పిల్లి

వికీపీడియా నుండి
(పిల్లులు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పిల్లి
Bengal Cat (Fia).jpg
other images of cats
పరిరక్షణ స్థితి
శాస్త్రీయ వర్గీకరణ
రాజ్యం: ఏనిమేలియా
విభాగం: కార్డేటా
తరగతి: క్షీరదాలు
క్రమం: కార్నివోరా
కుటుంబం: ఫెలిడే
జాతి: ఫెలిస్
ప్రజాతి: ఫె.సిల్విస్ట్రిస్
ఉప ప్రజాతి: ఫె. సి. కేటస్
Trinomial name
ఫెలిస్ సిల్విస్ట్రిస్ కేటస్
(లిన్నేయస్, 1758)
పర్యాయపదాలు

Felis lybica invalid junior synonym
Felis catus invalid junior synonym[1]

పిల్లి లేదా మార్జాలం (ఆంగ్లం: Cat) కార్నివోరా క్రమానికి చెందిన చిన్న క్షీరదము. దీనిని పెంపుడు పిల్లి అని కూడా అంటారు. వీనిని మానవులు పురాతన కాలం నుండి సుమారు 9,500 సంవత్సరాలుగా పెంచుకుంటున్నారు.[2]


పిల్లులు పాములు, తేళ్ళు, ఎలుకలు మొదలైన సుమారు 1,000 పైగా జాతుల జీవాలను వాటి ఆహారం కోసం వేటాడడంలో మనకు తోడుగా ఎంతో సహాయం చేస్తాయి. ఇవి చాలా సులభంగా మనం చెప్పిన వాటిని నేర్చుకుంటాయి. ఇవి మియాం మొదలైన వివిధ శబ్దాలతో ఇతర పిల్లులతో సంభాషిస్తాయి.[3] అమెరికాలో 69 మిలియన్ పిల్లులు పెంపుడు జీవులుగా ఉన్నాయి,[4] కుక్కల తర్వాత రెండవ స్థానంలొ ఉన్నాయి. ప్రపంచ వ్యాప్తంగా ఇవి మొదటి స్థానంలో 600 మిలియన్ ఇండ్లలో పెంచుకోబడుతున్నాయి.[5]


పురాతన కాలపు ఈజిప్టు దేశంలో ఇవి కల్ట్ జంతువులు.[6] అయితే 2007 పరిశోధన ప్రకారం పెంపుడు పిల్లులు అన్నీ ఐదు రకాల ఆఫ్రికా పిల్లుల (Felis silvestris lybica circa 8000 BC) నుండి పరిణామం చెందాయని తెలిసింది.

పిల్లిపై తెలుగులో గల కొన్ని సామెతలు[మార్చు]

  • పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణసంకటం.
  • పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతూ తనను ఎవరూ గమనించలేదనుకొనిందట.
  • పొయ్యిలో నుండి పిల్లి లేవలేదు.

పిల్లులపై కొన్ని విశేషాలు[మార్చు]

బరువైన పిల్లి, తేలికైన పిల్లి, ఒకే ఈతలో (కాన్పులో) ఎక్కువ పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ వేళ్లు ఉన్న పిల్లి, ఎక్కువ కాలం బతికిన పిల్లి, తన జీవిత కాలంలో 420 పిల్లలు పెట్టిన పిల్లి, ఎక్కువ దూరం ప్రయాణించిన పిల్లి, డబ్బు బాగా ఖర్చు పెట్టే పిల్లి, బాగా డబ్బున్న పిల్లి, 16 అంతస్తులనుంచి పడినా దెబ్బ తగలని పిల్లి వంటి వి ఉన్నాయి.[7]

●తల్లి పిల్లి తన పిల్లలను తన తండ్రి కి కనిపించకుండా అవి కొంచెం బాగా తిరగగలిగే వరకు ఒకే దగ్గర ఉండకుండా వేరు వేరు ప్రదేశాలు మారుతూ వాటికి రక్షణ కల్పిస్తాయి.

●పిల్లి పిల్లలు తమ తండ్రికి కనిపించాయంటే మెడ కొరికి చంపేస్తాయి....

●తల్లిపిల్లి వాటి పిల్లలను ఎప్పుడూ శుభ్రంగా ఉండేవిధంగా నాలుకతో వాటి శరీరాన్ని శుభ్రం చేస్తుంటాయి...

చిత్రమాలిక[మార్చు]

ఇవి కూడా చూడండి[మార్చు]

బావురు పిల్లి

పునుగు పిల్లి

మూలాలు[మార్చు]

బయటి లింకులు[మార్చు]

Wikiquote-logo-en.svg
వికీవ్యాఖ్యలో ఈ విషయానికి సంబంధించిన వ్యాఖ్యలు చూడండి.
"https://te.wikipedia.org/w/index.php?title=పిల్లి&oldid=2345844" నుండి వెలికితీశారు