Jump to content

కశికా కపూర్

వికీపీడియా నుండి
కశికా కపూర్
2024లో కశిక
జననం (2006-02-18) 2006 ఫిబ్రవరి 18 (వయసు: 20)
చదువుజమునాబాయి నర్సీ స్కూల్
పాఠశాల/కళాశాలలున్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ
వృత్తి
  • నటి
  • మోడల్
క్రియాశీలక సంవత్సరాలు2021–ప్రస్తుతం
తల్లిదండ్రులుదివ్య రీతూ కపూర్,
దీపక్ టెక్చందాని

కశికా కపూర్ (జననం 2006 ఫిబ్రవరి 18), భారతీయ నటి, మోడల్.[1] ఆమె శిక్షణ పొందిన కథక్ నర్తకి, గాయని. స్విమ్మింగ్, త్రో బాల్, బాస్కెట్‌బాల్ మొదలైన క్రీడలలో జాతీయ స్థాయి క్రీడాకారిణి కూడా. ఆమె ముంబైలోని జెఫ్ గోల్డ్‌బెర్గ్ స్టూడియోలో, ఆ తరువాత ప్రసిద్ధ న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీ నుండి నటనలోనూ శిక్షణ తీసుకుంది. మోడల్ గా కొన్ని వాణిజ్య ప్రకటనలలోనూ నటించింది.

ఆమె బాలీవుడ్, తెలుగు సినిమాలతో పాటు మ్యూజిక్ వీడియోలకు కూడా ప్రసిద్ధి చెందింది. ఆమె ఆయుష్మతి గీతా మెట్రిక్ పాస్ (2024)తో బాలీవుడ్‌లో అరంగేట్రం చేసింది. ఆమె ఎల్‌వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్ (2025)తో తెలుగు చిత్ర ప్రవేశం చేసింది. డజనుకు పైగా మ్యూజిక్ వీడియోలలో కథానాయికగా చేసింది.

ప్రారంభ జీవితం

[మార్చు]

కశిక 2006 ఫిబ్రవరి 18న ముంబైలో దీపక్ టేక్చందాని, దివ్య రీతూ కపూర్ దంపతులకు జన్మించింది, ఆమెకు సాక్షి టేక్చందాని కపూర్ అనే సోదరి కూడా ఉంది.

కశిక జమునాబాయి నర్సరీ పాఠశాలలో చదివి, ఆ తరువాత ఎన్ఎంఐఎంఎస్ డీమ్డ్-టు-బి-యూనివర్శిటీ నుండి దూర విద్య ద్వారా బ్యాచిలర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ (బిబిఎ) డిగ్రీ పొందింది. ముంబై లోని జెఫ్ గోల్డ్బెర్గ్ స్టూడియోలో ఆరు నెలలు నటనలో శిక్షణ పొంది, న్యూయార్క్ ఫిల్మ్ అకాడమీలో మూడేళ్ల ప్రొఫెషనల్ యాక్టింగ్ కోర్సును పూర్తి చేసింది.[2][3]

ఫిల్మోగ్రఫీ

[మార్చు]

సినిమా

[మార్చు]
సంవత్సరం శీర్షిక పాత్ర భాష మూలం
2024 ఆయుష్మతి గీతా మెట్రిక్ పాస్ గీతా హిందీ [4]
2025 ఎల్వైఎఫ్: లవ్ యువర్ ఫాదర్ స్వీటీ తెలుగు [5][6][7]

మూలాలు

[మార్చు]
  1. "కొడుకు కోసం తండ్రి పడే ఆరాటమే 'లైఫ్‌' | 'LYF: Love Your Father' Movie Latest Update | Sakshi". web.archive.org. 2024-09-28. Archived from the original on 2024-09-28. Retrieved 2024-09-28.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. Chakravorty, Reshmi (2025-04-09). "Kashika Kapoor: I believe in being raw and real". The New Indian Express (in ఇంగ్లీష్). Retrieved 2025-08-18.
  3. "Cover Story: "I'm Rising With Resilience, Shining With Intention," Says Kashika Kapoor | Filmfare.com". www.filmfare.com (in ఇంగ్లీష్). Retrieved 2025-08-18.
  4. "Aayushmati Geeta Matric Pass Movie Review: This social drama makes a strong point despite the flaws". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2025-08-18.
  5. "LYF - Love Your Father Review". Cine Josh (in ఇంగ్లీష్). 2025-04-04. Retrieved 2025-08-18.
  6. {{cite AV media}}: Empty citation (help)
  7. Harsh, B. H. (2024-11-09). "First look unveiled of LYF (Love Your Father)". Cinema Express (in ఇంగ్లీష్). Retrieved 2025-08-18.