కలపిని కొంకలి
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (ఆగస్టు 2018) |
కలపిని కొంకలి సంగీత విద్వాంసురాలు. ఆమె సుప్రసిద్ధ సంగీతకారులైన కొంకలి వసుంధర, కుమార్ గాంధర్వ ల కుమార్తె.[1]
జీవిత విశేషాలు
[మార్చు]ఆమె తల్లిదండ్రుల వద్ద సంగీత జ్ఞానాన్ని అభ్యసించారు. ఆమె డేవాస్ (మధ్య భారతదేశం) లో నివసిస్తున్నారు. ఆమె 1980ల ప్రారంభంలో ఆమె తండ్రి సంగీత కారునిగా వివిధ ప్రదేశాలలో ప్రయాణించుటను చూచి ఆయనకు సహాయపడుటలో తన అవసరాన్ని గుర్తించింది.ఆమె తల్లి కూడా "నీవు నేర్చుకోవడం ప్రారంభించు" అని చెప్పింది. ఆమె తల్లి వద్ద సంగీత జ్ఞానాన్ని పొందింది. 1983లో ఆమ తండ్రి వద్ద సంగీత పాఠాలను నేర్చుకున్నది. 1985లో ఆమె తన తండ్రితోపాటు ముంబాయిలో సంగీత ప్రదర్శనలో పాల్గొన్నది.[2]
అవార్డులు
[మార్చు]ఆమె కుమార్ గాంధర్వ సంగీత అకాదమీలో క్రియాశీలక ట్రస్టీ సభ్యులు. ఆమె భారత ప్రభుత్వ సాంస్కృతిక శాఖ నుండి ఫెలోషిప్ పొందారు. ఆమె కుమార్ గాంధర అవార్దును పొందారు.[3]
రికార్డింగులు
[మార్చు]ఆమె స్టుడియో రికార్డింగులలో కొన్ని "ఆరంభ" అంరియు "ఇన్‌హెరిటెన్స్"లు హెచ్.ఎం.టి.విలో విడుదలయ్యాయి. "ఢరోహర్" అనే ఆల్బం టైమ్స్ మ్యూజిక్ విడుదల చేసింది. "స్వర మంజరి" రికార్డింగు కూడా విడుదలయింది. ఆమె హిందీ చిత్రాలైన "పహేలీ", "దేవి అహిల్య" లకు సౌండ్ ట్రాక్స్ లను రికార్డు చేసారు.
మూలాలు
[మార్చు]- ↑ "kalapini Komkali: My father was a strict teacher". Charu Sharma. india net zone. Retrieved 31 July 2015.
- ↑ Kalapini Komkali: My father was a strict teacher
- ↑ "KALAPINI KOMKALI". Archived from the original on 2015-08-10. Retrieved 2015-07-31.