Jump to content

రేబిస్

వికీపీడియా నుండి

రేబీస్ వైరస్
Virus classification
Group:
Group V ((−)ssRNA)
Order:
Family:
Genus:
Type species
రేబిస్ వైరస్

రేబీస్ ను పిచ్చికుక్క వ్యాధి, జలభీతి వ్యాధి (హైడ్రోఫోబియా) అని కూడా అంటారు. ఇది క్షీరదాలకు చెందిన జంతువుల నుండి జంతువులకు వ్యాపించే ఒక వైరల్ వ్యాధి. ఉదాహరణకు కుక్కలు, నక్కలు, తోడేళ్లు, పిల్లులు, ఎలుగుబంట్లు, కోతులు, తదితర మాంసాహార జంతువులు (carnivorous), జబ్బుతో ఉన్న జంతువు మనిషికి కరిచినచో ఈ వ్యాధి మనుషులలో వ్యాప్తిచెందును. జంతువులలోనైనా, మనుషులలోనైనా ఈ వ్యాధి కనిపిస్తే చనిపోవడం తప్ప మందులేదు. పిచ్చికుక్క కరిచిన వెంటనే టీకాలు (వ్యాక్షిన్) వేసుకుంటే ప్రమాదమేమీ ఉండదు. నూటికి నూరుపాళ్లు సురక్షితము.

దస్త్రం:Elec micro of rahbdovirus isolate.jpg

వైరస్ గురించి

[మార్చు]

ఇది ఆర్.ఎన్.ఎ. (RNA) జాతికి చెందిన 'లిస్సా వైరస్' సిలిండ్రికల్ ఆకారములో ఉండి 180 నానో మీటర్ల పొడవు, 75 నానో మీటర్ల వ్యాసము కలిగి ఒక చివర గుండ్రముగాను, రెండవ చివర కుంభాకరము కలిగి యుండును. దీని లైపోప్రోటీన్ లో గ్లైకోప్రోటీన్ స్పైక్స్ ఉంటాయి. వీటీనే రైబోనూక్లియో ప్రోటీన్ అంటారు, RNA చాలా ముఖ్యమైనది.

మనుషులలో వ్యాధి గుర్తించే విధానము

[మార్చు]

రేబిస్ నరాలకు, మెదడుకు సంబంధించిన వ్యాధి. మెదడులో 'ఎన్-సెఫలైటిస్' అనే ఇన్‌ఫ్లమేషన్ లక్షణాలను కలుగజేయును. మిగతా ఏ వైరస్ వ్యాధి వలనైనా ఈ ఎన్-సెఫలైటిస్ లక్షణాలు కనిపించవచ్చును. ఉదా. హెర్ఫీస్ వైరస్, ఎంటిరో వైరస్, ఆర్బోవైరస్, ముఖ్యముగా హెర్పెస్ సింప్లెక్ష్ టైప్ 1, వేరిసెల్లా జోస్టర్, మొదలగునవి. కొన్ని లేబొరేటరీ పరీక్షల వలన తేడాను కనిపెట్టాలి.

వ్యాధి వ్యాపించే విధానము

[మార్చు]

ఏ క్షీరదమైనా, మానవులతో కలిపి ఈ వ్యాధికి గురి కావచ్చును. ఈ వైరస్ ఉన్న జంతువు ఇతర జంతువులను, మనుషులను కరడం వలన ఒకరి నుండి ఇంకొకరికి ఈ వ్యాధి వ్యాపించును. కొన్ని సమయాలలో గాలిలో (Aerosol) ఈ వైరస్ ఎగిరి వ్యాపించే అవకాశసమూ ఉంది. ఉదా: గనులలో పనిచేసే కార్మికులు అక్కడ తిరిగే ఈ వ్యాధివున్న గబ్బిలాల ద్వారా మనుషులకు, మ్యూకస్ పొరలద్వారా వైరస్ సోకే అవకాసముంది, కాని ఎక్కువగా గబ్బిలాలు కరడం ద్వారానే ఈ జబ్బు సోకే అవకాశము చాలా ఎక్కువ. మనుషుల నుండి మనుషులకు కరుచుట వలన, కొంతమేరకు చర్మం లేదా కార్నియా ట్రాన్స్-ప్లాంటేషన్, ముద్దుల వలన వ్యాపించే అవకాశమూ ఉంది.

కచ్చితమైన జబ్బుతో బాధ పడుతున్న ఏ జంతువైనా మనుషులకు కరిస్తే రేబీస్-వైరస్ బాహ్య నాడీమండలము ద్వారా కేంద్రనాడీమండలం చేరి వ్యాధి లక్షణాలు కలుగజేయును. ఇలా జరుగడానికి పట్టే కాలము 9 రోజులనుండి 90 రోజులలో జరుగును, దీనినే ఇంకుబేషన్ కాలము అంటాము. మన శరీరము పై మెదడుకు ఎంత దగ్గరగా కరిస్తే అంత తొందరగా వ్యాధి మెదడుకు చేరే అవకాశముంది.

వ్యాధి లక్షణాలు

[మార్చు]

ఈ వ్యాధితో బాధపడుచున్న జంతువు లోనూ, మనుషులలోనూ ఒకే విధమైన లక్షణాలు ఉంటాయి. గాభరాగా ఉండడం, తికమక పడడం (confision) మితిమీరిన భయము, భయంకరమైన చూపు, తనదైన లోకములో విహరించడం, నోటి వెంబడి లాలాజలం కారడం, గొంతు నొప్పి, ఏమీ మింగలేకపోవడం, నీటిని, ద్రావకాలను చూస్తే భయపడడం (Due to throat muscles Spasm) ఇతరులను చూసి భయపడి కరిచేయడం మున్నగునవి. ఈ లక్షణాలు ముదిరి, గొంతు కండరాలు పెరాలసిస్ కి గురియై మనిషి ఏమీ తినలేక కోమాలోకి వెల్లి పోయి చనిపోవును. జబ్బు లక్షణాలు కనిపించిన 2 నుండి 10 రోజులలో చనిపోవును. ఒకవేల అరుదుగా బ్రతికినా మెదడు దెబ్బతిని పిచ్చివాడుగా బ్రతుకును.

చికిత్స

[మార్చు]
  • వ్యాధి రాకుండా కాపాడుకోవడం (prevention) : మనుషులలోను, జంతువులలోను ఈ వ్యాధి రాకుండా టీకా మందు వేసుకొని కాపాడుకోవచ్చు. 1885 లో లూయీస్ పాచ్చర్, ఇమిలె రౌక్స్ ఈ వాక్షిన్ ని కనుగొన్నారు. దీనిని ARV (Anti Rabis Vaccine) అంటాము. దీనిని మొదట 9 సంవత్సరాల బాలుని (జోసెఫ్ మైస్టర్) పై 1885 జూలై 06 లో ఉపయోగించారు.
  • వాక్షిన్ తయారు చేయు విధానము : రేబిస్ వైరస్ క్రిములను జంతువుల (గొర్రె) మెదడు కణాలలో ప్రయోగశాలలో పెంచి వాటిని నిర్జీవము చేసి శుద్ధిచేసి తగినటువంటి ద్రావకములో నిలువచేసి సుబ్కుటేనియస్ గా ఇంజక్షన్ చేస్తారు. ఈ పాత వాక్షిన్ వల్ల పోస్టు వాక్షినేషన్ ఎన్కెఫలైటిస్ అనే సీడు ఎఫక్ట్ ఊన్నందున రాను రాను హూమన్ డిప్లోయిడ్ సెల్ వాక్షిన్ 1967 లో తయారవడం మొదలైనది. తరువాత చిక్ ఎంబ్రియో, డక్ ఎంబ్రియో, ఆ తరువాత వెరోసెల్ కల్చర్ ద్వారా కోతి మూత్రపిండాల కణాల కల్చర్ ద్వార, పూరిఫైడ్ వెరోసెల్ రేబిస్-వాక్షిన్ తయార్వుతుంది.
  • ముందుగా వాక్షిన్ తీసుకోవడం : ఎక్కువగా పెంపుడు జంతువులతో గడిపేవారు, పశువైద్యులకు, పశువైద్యసిబ్బందికి, జంతుప్రదర్శన శాలలో పనిచేసేవారికి రేబిస్ ఎక్కువగా వున్న ప్రదేశాలలో తిరిగేవారికి ఇవ్వాలి. వీరోసెల్ కల్చర్ వాక్షిన్ 1వ,7వ,14వ రోజులలో 3 వాక్షిన్లు తీసుకొని, ప్రతి సంవత్సరము 1 డోసు బూస్టర్ డొసుగా తీసుకోవాలి. ఇలా చేయడం వలన ఎటువంటి ప్రమాదము ఉండదు.
  • చికిత్సా విధానము : ఈ కుక్క కాటు (ఏ జంతువైనా సరే) మూడు రకాలు మైల్డ్, మోడరేట్, సివియర్. ఏది ఏమైనా కరిచిన చోట సబ్బుతో బాగా కడగాలి, యాంటిసెప్టిక్ లోషన్ రాయాలి. గాయము బాగా ఎక్కువైనా కుట్లు వేయకూడదు, వేసితే వైరస్ క్రిములు కుట్లు లోపల ఉండిపోయి జబ్బు ఎక్కువ అవడానికి ఆస్కారముంటుంది. రోజూ క్లీనింగ్ చేసుకోవడం మంచిది. సివియర్ కాటు అయితే గాయము చుట్టూ పాసివ్ వాక్షిన్ ఇంజక్షన్ చేయాలి. నొప్పి తగ్గడానికి డాక్టర్ సలహా మేరకు నొప్పిని తగ్గించే మాత్రలు వాడాలి. గాయము చీము పట్టకుండా యాంటిబయోటిక్సు వాడాలి.
  • వాక్షిన్ ఇచ్చే ముందు ఆయా జంతువులు లౌ 10 రోజులు నిజముగా రేబిస్ అయినదో కాదో పరిశీలనలో వుంచాలి. పూర్వపు కోనూరు ఎ.ఆర్.వి తయారుకావడం లేదు. ప్రస్తుతం మార్కెట్ లో 5 నుండి 6 రకాల వాక్షిన్లు దొరుకుతున్నాయి.
  • కుక్క పిచ్చి ప్రవర్తన చూడాలి
  • కుక్క సొంగ కార్చుచున్నదేమో చూడాలి
  • కుక్కకు గజ్జి వగైరా వున్నాయేమో చూడాలి
  • పెంచిన కుక్కా, వూర కుక్కా అడిగి తెలుసుకోవాలి
  • తెలిసి ప్రతి పిచ్చి కుక్క కాటుకి పూర్తి కోర్సు ఇంజక్షన్లు వేసుకోవాలి వీరోసెల్ రేబిస్ వాక్షిన్ అయితే 0 - 3 - 7 - 14 - 28 - 90 రోజుల కోర్సు వాడాలి . ఇది IM (intramuscular) గా తీసుకోవచ్చు.
  • అనుమానము వున్న కుక్క కాటుకు 3 ఇంజక్షన్లు సరిపోతాయి. ఇవి 1- 7 - 14. రోజులలో తీసుకోవాలి.
  • వాక్షిన్ తీసికోని కేసులలో రేబీస్ వ్యాధి పూర్తిస్థాయిలో వచ్చి మనిషి చనిపోవును. ఈ వ్యాధికి చికిత్స లేదు.

వ్యాధి లక్షణాల చిత్రమాలిక

[మార్చు]

మూలము

[మార్చు]
  • Text book of Social and Preventive Medicine; Park and Park.
"https://te.wikipedia.org/w/index.php?title=రేబిస్&oldid=4314076" నుండి వెలికితీశారు