కర్ణ (1964 సినిమా)
స్వరూపం
కర్ణ,1964 ఏప్రిల్ 9 ,విడుదలైన డబ్బింగ్ చిత్రం. బి.ఆర్.పంతులు దర్శకత్వంలో,నందమూరి తారక రామారావు, దేవిక, సావిత్రి , శివాజీ గణేశన్ ముఖ్య తారాగణం . ఈ చిత్రానికి సంగీతం ఎం.ఎస్.విశ్వనాధన్ సమకూర్చారు.
| కర్ణ (1964 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | బి.ఆర్.పంతులు |
| తారాగణం | నందమూరి తారకరామారావు, సావిత్రి, దేవిక, శివాజీ గణేశన్, ఎమ్.వి.రాజమ్మ |
| నిర్మాణ సంస్థ | పద్మిని పిక్చర్స్ |
| భాష | తెలుగు |
తారాగణం
[మార్చు]- శివాజీ గణేశన్_కర్ణుడు
- నందమూరి తారక రామారావు_ కృష్ణుడు
- సావిత్రి_ భానుమతి(దుర్యోధనుడు భార్య)
- దేవిక_ శుభంగి
- ఎం.వి.రాజమ్మ_ కుంతీదేవి
- అశోకన్_ దుర్యోధనుడు
- ముత్తురామన్_అర్జునుడు
- జవర్ సీతారామన్_ భీష్ముడు
- తీవర్
- ముత్తయ్య_ శకుని
- కె.నటరాజన్
- ముస్తఫా_ కృపాచార్యుడు
- వీరాసామి_ ద్రోణాచార్యుడు
- ఆర్.బాలసుబ్రమణీయం_పరశురాముడు
- వి.ఎస్.రాఘవన్_విదురుడు
- ఎస్.వి.రామదాసు_ ఇంద్రుడు
- ఎస్.ఎ.జి.సామి_ధృతరాష్ట్రుడు
- కణ్ణన్_సంజయుడు
- ప్రేమకుమార్
- సాండో ఇంద్రజిత్_ భీముడు
- తంగరాజ్_నకులుడు
- చిన్నయ్య_ సహదేవుడు
- షణ్ముగ సుందరం_ షాలియన్
- కె.వి.శ్రీనివాసన్_సేజ్
- మాస్టర్ శ్రీధర్_ మేఘనాధుడు
- మాస్టర్ సురేష్_వృషసేనుడు
- ప్రభాకరరెడ్డి_ సూర్యుడు
- శోభన్ బాబు_ చంద్రుడు
- శ్రీరామ్_అయ్యర్
- సామికన్ను _అయ్యర్
- సెల్వరాజ్_దుర్ముకుడు
- కులదైవం రాజగోపాల్_ కబంధుడు
- ప్రొఫెసర్ రామమూర్తి_ విలువిద్య గురువు
- సంధ్య_కంగనుడు భార్య
- రుక్మిణి_అధిరతుడు భార్య , రాధ
- జి.శకుంతల _ మంగళ స్నేహితురాలు
- జయంతి_ ద్రౌపది
- కల్పన_అదృష్ట దేవత
- రాజేశ్వరి_ సత్యవతి స్నేహితురాలు
- కె.వి.సరోజ_ కుమారి కుంతి .
సాంకేతిక వర్గం
[మార్చు]- దర్శకుడు: బి.ఆర్.పంతులు
- సంగీతం: విశ్వనాథన్ ,రామమూర్తి
- గీత రచయిత:సింగిరెడ్డి నారాయణరెడ్డి
- నేపథ్య గాయకులు:మంగళంపల్లి బాలమురళీకృష్ణ, పులపాక సుశీల, ప్రతివాది భయంకర శ్రీనివాస్, మాధవపెద్ది సత్యం, టి.యం.సౌందరరాజన్
- ఛాయా గ్రహణం: వి.రామమూర్తి
- ఎడిటింగ్: ఆర్.దేవరాజన్
- నిర్మాత: బి ఆర్.పంతులు
- నిర్మాణ సంస్థ: పద్మిని పిక్చర్స్
- విడుదల:09:04:1964.
పాటలు
[మార్చు]- ఎవ్వరి కొరకే ఈ హృదిగీతి ఇదియే నాకు - సుశీల
- ఏది అర్పింతు ఏ విధి అర్పింతు(పద్యం) - పి.బి. శ్రీనివాస్
- కన్నులందే కనపడినాడే కన్నె మదిలో దాగున్నాడే - సుశీల
- గాలికి కులమేది ఏదీ నేలకు కులమేది - సుశీల -రచన: సి.నారాయణరెడ్డి
- తన ధర్మరక్తితో తన స్వామిభక్తితో దైవమును(పద్యం) - మంగళంపల్లి
- నీవు నేను వలచితిమే నందనమే ఎదురుగా - సుశీల,మంగళంపల్లి
- పడతి గళమున మాలలుంచి పసుపు పూసి - సుశీల బృందం
- పోవమ్మా ఇక పోయిరా ఎద పూచెను ఇపుడే - ?
- పుణ్యమే ఇదియంచు లొకమ్మనెనా అట్టి (పద్యం) - మంగళంపల్లి
- బంగరుమోము కళ మారె పొంగారె వన్నెలు - సుశీల బృందం
- భువిలో దేహమ్ము నిలవదు నమ్మరా వగవక - టి. ఎమ్. సౌందర్‌రాజన్
- మరణమ్మే ఎంచి కలతపడు విజయా - మంగళంపల్లి
- మొయిళ్ళొసగు వర్షమట రెండి మాసములు (పద్యం) - మాధవపెద్ది
- వారలు శాంతశూరులు సుమ్మా (పద్యం) - మంగళంపల్లి
- శాంతిన్ పొందుట నీకున్ కుంతీపుత్రులకున్ (పద్యం) - మంగళంపల్లి
| పాట | రచయిత | సంగీతం | |
|---|---|---|---|
| గాలికీ కులమేదీ ఏదీ నేలకు కులమేదీ | సి.నారాయణరెడ్డి | విశ్వనాథం, రామ్మూర్తి | పి.సుశీల |
| నీవు నేను వలచితిమి, నందనమే ఎదురుగ | row 2, cell 2 | row 2, cell 3 | బాలమురళీకృష్ణ, పి.సుశీల |
వనరులు
[మార్చు]- డి.వి.వి.ఎస్.నారాయణ సంకలనం చేసిన మధుర గాయని పి.సుశీల మధుర గీతాలు, జె.పి.పబ్లికేషన్స్, విజయవాడ, 2007.