు అనగా భూమి, గాలి, నీరు, అగ్ని, ఆకాశంతో ఎర్పడింది. భూమి శరీరంలోని ఘన భాగాలు అనగా ఎముకలను సూచిస్తుంది. నీరు ద్రవరూపంలోని రక్తం మరి ఇతర రసాలను సూచిస్తుంది. గాలి శ్వాసకి ఆధారం. అగ్ని శక్తిని, ఆకాశం ఆత్మని సూచిస్తుంది. వీటిలో సమతూలనం లేకపోతే అనారోగ్యం కలుగుతుంది.
పకృతి అత్యుత్తమ వైద్యుడు. శరీరానికి రోగాన్ని నిరోధించడం, రోగం నుండి విముక్తి కలిగించే శక్తి ఉంది. ఒక అవయవానికి లేక రోగానికి చికిత్స కాకుండా మనిషి యొక్క పూర్తి ఆరోగ్యం దృష్టి ఈ పద్ధతిలో ఉంది. ఆహారం, పంచభూతాల చికిత్స తప్ప ఇంక వేరే మందులు వుండవు.
మూల సూత్రం
[మార్చు]ప్రకృతివైద్య సిద్ధాంతాలు "ప్రకృతికి గల నివారణశక్తిని" నమ్ముతూ సహజంగా ఉండే, తక్కువ ఇబ్బందికర పద్ధతుల పైన దృష్టిసారిస్తాయి. "సంయోజిత" ఔషధం, అణుధార్మికత, పెద్ద శస్త్రచికిత్సల వంటి చికిత్సలు ఉండవు, జీవ ఔషధాల, ఆధునికశాస్త్ర పద్ధతులని వదిలివేసి దేహం,ప్రకృతిల వైవిధ్యమైన కలయికని ప్రోత్సహిస్తారు. ఒత్తిడి నివారణ,ఆరోగ్యకరమైన ఆహారపుటలవాట్లు, జీవనవిధానం ద్వారా నివారణ కలిగించడాన్ని ఉద్ఘాటిస్తారు. ప్రకృతివైద్య అభ్యాస తత్వం ఆరు మూలాంశ విలువల ద్వారా వివరించవచ్చు. ప్రకృతివైద్యుని ప్రమాణంలో భిన్నవిధాలు మనుగడలో ఉన్నాయి, వివిధ కళాశాలల లేదా ప్రొఫెషనల్ సంఘాల ద్వారా ప్రచురించబడిన అనేక మిషన్ స్టేట్మెంట్స్,క్రమశిక్షణ సంఘాల ద్వారా ప్రచురితమైన నీతి నడవడికకు సంబంధించిన సూచనలు వీటిలో ఉన్నాయి.
మొదట హాని చెయ్యవద్దు; అత్యంత ప్రభావవంతమైన అతి తక్కువ నష్టాన్ని కలిగించగల ఆరోగ్య చికిత్సలను అందించాలి ప్రతి మనిషిలో అనువంశికంగా ఉన్న ప్రకృతి యొక్క స్వయం నివారణ శక్తిని గుర్తించు,గౌరవించు,ప్రోత్సహించు. లక్షణాలని అణచివేసి,తొలగించే కంటే రోగం యొక్క కారణాన్ని గుర్తించి తొలగించాలి. హేతుబద్ధమైన ఆశని నేర్పించి స్ఫూర్తినివ్వాలి,ఆరోగ్యానికి సంబంధించి స్వయం బాధ్యతని ప్రోత్సహించాలి . ప్రతివ్యక్తిని అతని వ్యక్తిగత ఆరోగ్య కారణాలని,ప్రభావాలని దృష్టిలో ఉంచుకొని చికిత్స చెయ్యాలి. ఆరోగ్య పరిస్థితిని ఉద్ఘాటించి ఆరోగ్యంగా ఉండేలా ప్రోత్సహించి ప్రతి వ్యక్తి,సమూహం,మన ప్రపంచపు వ్యాధులని నివారించాలి.
చికిత్స పద్ధతులు
[మార్చు]మర్ధన
[మార్చు]ఇది మనస్సుకి శరీరానికి వరం. రక్త ప్రవాహం పెంచి శరీరం రంగు మెరుగు చేస్తుంది. నొప్పిని తగ్గించటానికి, కొవ్వు కరిగించటానికి, కండరాలకు బలం చేకూర్చడానికి ఇది తోడ్పడుతుంది.
నీటి చికిత్స
[మార్చు]నీటిని, వివిధ ఒత్తిడి లేక వేడితో వాడి చికిత్స చేస్తారు. రకరకాల స్నానాలు (ఆవిరి స్నానం, వెన్ను, తుంటి, చేయి, కాలు కోసం స్నానం), నీటితో ఎనీమా వివిధ రకాలు.
మన్ను చికిత్స
[మార్చు]మన్ను శరీరంనుండి విష పదార్ధాలను గ్రహించి, చల్ల దనము కలుగచేస్తుంది. మన్నుతో స్నానం, మన్ను సంచి దీనిలో రకాలు. కొన్ని సూక్ష్మ జీవులకు చంపే శక్తి కూడా మన్నుకి ఉంది. చర్మ వ్యాధులు, జీర్ణ వ్యాధులు, అలెర్జీలకు బాగా పనిచేస్తుంది.
నియమిత ఆహారం ద్వారా అరోగ్యాన్ని పొందవచ్చు. వివిధరకాలైన ధాన్యాలు, కూరగాయలు, పళ్లు వాడుతారు.
ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మొదలగునవి దీనిలో ఉన్నాయి.
వనరులు
[మార్చు]నేచర్ క్యూర్ హాస్పటల్, జయనగర్, బెంగుళూరు వారి కరపత్రం
జిందాల్ నేచర్ క్యూర్