Jump to content

కల్పన దత్తా

వికీపీడియా నుండి
కల్పన దత్తా (কল্পনা দত্ত)
వ్యక్తిగత వివరాలు
జననం(1913-07-27)1913 జూలై 27
శ్రీపూర్, బోయాల్‌ఖాలి ఉపజిలా, చిట్టగాంగ్ జిల్లా, బెంగాల్ ప్రావిన్స్, బ్రిటిష్ ఇండియా (ఇప్పుడు బంగ్లాదేశ్)
మరణం1995 ఫిబ్రవరి 8(1995-02-08) (వయసు 81)
కలకత్తా (ఇప్పుడు కోల్‌కతా), పశ్చిమ బెంగాల్, భారతదేశం
జాతీయతఇండియన్
రాజకీయ పార్టీఇండియన్ రిపబ్లిక్ ఆర్మీ, చిట్టగాంగ్ ప్రాంతీయ కార్యాలయం
1940వ సంవత్సరం నుంచి, భారత కమ్యూనిస్టు పార్టీ
నైపుణ్యంభారత స్వాతంత్ర్య ఉద్యమం కార్యకర్త, విప్లవకారిణి

కల్పన దత్తా (27 జూలై 1913 - 8 ఫిబ్రవరి 1995) భారతీయ స్వాతంత్ర్య ఉద్యమ కార్యకర్త. సూర్య సేన్ నేతృత్వంలోని సాయుధ స్వాతంత్ర్య ఉద్యమంలో సభ్యురాలు. 1930[1]లో జరిగిన చిట్టగాంగ్ ఉద్యమంలో చురుకుగా పాల్గొన్నది. తరువాత ఆమె భారత కమ్యూనిస్టు పార్టీలో చేరింది. 1943[2]లో అప్పటి జనరల్ సెక్రటరీ,సిపిఐ పురాన్ చంద్ జోషిని వివాహం చేసుకున్నారు.

బాల్యం, విద్య

[మార్చు]

కల్పన దత్తా శ్రీపూర్‌[3] బ్రిటిష్ ఇండియాలోని బెంగాల్ ప్రావిన్స్‌లోని చిట్టగాంగ్ జిల్లాకు చెందిన శ్రీపూర్ గ్రామంలోని బైద్య కుటుంబంలో జన్మించింది. ఇప్పుడు శ్రీపూర్ బంగ్లాదేశ్‌లోని బోల్ఖలి ఉపజిల్లాలో ఉంది. దత్తా తండ్రి బినోద్ బిహారీ దత్తగుప్తా ప్రభుత్వ ఉద్యోగి. దత్తా చిట్టగాంగ్ లో మెట్రిక్యులేషన్ 1929లో ఉత్తీర్ణులైనది. ఆ తర్వాత, కలకత్తా వెళ్లి సైన్స్‌లో గ్రాడ్యుయేషన్ కోసం బెతున్ కాలేజీలో చేరింది. వెంటనే ఛాత్రీ సంఘ (మహిళా విద్యార్థుల సంఘం) లో చేరింది. ఇందులో బీనా దాస్, ప్రీతిలత వడ్డేదార్ కూడా క్రియాశీల సభ్యులుగా ఉన్నారు.[4]

సాయుధ స్వాతంత్ర్య ఉద్యమం

[మార్చు]

1930లో చిట్టగాంగ్ దాడి ఏప్రిల్ 18న పకడ్బందీగా జరిగింది. కల్పన ఇండియన్ రిపబ్లికన్ ఆర్మీ, ఛత్తాగ్రామ్ బ్రాంచ్ లో చేరారు. ఇది సూర్య సేన్ నేతృత్వంలో ఉంది. సెప్టెంబర్ 1931లో సూర్య సేన్ ఆమెకు, ప్రీతిలత వడ్డేదార్‌ కు చిట్టగాంగ్‌లోని యూరోపియన్ క్లబ్ పై దాడి పనిఅప్పగించాడు. అయితే దాడికి వారం రోజుల ముందు, ఆ ప్రాంతంలో నిఘా నిర్వహిస్తున్నప్పుడు ఆమెను అరెస్టు చేశారు. బెయిల్‌పై విడుదలైన తర్వాత ఆమె కొంత కాలం అధికారుల కంట పడకుండా వెళ్లిపోయింది. 1933 ఫిబ్రవరి 16న పోలీసులు గైరాల గ్రామంలో వారు దాగివున్న ప్రదేశాన్ని చుట్టుముట్టారు. ఆ దాడిలో సూర్య సేన్‌ను అరెస్టు చేశారు. కానీ కల్పన అక్కడి నుండి తప్పించుకోగలిగింది. చివరకు ఆమెను 19 మే 1933 న అరెస్టు చేశారు. ఆమె 1939 లో విడుదలైంది.

తరువాత జీవితం

[మార్చు]

కల్పన దత్త 1940 లో కలకత్తా విశ్వవిద్యాలయం నుండి పట్టభద్రురాలయింది. అదే సమయంలో భారత కమ్యూనిస్ట్ పార్టీలో చేరారు. ఆమె 1943 బెంగాల్ కరువు సమయంలో, బెంగాల్ విభజన సమయంలో[5] సహాయక కార్యకర్తగా పనిచేసింది. ఆమె బెంగాలీలో చిట్టగాంగ్ దాడిలో పాల్గొన్నవారి జ్ఞాపకాలపై "চট্টগ্রাম অস্ত্রাগার আক্রমণকারীদের an" అనే స్వీయచరిత్ర పుస్తకాన్ని రాసింది. దీనిని ఆంగ్లంలోకి అరుణ్ బోస్, నిఖిల్ చక్రవర్తి అనువదించారు. "Chittagong Armoury Raiders: Reminiscences" పుస్తకానికి  'ముందుమాట' కమ్యూనిస్ట్ నాయకుడు, ఆమె భర్త పి. సి. జోషి రాసారు.  ఇది అక్టోబర్ 1945లో ప్రచురించబడింది. ఆమె 1946లో బెంగాల్ శాసనసభకు జరిగిన ఎన్నికల్లో చిట్టగాంగ్ నుండి భారత కమ్యూనిస్ట్ పార్టీ అభ్యర్థిగా పోటీ చేసింది, కానీ గెలవలేకపోయింది.

తరువాత, ఆమె ఇండియన్ స్టాటిస్టికల్ ఇనిస్టిట్యూట్‌లో చేరింది, అక్కడ ఆమె పదవీ విరమణ వరకు పనిచేసింది. ఆమె 8 ఫిబ్రవరి 1995న కలకత్తాలో మరణించింది.[6]

వ్యక్తిగత జీవితం

[మార్చు]

1943లో, ఆమె అప్పటి భారత కమ్యూనిస్ట్ పార్టీ జనరల్ సెక్రటరీ అయున పురాన్ చంద్ జోషిని వివాహం చేసుకుంది. వారికి చాంద్, సూరజ్ ఇద్దరు కుమారులు. చాంద్ జోషి (1946-2000) ప్రముఖ జర్నలిస్ట్, హిందూస్తాన్ టైమ్స్ లో పనిచేశారు. చాంద్ భార్య మణిని (నీ ఛటర్జీ) ఛత్తాగ్రామ్ ఆయుధాల దాడిపై, డూ అండ్ డై: ది ఛట్టాగ్రామ్ తిరుగుబాటు 1930-34 పేరుతో ఒక పుస్తకం రాసింది[7].

మూలాలు

[మార్చు]
  1. Chandra, Bipan and others (1998). India's Struggle for Independence, New Delhi: Penguin Books, ISBN 0-14-010781-9, p.253
  2. "Kalpana Joshi, 81; Struggled for India". The New York Times. 26 February 1995. Retrieved 19 May 2010.
  3. Sailesh Kumar Bandyopadhyay (2012), "Dutta, Kalpana", in Sirajul Islam and Ahmed A. Jamal (ed.), Banglapedia: National Encyclopedia of Bangladesh (Second ed.), Asiatic Society of Bangladesh
  4. Jain, Simmi (2003). Encyclopaedia of Indian Women through the Ages. Vol. 3. Delhi: Kalpaz Publications. p. 106. ISBN 81-7835-174-9.
  5. Nikhil Chakravartty, Kalpana Dutt's obituary in Mainstream, 18 February 1995.
  6. Nikhil Chakravartty, Kalpana Dutt's obituary in Mainstream, 18 February 1995.
  7. "This above All". The Tribune. 5 February 2000. Retrieved 19 May 2010.