కల్యాణ ఏకాదశి
స్వరూపం
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
మాఘమాసంలో బహుళ ఏకాదశిని కల్యాణ ఏకాదశి అంటారు. తిలలను ఆరు విధాలుగా ఉపయోగించే పర్వదినం. కనుక ‘‘షట్ తిలా ఏకాదశి’’ అని కూడా అంటారు. సంక్రాంతి పండుగనాడు కూడా నువ్వులతో పిండివంటలు చేసుకొనే సంప్రదాయం ఉంది. ఇందులో ఆరోగ్య సూత్రం ఇమిడి ఉంది. మాఘమాసంలో శివరాత్రికి ముందు వచ్చే ఏకాదశి నాడు ఆరు విధాలుగా నువ్వులను ఉపయోగించడంలో నువ్వులను దానం చేయడం ఒక అంశం. తిలాదానం గ్రహ శాంతి సందర్భాలలోనూ, పితృ కార్యాల లోనూ జరుగుతుంది గనుక కల్యాణ ఏకాదశినాడు తిలలతో పూజ చేయడం అసాధారణం అనిపిస్తుందిగాని ఇది పురాణాకాలం నుంచి వస్తున్న విధానం.
ఈ వ్యాసం జీవన విధానానికి సంబంధించిన మొలక. దీన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |