కొంకలి వసుంధర

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
కొంకలి వసుంధర ఫోటో

కొంకలి వసుంధర ప్రముఖ సంగీత విద్వాంసురాలు.[1] ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు స్వర్గీయ పండిట్‌ కుమార్‌ గంధర్వ సతీమణి[2]. వారి కుమార్తె కలపిని కొంకలి సైతం గాత్ర సంగీత కళాకారిణిగా పేరు తెచ్చుకున్నారు. ఆమె కళాకారిణిగా పద్మశ్రీ తో సహా పలు ప్రతిష్ఠాత్మక అవార్డులను పొందారు.[3][4]

జీవిత విశేషాలు

[మార్చు]

వసుంధర కొంకలి (శ్రీఖండే) సంగీతకారుల కుటుంబంలో కలకత్తాలో 1931న జన్మించింది.1946లో ముంబయిలోని ప్రొఫెసర్ డి.ఆర్.డియోధర్ వద్ద సంగీతం అభ్యసించారు. ఆమె హిందుస్థానీ శాస్త్రీయ సంగీత విద్వాంసులు స్వర్గీయ పండిట్‌ కుమార్‌ గంధర్వను వివాహమాడిన తరువాత ఆయన వద్ద సంగీత అధ్యయనం చేయడమే కాకుండా ఆయనకు సంగీత సహకారాన్నందించారు.[5] ఆమ భర్త ఆరోగ్యాన్నే కాకుండా సంగీత కళకు కూడా చేయూతనందించారు.ఆమె ఆయనతోకలసి అనేక సంగీత కార్యక్రమాలలో పాల్గొన్నది.ఆమె "గీతవర్ష", "గీత్ వసంత్", "గీత్ హేమంత్" , "తులసీదాస్ ఏక్ దర్శన్" వంటి సృజనాత్మక కార్యక్రమాలను నిర్వహించింది. ఆమె, ఖాయల్, ఫోక్ సాంగ్స్, భజన్స్ లను చక్కగా ఆలపించేది. ఆమె ఆల్ ఇండియా రేడియో, దూరదర్శన్ లకు నిరంతర కళాకారిణి. ఆమె అనేక అవార్డులను కైవసం చేసుకుంది. అందులో సంగీత నాటక అకాడమీ అవార్డు ఒకటి. ఆమె కుమార్తె కలపిని కొంకలి కూడా సంగీత విధ్వాంసురాలే.[6]

మరణం

[మార్చు]

ఆమె మధ్యప్రదేశ్‌ దెవాస్‌లోని స్వగృహంలో జూలై 29 2015 బుధవారం మృతి చెందారు[3].

మూలాలు

[మార్చు]
  1. "Recalling the grandeur of Hampi". Staff Correspondent. The Hindu. Retrieved 1 November 2006.
  2. Padma Shri Vasundhara Komkali, Kumar Gandharva’s wife, dies
  3. 3.0 3.1 "సంగీత విద్వాంసురాలు వసుంధర కొంకలి కన్నుమూత". హైదరాబాద్ మిర్రర్. Retrieved 31 July 2015.[permanent dead link]
  4. "Well known vocalist Vasundhara Komkali passes away". ఇండియన్ ఎక్స్‌ప్రెస్. Retrieved 31 July 2015.
  5. "Vasundhara Komkali". gaana.com/. Retrieved 31 July 2015.
  6. "short biography of konkali vasumdhara". swarganga.org. Retrieved 31 July 2015.

ఇతర లింకులు

[మార్చు]