కాగు
విజ్ఞాన సర్వస్వంతో సమ్మిళితం కావాలంటే ఈ వ్యాసం నుండి ఇతర వ్యాసాలకు మరిన్ని లింకులుండాలి. (అక్టోబరు 2016) |
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
కాగు ఇది మట్టితో పెద్ద కుండలాగ కుమ్మరి చేసి ఇస్తాడు. రెండు వైపుల చిన్న మూతి కలిగి, మధ్యలో రెండడుగులు వ్యాసం కలిగి సుమారు నాలుగడుగులు ఎత్తు కలిగిన పెద్ద మట్టి పాత్రే కాగు. దీనిని నేలమీద పెట్టి అందులో బియ్యం, ధాన్యం ఇతర పప్పు దినుసులు దాస్తుంటారు. దీన్ని మనకు అనుకూలమైన ప్రదేశంలోనికి మార్చుకొని పెట్టుకోవచ్చు. కాగు .... ఏక వచనము, కాగులు.... బహువచనము.
వేడినీళ్ల రాగి కాగు లేదా బాయిలరు
[మార్చు]విద్యుత్తు పూర్తిగా వాడకం రాకముందు కాలం,ముఖ్యంగా చలికాలంలో వేడినీళ్లకై ఈ రాగి కాగును వాడేవారు.దీనిని బాయిలరు అనికూడా అంటారు. ఇది రాగితో చెయ్యబడి వుండును. ఇది చూచుటకు స్తూపాకారం వెలుపలి నిర్మాణం కల్గి,లోపల మధ్యలో నిలువుగా గొట్టం కలిగి వుండును.అడుగు భాగం,పైభాగం గోళాకారంగా వుండును.స్తూపాకారభాగం నిలువుగా వుండేళా ఒకస్టాండు మీడ దీనిని బిగించెదరు.స్తూపాకారభాగానికి,గొట్టానికి మధ్యభాగంలో నీరు వుండును.నిలువు గొట్టాన్ని చిమ్ని అంటారు. ఈ చిమ్ని ఆడుగుభాగం ప్లేట్కు రంధ్రాలున్న జాలీ బిగింపబడి వుండును.నిలువు గొట్టంలో పిడకలు,బొగ్గు,లేదా చిన్న కట్టేపేడులు వేసి మండించెదరు.మంట వలన ఏర్పడిన వేడిని గొట్టం/చిమ్నీ ద్వారా గ్రహించి నీరు వేడెక్కును. వేడెక్కిన నీటిని తీసుకొనుటకు కిందిభాగంలో పక్కగా ఒక కొళాయి/వాల్వు/కవాటంవుండును.పై భాగాన గోళాకార భాగంలో నీరు పోయుటకు ఒక మూత వుండును.
ప్రస్తుతం ఇలాంటీ రాగికాగు లేదా బాయిలరులను రోడ్దుపక్కన వుండే టీ/కాఫీ స్టాలులలో చూడవచ్చును.