కస్తూరి కృష్ణమాచార్యులు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

కస్తూరి కృష్ణమాచార్యులు తెలంగాణకు చెందిన ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, విమోచనోద్యమకారుడు, రచయిత, రాజకీయ నాయకుడు. ఈయన 1920లో మెదక్ జిల్లా చౌటుకూరు గ్రామంలో జన్మించారు.[1] 1938లో విద్యార్థి దశలోనే వందేమాతరం ఉద్యమంలో పాల్గొన్నారు. న్యాయశాస్త్ర పట్టా పొందిన కృష్ణమాచార్యులు న్యాయవాద వృత్తిని చేపట్టి 1947-48లో నిజాం నిరంకుశ పాలనకు వ్యతిరేకంగా జరిగిన విమోచనోద్యమంలో కూడా చురుకుగా పాల్గొన్నారు. హైదరాబాదు రాజ్య విమోచన అనంతరం రాజకీయాలలో ప్రవేశించి మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా పనిచేశారు. 1952లో హైదరాబాదు రాష్ట్ర శాసనసభకు, 1957లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాసనసభకు ఎన్నికైనారు. రచయితగా పేరుపొందిన కృష్ణమాచార్యులు "స్వాతంత్ర్యదీక్ష" గ్రంథాన్ని రచించారు.

మూలాలు[మార్చు]

  1. మెదకు జిల్లా స్వాతంత్ర్యోద్యమము - సమరయోధులు, రచన: ముబార్కపురం వీరయ్య, పేజీ 80