కాకర నూకరాజు
కాకర నూకరాజు | |||
ఎమ్మెల్యే
| |||
అధికారంలో ఉన్న వ్యక్తి | |||
అధికార ప్రారంభం 1985 నుండి 1999 | |||
ముందు | గంటెల సుమన | ||
---|---|---|---|
తరువాత | చెంగల వెంకటరావు | ||
నియోజకవర్గం | పాయకరావుపేట నియోజకవర్గం | ||
వ్యక్తిగత వివరాలు
|
|||
జననం | 1954 చినగుమ్ములూరు గ్రామం, యస్. రాయవరం మండలం, అనకాపల్లి జిల్లా, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం | ||
రాజకీయ పార్టీ | స్వతంత్ర | ||
ఇతర రాజకీయ పార్టీలు | తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతా పార్టీ | ||
వృత్తి | రాజకీయ నాయకుడు |
కాకర నూకరాజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి చెందిన రాజకీయ నాయకుడు. ఆయన పాయకరావుపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా గెలిచాడు.
రాజకీయ జీవితం
[మార్చు]కాకర నూకరాజుకు తెలుగుదేశం పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చి 1985 ఎన్నికల్లో తెలుగుదేశం అభ్యర్ధిగా 29,768 ఓట్ల మెజార్టీతో కాంగ్రెస్ అభ్యర్ధి హర్షకుమార్ పై, 1989 ఎన్నికల్లో కాకర నూకరాజు కాంగ్రెస్ అభ్యర్ధి గంటెల సుమనపై 3,278 ఓట్ల మెజార్టీతో, 1994 ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ధి గంటెల సుమనపై 7576 ఓట్ల మెజార్టీతో మూడో సారి ఎమ్మెల్యేగా పాయకరావుపేట నియోజకవర్గం నుండి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై హాట్రిక్ సాధించాడు. ఆయన ఆ తరువాత బీజేపీలో చేరి 2019లో ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయాడు.[1] కాకర నూకరాజు కేంద్రం విశాఖ ఉక్కును ప్రైవేట్ పరం చేయాలని తీసుకున్ని నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ఆయన 2021లో బీజేపీ పార్టీకి రాజీనామా చేసి ఆ తర్వాత రాజకీయాలకు దూరంగా ఉంటున్నాడు.
మరణం
[మార్చు]కాకర నూకరాజు అనారోగ్యంతో బాధపడుతూ విశాఖలోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ 2023 సెప్టెంబర్ 18న మరణించాడు.[2][3][4]
మూలాలు
[మార్చు]- ↑ Sakshi (18 March 2019). "బీజేపీ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదల". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ NTV Telugu (18 September 2023). "మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు మృతి!". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Disha Daily (18 September 2023). "మాజీ ఎమ్మెల్యే నూకరాజు కన్నుమూత". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.
- ↑ Nava Telangana (18 September 2023). "మాజీ ఎమ్మెల్యే కాకర నూకరాజు కన్నుమూత -". Archived from the original on 18 September 2023. Retrieved 18 September 2023.