జి. కళ్యాణరావు

వికీపీడియా నుండి
(కళ్యాణరావు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search

కళ్యాణ రావు ప్రముఖ రచయిత. విప్లవ రచయతల సంఘ కార్యవర్గ సభ్యుడు, పూర్వ అధ్యక్షుడు.[1] నక్సలైట్‌లకు ప్రభత్వానికి మధ్య జరిగిన చర్చలలో మధ్యవర్తి. ఆయన రాసిన అంటరాని వసంతం నవల ప్రపంచ సాహిత్యంలో అపురూపమయినది. ఇది దాదాపు పది భాషల్లోకి అనువాదం పొందినది. [2]

అంటరాని వసంతం ఏడు తరాల దళితుల సాహిత్య సాంస్కృతిక విప్లవ చరిత్ర. ఆయన రాసిన ఆఖరి మనిషి అంతరంగం చరిత్ర సంస్కృతి సాహిత్యం మీద ఒక సాధికారమయిన పుస్తకము.

ప్రజల పక్షాన నిలబడి రాజ్యాన్ని, పెట్టుబడిని, భావజాలాన్ని, సామ్రాజ్యవాదాన్ని ప్రశ్నించినందుకు కవులు చీకట్లో బందీ అయినా వారి గొంతు వినిపించే అవకాశం లేకపోయినా కలాలు మాత్రం పదునైన అక్షరాల్లా ఉద్యమాన్ని ముందుకు నడిపిస్తాయని అతను అన్నాడు.[3]

1970లో ఆవిర్భవించిన విప్లవ రచయితల సంఘం (విరసం) తొలిసారి రాష్ట్రంలో నిషేధానికి గురైన సందర్భంలో అతను కొంత కాలం పాటు అజ్ఞాతంలోకి వెళ్లిపోయాడు.[4]

రచనలు

[మార్చు]
  • అంటరాని వసంతం[5]
  • ఆఖరి మనిషి అంతరంగం[6]
  • తెలుగు సాహిత్యంలో వేమన - వీరబ్రహ్మం ఒక సంభాషణ

మూలాలు

[మార్చు]
  1. "ఆర్కైవ్ నకలు". www.andhrajyothy.com. Archived from the original on 2020-06-29. Retrieved 2020-06-29.
  2. Varadarajulu, G. (2019-09-01). "The Cause of the Dalits: An Analysis of Kalyan Rao's Untouchable Spring". Shanlax International Journal of English (in ఇంగ్లీష్). 7 (4): 38–42. doi:10.34293/english.v7i4.594. ISSN 2320-2645.
  3. "ఆర్కైవ్ నకలు". m.andhrajyothy.com. Archived from the original on 2021-07-26. Retrieved 2020-06-29.
  4. Staff (2005-08-18). "నిషేధంతో అజ్ఞాతంలోకి కళ్యాణరావు". telugu.oneindia.com. Retrieved 2020-06-29.
  5. జి.కళ్యాణ రావు (2000-04-01). అంటరాని వసంతం.
  6. "ఇండియా చారిత్రక భౌతికవాదం | వేదిక | www.NavaTelangana.com". NavaTelangana. Retrieved 2020-06-29.