Jump to content

కలిపి వ్రాత

వికీపీడియా నుండి
1884 నుండి స్పెన్సీరియన్ లిపిగా పేరొందిన క్లాసిన్ అమెరికన్ వ్యాపార గొలుసుకట్టు చేతిరాతకు ఒక ఉదాహరణ.
D'Nealian స్క్రిప్ట్, కలిపిరాత వర్ణమాల - చిన్న అక్షరాలు (lower case), పెద్ద అక్షరాలు (upper case).

కలిపి వ్రాత లేదా కర్సిన్ అనేది వేగంగా వ్రాయడానికి ఉపయోగించే ఒక రాత. కలిపిరాతను గొలుసుకట్టు వ్రాత, పూసకుట్టు రాత అని కూడా అంటారు. ఈ రాతలో భాష యొక్క చిహ్నాల రాత అతుక్కొని, /లేదా ప్రవహించే పద్ధతిలో ఉంటుంది. ఫార్మల్ గొలుసుకట్టురాత సాధారణంగా కలిపి ఉంటుంది, కాని సాధారణ గొలుసుకట్టురాత అనేది అతుకుల, పెన్ను పైకెత్తి రాయడముల యొక్క కలయిక. ఈ రచనా శైలిని ఇంకా "లూప్డ్" "ఇటాలిక్", లేదా "కనెక్టెడ్"గా కూడా విభజించవచ్చు. ఈ గొలుసుకట్టు పద్ధతి కారణంగా దీనిని మెరుగైన రచనా వేగానికి, అరుదుగా పెన్ను ఎత్తుటకు అనేక వర్ణమాలలతో ఉపయోగిస్తారు. కొన్ని వర్ణమాలలో ఒక పదంలోని అనేక లేదా అన్ని అక్షరాలు అనుసంధానమైవుంటాయి, కొన్నిసార్లు పదం ఒకే క్లిష్టమైన స్ట్రోక్‌తో తయారవుతుంది.

ఇంగ్లీష్

[మార్చు]
1894 నాటి ఇంగ్లీష్ లేఖలో గొలుసుకట్టువ్రాత
కార్యదర్శి చేతివ్రాత (Secretary hand) అనే కలిపివ్రాతలో వ్రాయబడిన విలియం షేక్స్పియర్ యొక్క వీలునామా

గొలుసుకట్టు రాతను నార్మన్ విజయానికి ముందు ఇంగ్లీష్ లో ఉపయోగించారు. ఆంగ్లో-సాక్సన్ ఛార్టర్స్ సాధారణంగా కలిపిరాతలో ప్రాచీన ఆంగ్లంలో వ్రాయాలనేది ఒక సరిహద్దు నిబంధన. కర్సివ్ చేతిరాత శైలి- సెక్రటరీ హ్యాండ్ అనే చేతిరాత ప్రారంభ 16వ శతాబ్దంలో ఇంగ్లాండ్ లో వ్యక్తిగత ఉత్తరప్రత్యుత్తరాలలో, అధికారిక పత్రాలలో విస్తృతంగా ఉపయోగించారు.

మూలాలు

[మార్చు]