Jump to content

కవితా రాధేశ్యాం

వికీపీడియా నుండి
కవితా రాధేశ్యాం
జననం (1984-12-31) 1984 డిసెంబరు 31 (వయసు 40)
వృత్తినటి

కవితా రాధేశ్యాం (జననం 1984 డిసెంబరు 31) ఒక భారతీయ నటి. ఈమె విక్రమ్ భట్ దర్శకత్యంలో హూ డన్నిట్ ఉల్జన్ అనే టెలివిజన్ ధారావాహికలో నటించింది.[1] ఆమె కొన్ని కన్నడ, తమిళ చిత్రాలలో సహాయక పాత్రలలో, హిందీ చిత్రాలలోనూ నటించింది.

భారతదేశంలో జంతు బలిని నిషేధించాలంటూ పూర్తి నగ్నంగా ఫోజులిచ్చిన ఆమె వివాదాస్పదమైన సుప్రసిద్ధ బాలీవుడ్ నటిగా నిలిచింది. ఢిల్లీలో 1984 డిసెంబరు 31న జన్మించిన ఆమె ముంబైలో స్థిరపడింది. టెలివిజన్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 6కు వైల్డ్ కార్డ్ ఎంట్రీ ద్వారా వెళ్లడానికి నిరాకరించింది ఆమె.

కిషోర్ నమిత్ కపూర్ యాక్టింగ్ ఇన్ స్టిట్యూట్ లో కవితా రాధేశ్యాం చేరింది. ఆ తర్వాత సుభాష్ ఘాయ్ ఇన్ స్టిట్యూట్ విజిలింగ్ వుడ్స్ ఇంటర్నేషనల్ నిర్మించిన లఘుచిత్రాల్లో నటించింది. వివాదాస్పద డైరెక్టర్ ఫైసాల్ సైఫ్ నిర్మించిన పాంచ్ ఘంటే మైన్ పాంచ్ క్రోర్ అనే హిందీ చిత్రంలో ఆమె నటించింది. ఆమె 'కవితా రాధేశ్యాం యానిమల్ మూవ్ మెంట్' అనే పేరుతో వెబ్ సైట్ నిర్వహిస్తోంది. అలాగే, ఆమె స్మ్రితి ఇండియా అనే ప్రభుత్వేతర సంస్థకు ప్రతినిధిగా ఉంది.[2][3]

ఫిల్మోగ్రఫీ

సంవత్సరం సినిమా పాత్ర భాష దర్శకత్వం గమనిక
2012 పాంచ్ ఘన్తే మీన్ పాంచ్ క్రోర్ రేష్మా సలావుద్దీన్ హిందీ ఫైజల్ సైఫ్ 2012 ఆగస్టు 10న విడుదలైంది
2013 భర్లా మల్వత్ రఖ్తానా మోనా మరాఠీ అనూప్ జగ్దాలే
రాగిణి ఐపిఎస్ సావిత్రి కన్నడ ఆనంద్ పి.రాజు పూర్తయింది
2014 కోబ్రా కన్నడ హెచ్.వాసు చిత్రీకరణ
అదృష్ట కన్నడ బద్రీనాథ్ చిత్రీకరణ
షాదీ ముబారక్ హిందీ సయ్యద్ హుస్సేన్ ప్రీ ప్రొడక్షన్

టెలివిజన్

సంవత్సరం షో పాత్ర భాష ఛానల్
2011 గజబ్ దేశ్ కీ అజబ్ కహానియన్ సెలబ్రిటీ అతిథి హిందీ ఎన్డీటీవి ఇమాజిన్
2010 హూ డన్నిట్ ఉల్జన్ గంగాబాయి హిందీ స్టార్ వన్

ఇవి కూడా చూడండి

మూలాలు

  1. "Bold and Beautiful Uljhan – Glamgold". Archived from the original on 13 April 2014. Retrieved 29 September 2016.
  2. Banerjee, Debesh (7 June 2011). "Skin for Skin". Indian Express. Retrieved 2011-09-09.
  3. "Kavita Radheshyam Interview".

ఇతర లింకులు