Jump to content
వికీ పాఠకులే వికీ రచయితలు!
వికీలో వ్యాసాలు రాస్తున్నది ఎక్స్పర్టులూ, సబ్జెక్టు నిపుణులూ కాదు. ఇక్కడ సాధారణ పాఠకులే వ్యాసాలు రాస్తారు. అందరూ కలిసి పరస్పర సహకారంతో, సమన్వయంతో పనిచేస్తూ వ్యాసాలను రాస్తారు. వివిధ వనరుల్లోంచి సమాచారాన్ని సేకరించి, ఆ మూలాలను ఉదహరిస్తూ ఆ సమాచారాన్ని వికీలో చేరుస్తారు. మరింత సమాచారం కోసం వికీపీడియా:పరిచయము చూడండి. ఈ పనిలో మీరూ భాగం పంచుకోవచ్చు. వికీలో ఖాతా సృష్టించుకోండి. మీకు ఆసక్తి ఉన్న విషయం గురించిన సమాచారాన్ని రాసి, వికీ అభివృద్ధిలో మీరూ తోడ్పడండి. ఈ విషయంలో సందేహమేమైనా ఉంటే వికీపీడియా సహాయకేంద్రంలో అడగండి.

కవాటం

వికీపీడియా నుండి
ఈ నీటి వాల్వులు చేతితో త్రిప్పటం ద్వారా నిర్వహించుకోవచ్చు.
కార్బను స్టీలు గ్లోబ్ వాల్వు
స్టెయిన్‌లెస్ స్టీలు గేట్ వాల్వు
బాల్ వాల్వు రేఖాచిత్రం
క్షితిజ సమాంతర స్థితి,నిలువుగా బిళ్ల లేచే వాల్వు
ఎటవాలుగా తెరచుకొను చెక్‌వాల్వు

కవాటం (Valve - వాల్వ్) అనేది తెరవటం, మూయటం, లేదా కొంత తెరవటం లేదా కొంత మూయటం వంటి వివిధ మార్గాల ద్వారా ద్రవం (వాయువులు, ద్రవాలు, ద్రవించిన ఘనాలు, లేదా పాక్షిక ద్రవ మిశ్రమం) యొక్క ప్రవాహమును క్రమబద్దీకరించే లేదా నియంత్రించే ఒక పరికరం.[1]

వర్గీకరణ

[మార్చు]

కవాటాలను స్థూలంగా పలు రకాలుగా వర్గీకరించవచ్చు.

  1. నిలుపుదల చేయు, నియంత్రణ చేయు కవాటాలు (stop valves or control valves)
  2. రక్షణ కవాటాలు (safety valves)
  3. పీడన ఉపశమన కవాటాలు (relief valves)
  4. ఏక దిశ నియంత్రణ వాల్వు/ఏకదిశ ప్రవాహ కవాటం (check vlave/non return valve)
  5. మధ్యపటల వాల్వులు (diaphragm valve)

నియంత్రణ కవాటాలు

[మార్చు]

ఈరకం వాల్వులే అధికంగా, విస్తృతంగా వాడుకలో ఉన్నాయి. కొన్ని వాల్వులు ప్రవాహాన్ని పూర్తిగా నిలుపుదల చెయ్యడం, అవసరాన్నిబట్టి తగిన పరిమాణంలో ప్రవహించునట్లు చేయుటకు ఉపయోగిస్తారు. వాల్వు బిళ్ళ లేదా డిస్కును పాక్షికంగా తెరచి వుండం వలన ప్రవాహవేగాన్ని,పీడనాన్ని,పరిమాణాన్ని నియంత్రణ వుంచుతారు. మరి కొన్ని రకాల కవాటాలుఇలా ప్రవాహాన్ని నియంత్రణలో కాకుండా ప్రవాహాన్ని పూర్తిగా ఆపుట లేదా పూర్తిగా ప్రవహించేలా పనిచేయును.ప్రవాహాన్ని నియంత్రణలో వుంచు కవాటాలను స్టాప్ అండ్ కంట్రోలు వాల్వులు లేదా రెగ్యులెటింగు వాల్వులు అంటారు.[2] గ్లోబ్ వాల్వులు,బాల్ వాల్వులు అనేవి నియంత్రణ/కంట్రోలు చేవ్యు రకానికి చెందిన వాల్వులు. కంట్రోలు వాల్వులను కూడా పూర్తిగా తెరచి వుంచవచ్చు,కాని ప్రవహించు పదార్థాల ప్రవాహా పీడనం, వాల్వు లోపలి వచ్చు ప్రవాహా పీడనం కన్న వాల్వు బయటికి వెళ్ళు ప్రవాహా పీడనం చాలా తక్కువగా ఉండును.త్వరణం ఎక్కువగా వుండును. ప్రవహా నియంత్రణ లేకుండా పూర్తిగా తెరచి వుంచు కవాటాలను గేట్ వాల్వులు అంటారు.ఇందులో వాల్వు డిస్కు లేదా తెరచు భాగం గుండ్రంగా లేదా ఉలి వంటి ఆకారంలో వుండి,వాల్వు బాడీలో పైకి కిందికి కదులును.

రకాలు

[మార్చు]
  1. గ్లోబు వాల్వు
  2. గేట్ వాల్వు
  3. ప్లగ్ వాల్వు
  4. బాల్ వాల్వు
  5. బటరుఫ్లై వాల్వు
  6. వాటరు కాక్

సేఫ్టి వాల్వులు/ రక్షణ కవాటాలు

[మార్చు]

ఏదైనా ద్రవం లేదా వాయువు లేదా ఆవిరులు ఒక గొట్టంలో నిర్దేశించిన పనిచేయు పీడనం కన్నఎక్కువ పీడనస్థితికి చేరి ప్రవహిస్తున్నప్పుడు, లేదా ఏదైనా పాత్రలో వున్న ద్రవం లేదా వాయువు లేదా ఆవి రులు ఆపాత్ర యొక్క నిల్వ ఉంచు సామర్ధ్యం మించి పీడనంలో ఉన్నప్పుడు, ఏర్పడిన అధిక పీడనబలం వలన పైపులు లేదా పాత్ర విస్పొటన చెంది నష్టం వాటిల్లును. అలాంటి స్థితిలో అధిక పీడనం ఏర్పడినపుడు వాల్వులు తెరచుకుని,పీడనం కల్గించు పదార్థాలను బయటికి పంపి, అధిక పీడనం తగ్గించి, తిరిగిమాములుగా నిర్దేశించిన పీడనస్థాయికి రాగానే మూసుకునే వాల్వులను రక్షణ కవాటాలు లేదా సేఫ్టి వాల్వులు అంటారు.[3] సేఫ్టివాల్వులను ఎక్కువగా బాయిలరులలో,లేదా స్టీము లోకో మోటివ్ ఇంజనులలో ఉపయోగిస్తారు.లేదా సంపిడనంకావించిన గాలి పీడన నియంత్రణకు ఉపయోగిస్తారు.

రకాలు

[మార్చు]

సేఫ్టి వాల్వుల/ రక్షణ కవాటాల ఆకృతి, పనిచేయు విధాన ఆధారంగా నాలుగైదు రకాలుగా వర్గీకరించారు. అవి

  1. డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు
  2. లివరు సేఫ్టి వాల్వు
  3. స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు
  4. హై ప్రెసరు- లోవాటరు సేఫ్టి వాల్వు.

పీడన ఉపశమన కవాటాలు

[మార్చు]

వీటిని ఆంగ్లంలో pressure relief valves అంటారు. ఇవి కూడా ఒకరకంగా సేఫ్టి వాల్వుల వంటివే. సేఫ్టి వాల్వులను ఎక్కువగా అధిక పీడనం వున్న నీటి ఆవిరి/స్టీమును బయటకు వదులుటకు ఉపయోగించగా, పీడన ఉపశమన కవాటాలను ద్రవ, వాయు పదార్థాల పీడనాన్ని నియంత్రణలో వుంచుటకు ఉపయోగిస్తారు.ప్రవహించు పదార్థాల పీడనం పనిచేయుబ్పీడనం మించినచో,అధిక పీడనం తగ్గేవరకు వాల్వు పాక్షికంగా తెరచుకొని,వాల్వుకున్న మరో పైపు ద్వారా ప్రవాహ పదార్హాన్ని వెనుకకు పంపును.[4]

ఏక దిశ ప్రవాహ వాల్వులు

[మార్చు]

ఈ రకపు వాల్వులలో ద్రవం లేదా వాయువు ఒకే దిశలో ప్రయానించును.వ్యతిరేక దిశ లేదా మార్గంలో ప్రవహించదు.వీటిని చెక్ వాల్వులు (check valve)అని నాన్ రిటర్న్ వాల్వు (Non return valve)అనికూడా అంటారు.ఈ చెక్ వాల్వులు పలురకాల ఉన్నాయి. వాల్వులోపలి బిళ్ళతెరచుకునే విధానం.పనిచేసే విధానం ప్రకారం వీటీని పలురకాలుగా తయారు చేస్తారు.[5]

  1. వెర్టికల్ చెక్ వాల్వు
  2. హరిజాంటల్ పొజిసన్ వెర్టికల్ లిప్టు వాల్వు
  3. స్వింగు చెక్ వాల్వు (బిళ్ళఏటవాలుగా తెరచుకొను వాల్వు)
  4. టిట్లింగు చెక్ వాల్వు
  5. ఆల్ పొజిసన్ స్ప్రింగు డిస్కు చెక్ వాల్వు/స్ప్రింగు లోడెడ్ చెక్ వాల్వు
  6. మధ్యపటల ఏకదిశ వాల్వు (Diaphragm valve)
  7. బాల్ చెక్ వాల్వు

ఇవి కూడా చదవండి

[మార్చు]

మూలాలు/ఆధారాలు

[మార్చు]
  1. "Valves". explainthatstuff.com. Archived from the original on 2017-08-01. Retrieved 2018-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  2. "Stop valve". thefreedictionary.com. Retrieved 2018-02-25.
  3. "What is safety valve". fkis.co.jp. Archived from the original on 2017-08-08. Retrieved 2018-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
  4. "what is a pressure relief valve". mgacontrols.com. Retrieved 2018-02-25.
  5. "How It Works: Check Valves". cameron.slb.com. Archived from the original on 2017-06-09. Retrieved 2018-02-25.{{cite web}}: CS1 maint: bot: original URL status unknown (link)
"https://te.wikipedia.org/w/index.php?title=కవాటం&oldid=4106143" నుండి వెలికితీశారు