బాల్ చెక్ వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
క్షితిజసమాంతర బాల్ చెక్ వాల్వు
క్షితిజస లంబ బాల్ చెక్ వాల్వు

బాల్ చెక్ వాల్వు అనునది ఒక ఏకదిశ ప్రవాహ కవాటం.ఏకదిశ ప్రవాహ కవాటం అనునది ఒక ప్రత్యేక రకమైన కవాటం. ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువు ప్రవాహం కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును. వ్యతిరేక మార్గంలో ప్రవహించుటకు ప్రయత్నించిన వెంటనే కవాట తలుపు, కవాట ప్రవేశమార్గం/వాకిలిని మూసివేసి, ప్రవాహం వెనక్కి వెళ్ళకుండా నిరోదించును.

కవాటమనగా నేమి?[మార్చు]

కవాటం అనగా ఒక వ్యవస్థ లేదా గొట్టంలో ప్రవహిస్తున్న ఒక ద్రవంలేదా వాయువు యొక్క ప్రవాహాన్ని పూర్తిగా నిలిపి వేయునది, లేదా పాక్షికంగా ప్రవహించునటుల నియంత్రణ చేయునది, లేదా ప్రవాహాన్ని పూర్తిస్థాయిలో గొట్టంలో ప్రవహించునటుల చేయు పరికరం[1].ఇందులో ప్రవాహాన్ని నియంత్రణ చేయు కవాటబిళ్ళ యొక్క కాడ పిడి కల్గి వుండి, ప్రవాహం వెళ్ళునపుడు పిడిని ఒకదిశలో తిప్పడం వలన వాల్వు తెరచు కొనును.గొట్టం నుండి ద్రవ/వాయు ప్రవాహం /ప్రసరణ లేనప్పుడు, కవాటం తనకు తానుగా మూసుకోదు. తిరిగి కవాటం పిడిని వ్యతి రేకదిశలో తిప్పినపుడు మాత్రమే మూసుకొనును.

ఏకదిశ ప్రవాహ కవాటమనగానేమి?[మార్చు]

ఏకదిశ ప్రవాహ కవాటంలో ద్రవం లేదా వాయువులు కేవలం ఒకదిశలో మాత్రమే ప్రవహించును[2].ఏకదిశ ప్రవాహ కవాటాన్ని ఆంగ్లంలో చెక్ వాల్వు అనియు, నాన్ రిటర్నువాల్వు అంటారు.వ్యతిరేక దిశలో ప్రవహించుటను తనకు తాను స్వయం ప్రీరితంగా నిరోధించును. ఏకదిశ ప్రవాహ కవాటంఒక విధంగా రక్షణ కవాటం/సేఫ్టి వాల్వుగా పనిచేయును.ఉదాహరణకుగ్లోబ్ వాల్వు లేదాప్లగ్ వాల్వు లేదా బాల్ వాల్వు లలో రెండు వైపులా ప్రవహించును. పైన పేర్కొన్న వాల్వులు అటోమాటిగా మూసుకోవు. గొట్టంలో ఒక ద్రవం కొంత పీడనంతో ఒక దిశలో ప్రవహిస్తూ, ఏదైనా కారణం చేత ప్రవాహం ఆగిన, ప్రవాహం వెళ్ళిన దిశలో/ మార్గంలో పీడనం ఎక్కువ ఉండుటచే, ద్రవం వెనక్కి ప్రవహించడం మొదలు పెట్టును.ఒక పంపు ద్వారా ద్రవం వెళ్ళుచు, పంపు ఆగిన గొట్టంలోని ద్రవం వ్యతిరేక దిశలో వెనక్కి పంపులోకి రావడం వలన పంపు/తోడు యంత్రం పాడై పో వును. ఒకవేళ కంప్రెసరు (వాయు సంకోచక యంత్రం) నుండి వాయువు పీడనంతో ప్రవహిస్తూ కంప్రెసరు ఆగిన, వాయువు ఎక్కువ పీడనం, త్వరణంతో వెన్నక్కి ప్రవహించడం వలన కంప్రెసరు పాడగును. బాయిల రు పని చేయునపుడు అందులో తయారగు స్టీము అధిక పీడనం కల్గి వుండును. కావున బాయి లరులో వున్న పీడనం కన్న ఎక్కువ పీడనంతో నీటిని పంపు ద్వారా పంపిస్తారు. ఎప్పుడైతే పంపు ఆపిన వెంటనే, బాయి లరులో పీడనం ఎక్కువగా వుండటం వలన స్టీము + నీరు వెనక్కి పంపులోకి, ఫీడ్ వాటరు టాంకులోకి ప్రవేశించి నష్టం వాటిల్లును.

అందువలన ఎక్కువ పీడనం, వేగంతో ఒక వ్యవస్థలో ద్రవం లేదా వాయువు ప్రవహిస్తున్నపుడు, ద్రవాన్ని లేదా వాయువును తోడుయంత్రం /పంపు ఆగినపుడు ప్రవాహం వెనక్కి ప్రవహించడం కుండా ఈ ఏకదిశ కవా టలు నిరోధించును. పంపుల ద్వారా నదులు, కాలువల నుండి నీటిని ఒవర్ హెడ్ ట్యాంకులను నీరును తోడునపుడు, పంపు ఆగిన, ఈ ఏకదిశ కవాటం లేనిచో ఒవర్ హెడ్ ట్యాంకులోని నీరంతా మరల కిందికి వచ్చును. బావుల నుండి, కాలువల నుండి నీటిని తోడు పంపుల సక్షను పైపు కింది భాగంలో వుండు ఫూట్ వాల్వ్ కూడా ఒకరకమైన ఏకదిశ కవాటమే.

బాల్ చెక్ వాల్వు[మార్చు]

బాల్ చెక్ వాల్వు ఒక ఏకదిశ ప్రవాహ కవాటం. బాల్ చెక్ వాల్వు అతి సాదా ఆకృతి నిర్మాణం వున్న ఏకదిశ ప్రవాహ కవాటం.ఇందులో ప్రవాహాన్ని అనుమతించు, నిరోధించు కవాట తలుపు ఒక బంతి ఆకారంలో వుండటం వలన ఈ ఏకదిశ ప్రవాహ కవాటాన్ని బాల్ చెక్ వాల్వు అంటారు.తెలుగులో అయినచో కందుక ఏకదిశ ప్రవాహ కవాటం అనవచ్చును. ఈ రకపు కవాటాన్ని క్షితిజసమాంతర స్థితిలో, క్షితిజలంబ స్థితిలో కూడా ఉపయోగించ వచ్చును.అయితే క్షితిజసమాంతర, క్షితిజలంబ కవాటాల్లో నిర్మాణ పరంగా మౌలికమైన మార్పులు ఉన్నాయి. ప్రవాహాన్ని నిరోధించు లేదా అనుమతించు బాల్ బాడిలో స్వేచ్ఛగా వుండ వచ్చు, లేదా ఒక స్ప్రింగు వలన కవాట రంద్రాన్ని/ప్రవేశ మార్గాన్ని/వాకిలిని మూసి ఉంచును.

బాల్ చెక్ వాల్వు నిర్మాణం[మార్చు]

బాల వాల్వులోని భాగాలు

  • 1.బాడీ
  • 2.బాల్
  • 3.స్ప్రింగు

బాడీ[మార్చు]

ఇది సాధారణంగా కాస్ట్ స్టీలు లేదా కాస్ట్ ఐరన్ తో చెయ్యబడి వుండును. క్షితిజసమాంతర వాల్వు అయినచో కవాటం మద్య భాగం కొద్దిగా ఉబ్బుగా గోళాకారంగా వుండును.ఈ గోళాకార భాగం ముందు భాగంలో కవాట రంధ్రంవుండును. క్షితిజలంబ కవాటం అయినా y ఆకారంలో లేదా మాములుగా గొట్టం ఆకారంలో వుంది స్ప్రింగు వుండ వచ్చును.గోళాకారంగా వున్న బాడీ మధ్యభాగం పై భాగాన ఒక కవరు/మూత బోల్టుల ద్వారా బిగించబడి వుండును.కవరు విప్పి బాల్ ను తనిఖి చెయ్యవచ్చు. బాడీ చివరలందు ఫ్లాంజిలు వుండును లేదా లోపలి వైపు మరలు వుండి ప్రవాహ పైపుకు బిగించెదరు.

బాల్/బంతి/కందుకం[మార్చు]

ఇది గోళాకారంగావున్న లోహబంతి.బంతి యొక్క ఉపరితలం మీద నునుపైన ప్లాస్టికు లేదా టేఫ్లాను పొర /పూత వుండును.బంతి యొక్క వ్యాసం కవాటం యొక్క ప్రవాహ నాళం/బెజ్జం/వాకిలి కన్న ఎక్కువగా ఉండును.పంపు/తోడు యంత్రం యొక్క సామర్ధ్యం తక్కువ ఉన్నచో తక్కువ బరువు వున్న లోహంతో బాల్ చేస్తారు.

స్ప్రింగు[మార్చు]

ఇది స్థితిస్థాపకత గుణం కల్గిన స్టెయిన్‌లెస్ స్టీలు కడ్డితో చెయ్యబడి వుండును.అయితే అన్ని బాల్ చెక్ వాల్వులు స్ప్రింగుకల్గి వుండవు.కొన్ని రకాల వాల్వులలో మాత్రమే వుండును.

కవాటం పని చేయు విధానం[మార్చు]

పైపులో ప్రవాహం లేన్నప్పుడు కవాటంలోని బాల్ కవాట రంధ్రం/ప్రవేశ మార్గాన్ని మూసివుంచును. వాల్వులోకి ప్రవాహం మొదలవ్వగానే ప్రవాహం కలుగచేయు వత్తిడికి బాల్ వెనక్కి పైభాగాన వున్న కవరు/మూత వైపుకు నెట్టబడి కవాట ప్రవాహమార్గం తెరచుకుని ప్రవాహ ప్రసరణ జరుగును. ప్రవాహ వత్తిడికి బాల్ ప్రవాహం ఉపరితలంలో తేలుతూ వుండును. ప్రవాహం ఆగిపోగానే, బాల్ మీద అప్పటివరకు ఉన్న వత్తిడి సున్నా స్థాయికి పడిపోవడంతో బాల్ కిందికి దిగి, కవాట ప్రవాహ రంధ్రాన్ని మూసి వేయును.అదే సమయంలో వెనక్కి మళ్ళిన ప్రవాహం బాల్ మీద వ్యతిరేక దిశలో వత్తిడి కల్గచేయడం వలన బాల మరింత గట్టిగా కవాట మార్గాన్నీ మూసి వుంచడం వలన, ప్రవాహం వెనక్కి వెళ్ళదు.

కవాటం సైజు[మార్చు]

25 మి.మీ (1") నుండి 350 (16") మిల్లీ మీటర్లవరకు ఉండును[3]

ఉపయోగాలు[మార్చు]

1. బాల్ చెక్ వాల్వులను ఎక్కువగా పంపింగు స్టేషనులలో ఉపయోగిస్తారు[4]. 2.రసాయన పరిశ్రమలలో, బ్లీచ్ ప్లాంట్లలో, ఆక్వేరీయంలలో, గనులలో, వాటరు ట్రీట్‌మెంట్ ప్లాంట్లలో, ఈత కొలనులలో, పవరు ప్లాంట్లలలో ఉపయోగిస్తారు[5]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

ఆధారాలు/మూలాలు[మార్చు]