Jump to content

కళాసాగర్ యల్లపు

వికీపీడియా నుండి


కళాసాగర్ యల్లపు
జననండిశంబర్ 10, 1971
మంచిలి, అత్తిలి మండలం, పశ్చిమగోదావరి జిల్లా
వృత్తిచిత్రకారుడు, కార్టూనిస్టు మరియు రచయిత
Notable work64కళలు డాట్ కామ్
తల్లిదండ్రులు
  • యల్లపు నరసింహమూర్తి (father)
  • లక్ష్మీకాంతం (mother)
వెబ్‌సైటుhttps://64kalalu.com/

కళాసాగర్ యల్లపు చిత్రకారుడు, కార్టూనిస్ట్[1] మరియు రచయిత, తెలుగు అంతర్జాల పత్రిక 64 కళలు వ్యవస్థాపకుడు, సంపాదకుడు. [2]

జీవిత విశేషాలు

[మార్చు]

కళాసాగర్ యల్లపు పుట్టింది పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామం, డిశంబర్ 10 న,1971 లో. తల్లిదండ్రులు యల్లపు నరసింహమూర్తి, లక్ష్మీకాంతం,పశ్చిమ గోదావరి జిల్లా మంచిలి గ్రామంలో 1971 డిసెంబర్ 10న జన్మించిన ఆయన, పెయింటింగ్ మరియు జర్నలిజంలో డిప్లొమా పూర్తి చేశాడు. 1993 నుండి విజయవాడలో స్థిరపడి, వివిధ పబ్లికేషన్స్ మరియు పత్రికలలో చిత్రకారుడు మరియు ఇలస్ట్రేటర్‌గా పనిచేశాడు. ఆయన ఆంధ్రా ఆర్టిస్టు, స్కల్ఫ్టర్స్ అండ్ కార్టూనిస్టు అసోసియేషన్ (AASCA) 2001లో ఈ సంస్థను స్థాపించి, రాష్ట్రంలోని 500 మంది చిత్రకారులు, శిల్పులు, కార్టూనిస్టులను ఒకే వేదికపైకి తీసుకువచ్చాడు. 'ఆంధ్రకళాదర్శిని-1'[3] మరియు 'ఆంధ్రకళాదర్శిని-2' పుస్తకాలను ప్రచురించాడు.165 మంది తెలుగు కార్టూనిస్టుల పరిచయాలతో 'కొంటె బొమ్మల బ్రహ్మలు' అనే పుస్తకాన్ని ప్రచురించాడు.[4] వడ్డాది పాపయ్య శతజయంతి సందర్భంగా 'వపాకు వందనం' అనే ప్రత్యేక సంచికను కూడా ప్రచురించాడు.

అవార్డులు

[మార్చు]
  • 2006 సం.లో ప్రపంచ ఆరోగ్య సంస్థ 'పొగాకు వ్యతిరేక దినోత్సవం' సందర్భంగా నిర్వహించిన అంతర్జాతీయ కార్టూన్ పోటీలలో “బెస్ట్ కార్టూనిస్ట్” అవార్డు
  • 2010 సం.లో కోనసీమ చిత్రకళాపరిషత్, 'చిత్రకళా వైజయంతి' పురస్కారం
  • 2009 సం.లో అనకాపల్లి ఆర్ట్ అకాడెమీ, అనకాపల్లి పురస్కారం
  • 2012 సం.లో అజంతా కళారామం, తెనాలి పురస్కారం
  • 2022 - 'స్వామి వివేకానంద' ఇండియన్ ఐకాన్ పురస్కారం

పుస్తకాలు

[మార్చు]
  • ఆంధ్రకళాదర్శిని - 1 (2001 సం.)
  • ఆంధ్రకళాదర్శిని - 2 (2004 సం.)
  • తెలుగు తేజాలు (2021 సం.)
  • కొంటె బొమ్మల బ్రహ్మలు (2021 సం.)
  • ఆర్ట్ ఆఫ్ అంధ్రప్రదేశ్ (Art of Andhra Pradesh) -(2024)

మూలాలు

[మార్చు]
  1. "నరసింహ చంద్రకుమార్‌ కు ఎన్‌.టి.ఆర్‌ గ్రేట్‌ క్రియేటివ్‌ ఆర్టిస్ట్‌ అవార్డు". Prajasakti (in ఇంగ్లీష్). Retrieved 2024-07-30.
  2. ABN (2021-09-19). "'వపాకు వందనం' పుస్తకం ఆవిష్కరణ". Andhrajyothy Telugu News. Retrieved 2024-07-30.
  3. కళాసాగర్(సం.) (2001-07-01). ఆంధ్రకళాదర్శిని.
  4. "Konte Bommala Brahmalu By Kalasagar Yellapu – Logili BOOKS". logilitelugubooks.com. Retrieved 2024-07-30.