ప్లగ్ వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ప్లగ్ వాల్వు
కందెనవేయు సదుపాయం వున్న స్తూపకర ప్లగ్ వున్నవాల్వు
చతుర్మార్గ (ఫోర్ పొర్ట్) వాల్వు

ప్లగ్ వాల్వు అనేది ఒక కవాటం. ఒక పైపు/గొట్టంలో ప్రవహించు ద్రవం లేదా వాయువు ప్రవాహాన్ని పూర్తిగా నిలువరించు, లేదా ప్రవాహాన్ని పాక్షికంగా నిలువరించు పరికరాన్ని కవాటం అంటారు.కవాటాన్ని ఆంగ్లంలో వాల్వు (valve) అంటారు[1]. వాల్వులను అవి పనిచేయు విధానపరంగా, నిర్మాణ పరంగా గ్లోబ్ వాల్వు, గేట్ వాల్వు, బాల్ వాల్వు, చెక్ వాల్వులు అని పలురకాలుగా వర్గీకరించారు. ప్లగ్ వాల్వు కూడాఅటువంటి ఒక నియంత్రణ కవాటం.వాల్వు పనిచేయు విధానం, బాల్ వాల్వులా వుండును. వాల్వు యొక్క ప్లగ్ పిడి/హ్యాండిల్ ను కేవలం 90°డిగ్రీల కోణంలో తిప్పిన వాల్వు పూర్తిగా తెరచుకొనును.తిరిగి 90°డిగ్రీల కోణంలో వెనక్కి తిప్పిన పూర్తిగా మూసుకొనును. 360° డిగ్రీల వృత్త కోణంలో 90°డిగ్రీలు పావు వంతుకు సమానం కావున, బాల్ వాల్వు, ప్లగ్ వాల్వు, బటరుఫ్లై వాల్వులను క్వార్టరు టర్ను ఓపన్ వాల్వు అంటారు.అనగా పావువంతు తిప్పిన తెరచుకొను వాల్వు[2].

ప్లగ్ వాల్వులు బాల్ వాల్వుల లాగానే ఒకటి కంటే ఎక్కువ నిర్గమ మార్గాలను కల్గివుండును.వాల్వులో ఒకేమార్గంలో ప్రవేశించి.బయటకువెళ్ళు మార్గమున్న వాల్వును (అనగా వాల్వు బాడికి రెండు రంధ్రాలు వుండి అవి నేరుగా 180°డిగ్రీలకోణంగా) వుండును. ఆంగ్లంలో టూపోర్ట్ (రెండు బెజ్జాలున్న) వాల్వు అంటారు.వాల్వు రెండు చివరలు సాధారణంగా ఫ్లాంజి నిర్మాణం కల్గి వుండును.లేదా బట్ వెల్డింగ్ రకమైన అయ్యి వుండవచ్చును.లేదా మరలను కల్గి వుండును.ప్లగ్ వాల్వులో ప్రవాహాన్ని నిరోధించు లేదా పాక్షికంగా అనుమతించు వాల్వు భాగాన్ని ప్లగ్ అంటారు.ప్లగ్ స్తూపాకారంగా లేదా సీసా కార్కు బిరడా వలె శంఖాకారంగా వుండును.ఈ బిరడా వంటి నిరోధక భాగం చూచుటకు ప్లగ్ వలె వుండటం వలన ఈ వాల్వుకు ప్లగ్ వాల్వు అనే పేరు వచ్చింది[2].

ప్లగ్ వాల్వులోని భాగాలు[మార్చు]

 • 1.బాడీ
 • 2.ప్లగ్
 • 3.గ్లాండ్
 • 4.కాడ
 • 5.పిడి

బాడీ[మార్చు]

ఇది సాధారణంగా రెండు చివరలు కల్గి సరళమైన ఏకరీతి వ్యాసమున్న రంధ్రాన్ని కల్గివుండును.బాడీకి నిలువుగా ఒకరంద్రం/బెజ్జం శంకువు ఆకారంగా వుండును, అందులో ప్లగ్ నిలువుగా వుండును.ప్రవేశించుటకు ఒక మార్గం/రం ధ్రం, నిర్గ మించుటకు మరో మార్గమున్న ఈ రకపు నిర్మాణాన్ని టూపోర్ట్ వాల్వు అంటారు.అనగా రెండు బెజ్జాలున్నవాల్వు.టూపోర్ట్ వాల్వు ప్లగ్ కు ఒకే రంధ్రం దీర్ఘ ఘనాకారంలో ప్లగ్‌కు నిలువుగా వుండును.కొన్ని రకాల వాల్వులలో బాడీకి మూడు లేదా నాల్గు రంధ్రాలు వుండును.ఇలాంటి వాల్వులను త్రి పోర్ట్ వాల్వు/త్రి రంద్ర లేదా త్రిమార్గ కవాటం, ఫోర్ పోర్ట్ వాల్వు/చతుర్మార్గ కవాటం అంటారు[3].

ప్లగ్[మార్చు]

ఇది వాల్వులోని బాడీలో నిలువుగా వుండును.ఇది చూచుటకు బిరడా వలె శంకువు వలె వుండును.అనగా పైన ఎక్కువ వ్యాసం, కింద తక్కువ వ్యాసం వుండును. కొన్ని ప్లగ్‌లు స్తూపాకారంగా వుండును. సాధారణంగా ప్లగ్‌కు నిలువుగా లోపల దీర్ఘ ఘనాకారంగా బెజ్జం వుండును.ద్రవం లేదా వాయువు వాల్వులో ఒక చివర నుండి ప్రవేశించి మరో చివరనుండి నిర్గమమించు నిర్మాణమున్న ప్లగ్ కు ఒక రంద్రం మాత్రమే వుండును.అలా కాక వాల్వుకు మూడు రంధ్రాలుండి, రెండు రంధ్రాలు నిర్గమ మార్గాలుగా వున్నప్పుడు ప్లగ్‌కు ఆడ్డంగా T ఆకారంలో బెజ్జం వుండును. ప్లగ్‌ను ఒకసారి తిప్పినపుడు ఒకమార్గంలో ఒకసారి, ప్లగ్ దిశను మరోవైపు మార్చిన మరోమార్గంలో బయటికి ప్రవహించును.అనగా మొదట 90° తిప్పిన ఒకమార్గంలోను, 180° తిప్పిన మరో మార్గంలో బయటికి వెళ్ళును.

కాడ[మార్చు]

ఇది ప్లగ్‌ను తిప్పు కడ్డీ. ప్లగ్ పైభాగాన స్తూపాకరంగా వుండును. చివర నలుపలకలుగా వుండి దానికి పిడి వుండును.

కవరు/గ్లాండ్[మార్చు]

ప్లగ్, బాడీకి మధ్యనున్న ఖాళిలో వాల్వులో నుండి ప్రవహించు పదార్ధం బయటికి కారకుండా నిరోధించడానికి కవరు /గ్లాండ్ ఉంది. ప్లగ్ వాల్వులో ప్రత్యేకంగా ఇతర వాల్వుల వలె బోనెట్ వుండదు.ప్లగ్ కాడ చుట్టూ గ్లాండ్ తాడును చుట్టి, అఆది బిగుతుగా వుండుటకు ఈ కవరు/ గ్లాండ్‌ను బోల్టులతో బాడీకి బిగిస్తారు, కవరు లేదా గ్లాండ్కు సాధారణంగా రెండు బోల్టులు మాత్రమే వుండును.

పిడి[మార్చు]

పిడి అనేది కాడ పైభాగన బిగించబడి వుండును.పిడిని 90° డీగ్రీల కోణంలో తిప్పడం వలన వాల్వు తెరచుకొనును.వెనక్కి90° డిగృఇల కోణంలో తిప్పిన వాల్వు మూసుకొనును.పిడులు మూడురకాలు అవి

 • 1.లివరు రకం. ఇది Z వంపు వున్న వెడల్పుగా ఉండుఉక్కుబద్ది.బద్ది ఒకచివర నలుపలకలుగా వున్న రంధ్రం వుండును.ఇది కాడ చివరనున్న నలచదరపు దిమ్మ మీద సరిగా కూర్చును.పిడి చివర పట్తుకుని తిప్పిన ప్లగ్ సులభంగా తిరుగును.
 • 2.రెంచి రకపు పిడి:ఇది Tఆకారంలో వుండును.రెంచి పిడి రెండు చెవరలను రెండు చేతులతో పట్టుకుని తిప్పవచ్చు.
 • 3.గేరు బాక్సు వున్న పిడి:కాడకు గేరు వ్యవస్థ వుండును.గేరును చేతితో తిప్పు చక్రం వుపయోగించి లేదా మోటరు ఉపయోగించి తిప్పవచ్చును.పెద్ద పరిమాణంలో వున్న వాల్వు ప్లగ్ లను తిప్పుటకు గేరు బాక్సు ఉపయోగిస్తారు.

ప్లగ్ వాల్చు రకాలు[మార్చు]

ప్లగ్ వాల్వులో పలురకాలు ఉన్నాయి. ప్రతి రకానికి ఒక ప్రత్యేక ఉపయోగం ఉంది.అవి

కందెనయుత /లుబ్రికేటింగు ప్లగ్ వాల్వు[మార్చు]

ప్లగ్ బాహ్య ఉపరితలం, వాల్వు సిటింగుమధ్య కందెనను (లుబ్రికెంట్) ను వత్తిడితో పంపించడం వలన.ఈ కందెన వలన ప్లగ్ బాడీలో తక్కువ ఘర్షణతో తిరుగును.ప్లగ్ కాడ పై భాగాన నిలువుగా రంధ్రం వుండి లోపల మరలు వుండును. ఆ రంధ్రం నుండి ప్లగ్ యొక్క టేపరు భాగం పార్శభాగంలోవున్న నిలువు గాడులులోకి కందెన వచ్చును.పైపుల్లో ప్రవహించు ద్రవం లేదా వాయువు గునాన్ని బట్టి ఉపయోగించు కందెన మారును,, కం దెనగా గ్రీజు లేదా చిక్కదనం వున్న ఖనిజనూనె సమ్మేళాన్ని ఉపయోగిస్తారు.ప్లగ్ రంధ్రంలో కందెన వేసి పైనున్న బోల్టును బిగిస్తూ పోయిన, బోల్టు లోపలి వెళ్ళు కొలది కందన ప్లగ్ స్తూపాకారభాగం నుండి కందెన బయటికి వచ్చి ప్లగ్, బాడి సిటింగు మధ్య సన్నని పొరలా చేరి, ప్లగ్ తిరుగునపుడు తక్కువ ఘర్షణ ఏర్పడును.అందువలన ప్లగ్ మృదువుగా తిరుగును[4].

కందెన రహిత ప్లగ్ వాల్వు/నాన్ లుబ్రికేటింగు ప్లగ్ వాల్వు[మార్చు]

ఇందులో ప్లగ్ శంకువు కారంగా వుండి, వాల్వు బాడీలో, ప్లగ్ స్పర్శించు/తాకు వాల్వు సిటింగు పాలిమెరిక్పదార్ధంతో చేసిన తొడుగు/ గొట్టం (sleeve) కల్గి వుండును.ప్లగ్ నునుపైన పాలిమేరిక్ తొడుగు స్పర్శిస్తూ తిరగడం వలన తక్కువ ఘర్షణ వలన ప్లగ్ చలనం సాఫీగా వుండును.ఈ రకపు వాల్వులను గంధకం, హైడ్రోజన్ ఫ్లోరైడ్ వంటి పదార్థాల ప్రసరణకు ఉపయోగిస్తారు.అలాగే ఈ రకపు వాల్వులనిర్వహణ చాలా సులభం.అయితే ఈ కందెన రహిత వాల్వులనుతక్కువ ఉష్ణోగ్రతలో ప్రవహించు పదార్థాలప్రసరణలో మాత్రమే ఉపయోగిస్తారు[4].

కందెన రహిత ప్లగ్ వాల్వులు ప్రాథమికంగా మూడు రకాలు అవి

 • 1.లిఫ్ట్ ప్లగ్ వాల్వు
 • 2.ఎలాస్టోమెర్ స్లివ్డ్ ప్లగ్ వాల్వు
 • 3.ఫుల్లి లైన్డ్ ప్లగ్ వాల్వు

వికేంద్ర /అపకేంద్ర ప్లగ్ వాల్వు(Eccentric Plug Valve)[మార్చు]

ఈ రకపు ప్లగ్ వాల్వులో సగం ప్లగ్ మాత్రమే ఉపయోగిస్తారు.ఈ రకపు వాల్వులను మంచినీరు, కలుషిత నీరు, చిక్కని మలినాలున్న నీరు లేదా ఇతర ద్రవ పదార్థాల ప్రసరణకు వాడుదురు[4].

ఎక్సు పాండింగు ప్లగ్ వాల్వు/వ్యాకోచక ప్లగ్ వాల్వు[మార్చు]

ఈ వాల్వులో ప్లగ్ ఒకటి కన్నా ఎక్కువ భాగాలు కల్గి వుండి అవసరాకికి తగినట్లుగా ప్లగ్ యాంత్రికంగా విస్తరణ చెందటం పనిచేయును.,

వినియోగం[మార్చు]

గ్యాస్ ప్రసరణకు, ద్రవాల ప్రసరణకు కలుషిత ద్రవాల ప్రసరణకు ఉపయోగిస్తారు[5]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]