బటరు ఫ్లై వాల్వు

వికీపీడియా నుండి
(బటరుఫ్లై వాల్వు నుండి దారిమార్పు చెందింది)
Jump to navigation Jump to search
పవరు ప్లాంటులో వాడూ హైడ్రో ఎలక్ట్రిక్ పిడీ వున్న వాల్వు
పని చేయు విధానం
లివరు పిడి డూప్లెక్ష్ వాల్వు
గేర్ పిడి చక్రం వున్నకాస్ట్ ఐరంవాల్వు

బటరుఫ్లై వాల్వు అనేది ఒక కవాటం.కవాటం అనేది పైపులలో/గొట్టాలలో ప్రవహించు వాయు ద్రవ పదార్థాల ప్రవాహాన్ని పూర్తిగా నిరోధించు లేదా పూర్తిగా అనుమతించు లేదా పాక్షికంగా ప్రవహించునటుల యాంత్రికంగా నియంత్రణ చేయు పరికరం[1]. ఈవాల్వు పనిచేయు ఆధారంగా బాల్ వాల్వు, ప్లగ్ వాల్వు ల వలె పనిచేయును.

బటరుఫ్లై వాల్వు[మార్చు]

బటరుఫ్లై వాల్వు చాలా సరళమైన నిర్మాణం వున్న వాల్వు, ఉపయోగించడం చాలా తేలిక. కవాటంలో ప్రవాహాన్నిఆపు/నిరోదించు, అమతించు కవాటబిళ్ళ గుండ్రంగా వర్తులాకారముగా వుండును. ఈ గుండ్రని బిళ్ళకు మధ్య భాగంలో కాడ వుండి బాడీకి ఇరు వైపుల బయటికి చొచ్చుకుని వచ్చి వుండును.ఒకవైపు పొడవుగా వున్న కాడకు పిడి వుండును. పిడిని కుడి, ఎడమలకు తిప్పడం వలన వాల్వు పని చే యును.బటరుఫ్లై వాల్వు కూడా బాల్ వాల్వు, ప్లగ్ వాల్వుల వలె మూసివున్న వాల్వును పావు భాగం (వృత్త కోణంలో ) పిడినితిప్పిన వాల్వు తెరచుకోనును.తిరిగి పావు వంతు వెనక్కి తిప్పగానే వాల్వు పూర్తిగా మూసుకు పోవును.వృత్తంలో పావుభాగం అనగా 90° డిగ్రీలు.కావున ఈ కవాTaaన్ని తెరవడం, మూయడం చాలా వేగంగా, త్వరగా చెయ్యవచ్చును.ఈ వాల్వును కావాట బిళ్ళను 90°డిగ్రీల కోణంలో తిప్పిన పూర్తిగా మూసు కొనును లేదా తెరచుకొనును.కవాట పిడిని 0-90°డిగ్రీల మధ్య తిప్పిన పాక్షికంగా ప్రవాహాన్ని అనుమతించును.45°డిగ్రీల కోణంలో తెరచిన సగం డిస్కు తెరచుకొనును.ఇందులో ప్రవాహాన్ని నిరోధించు, నియంత్రణ చేయు కవాట బిళ్ళ వృత్తాకారంగా వుండును. బిళ్ళను తిప్పు కాడ సాధారణంగా బిళ్ళను రెండు సమభాగాలుగా (అర్ధ వృత్తం) చేస్తూ అతికింపబడి వుండును.కొన్ని రకాల వాల్వులలో వృత్త కేంద్రం నుండి కొద్ది దూరంలో పిడిని బిళ్ళకు బిగింప బడి వుండును.వృత్త కేంద్రబిందువు నుండి పిడి వున్న దూరాన్నిఅనుసరించి సింగిల్ ఆఫ్‌సెట్, డబుల్ ఆఫ్‌సెట్ వాల్వు అని పిలుస్తారు[2].

బటరుఫ్లై వాల్వు నిర్మాణం[మార్చు]

బటరుఫ్లై వాల్వు ఆకృతి, నిర్మాణం మిగతా వాల్వులకన్న చాలా సాధారణంగా, సరళమైన నిర్మాణాన్ని కలగి వుండును. ఈ వాల్వు తక్కువ స్థాలాన్ని ఆక్రమించును. వాల్వును పైపు యొక్క రెండు ఫ్లాంజిల మధ్య బిగించ వచ్చును. వాల్వుకు ప్రత్యేకంగా ఫ్లాంజిలు కాని మరలు కాని వుండవు. అయితే కొన్ని వాల్వులకు పైపు ఫ్లాంజీలనుండి బొల్టులను బిగించుటకు అనుకూలంగ బాడీ వెలుపలి ఉపరితలానికి రంధ్రాలు వుండును. మిగతా వాల్వుల కన్న తక్కువ వెడల్పు వుండును. ఒకేసైజు వున్నా ఇతర వాల్వుల కన్న బటరుఫ్లై వాల్వు తక్కువ బరువు కల్గివుండును.

కవాటంలోని భాగాలు

 • 1.బాడీ
 • 2.కవాట బిళ్ళ
 • 3.కాడ
 • 4.పిడి
 • 5.బిళ్ళ సిటింగు

బాడీ[మార్చు]

ఇది వర్తులంగా (గుండ్రంగా) కంకణం వలె వుండు లోహనిర్మాణం.కంకాణాకార ఇరు పార్శాలు నునుపుగా వుండును.లోపలి ఉపరితలం స్థితిస్థాపక గుణమున్న సింథటిక్ రబ్బరు (నియో ప్రీన్) లేదా అటువంటి పదార్థాలతో చేయ బడి వుండును. ఇది రెండు పక్కల కూడా బాడీ రంధ్రం కన్న కొద్దిగా ఎక్కువ బయటికి వుండును. వాల్వును పైపుకు బిగించినపుడు బయటికి చొచ్చుకు వున్నభాగం ప్యాకింగు గ్యాస్కేట్ లా పనిచేయును. వర్తులా కారాన్ని అర్థ వృత్తం చేస్తూ నిలువు అక్షాంశముగా పైన కింది రెండు రంధ్రాలు వుండును. పై రంధ్రంగుండా వాల్వు బిళ్ళ కాడ పైకి వచ్చును.కింది రంద్రంద్వరా కవాట బిళ్ళ యొక్క కింది బాగంలోకి ఒక చిన్న కడ్డీవుండి అది కీలులా పనిచేయును. ఈ కీలు బాడిలో కవాటబిళ్ల స్వేచ్ఛగా తిరుగునటుల చేయును.బాడీని సాధారణంగా గ్రేకాస్ట్ ఐరన్‌తో చేసిన, కొన్నిరకాల కవాటాలను స్టెయిన్‌లెస్ స్టీలు వంటి వాటితో చేస్తారు.భారీ సజు వాల్వులైనచో బాడికి బోల్టులు బిగించు ఫ్లాంజీలు వుండును.

కవాట బిళ్ళ/వాల్వు డిస్కు[మార్చు]

ఇది గుండ్రంగా వుండి, మూసివుంచిన స్థితిలో, వాల్వు బాడీలో వ్యాసంలో సరిగా సందు లేకుండా ఇమిడి పోవునటుల వుండును. దీనికి అక్షాంశముగా బిళ్ళ వెనుక పక్క పైన, కింద రెండు స్తూపాకార రంధ్రాలు వుం డును.ఈ రంధ్రాలు వున్నభాగం ఉబ్బెత్తుగా బిళ్ళ వెనుక భాగంలో వుండును.కింది రంధ్రంలో బిగించు స్తూపాకార కాడ కీలువలె పనిచేయును. ఇది వాల్వు బిళ్ళ బాడిలో స్వేచ్ఛగా గుండ్రంగా తిరుగుటకు కీలులా హకరించును. పై బొడిపెలో పొడవుగా, స్తూపాకారంగా వుండు లోహకడ్డిని బిగించేదరు. దీనిని కాడ అంటారు, కాడ స్తూపాకరంగా వుండి చివరిభాగం రెండు పక్కలు లోపలికి చదరంగా నొక్కబడి వుండును.కొన్ని రకాల వాల్వులలో కవాట బిళ్ళను రెండు సమాన అర్ధభాగాలు చేస్తూ ఏకరంధ్రం వుండును.ఈ రంధ్రం ద్వారా కాడను కింది వరకు అమర్చెదరు.ఈ రంధ్రం బిళ్ళ వృత్తాకార వెనుకభాగంలో వుండును.

సాధారణంగా కాడ కవాట బిళ్ళ మధ్య భాగం (వృత్తాకార కేంద్ర బిందువు ద్వారా) గుండా కాడ అమరి వుండును. కాని కొన్ని వాల్వులలో బిళ్ళ కేంద్రభాగంనుండి కొంచెం కిందుగా వికేంద్రంగా/అపకేంద్రితంగా కాడ బించు రంధ్రం వుండును. కేంద్రం నుండి ఈ దూరం వాల్వు బాడీ మందానికి సమానంగా వున్న సింగిల్ ఆఫ్‌సెట్ వాల్వు (single offset valve) అని, రెండు మందాల ఎడం ఉన్నచో డబుల్ ఆఫ్‌సెట్ వాల్వు అనియు మూడు మందాల ఎడం వున్న త్రిబుల్ ఆఫ్‌సెట్ వాల్వు అని అంటారు.[3]

కాడ[మార్చు]

కవాట బిళ్ళను తిప్పు భాగం.స్తూపాకారంగా వుండీ అపి భాగం పలకలుగా వుండీ దానికి పిడిని బిగించెదరు.

పిడి/హ్యాండిల్[మార్చు]

పిడి అనేది కాడ పైభాగన బిగించబడి వుండును.పిడిని 90° డీగ్రీల కోణంలో తిప్పడం వలన వాల్వు తెరచుకొనును.వెనక్కి90° డిగృఇల కోణంలో తిప్పిన వాల్వు మూసుకొనును.పిడులు మూడురకాలు అవి

 • 1.లివరు రకం. ఇది Z వంపు వున్న వెడల్పుగా ఉండుఉక్కుబద్ది.బద్ది ఒకచివర నలుపలకలుగా వున్న రంధ్రం వుండును.ఇది కాడ చివరనున్న నలచదరపు దిమ్మ మీద సరిగా కూర్చును.పిడి చివర పట్తుకుని తిప్పిన ప్లగ్ సులభంగా తిరుగును.
 • 2.రెంచి రకపు పిడి:ఇది Tఆకారంలో వుండును.రెంచి పిడి రెండు చెవరలను రెండు చేతులతో పట్టుకుని తిప్పవచ్చు.
 • 3.గేరు బాక్సు వున్న పిడి:కాడకు గేరు వ్యవస్థ వుండును.గేరును చేతితో తిప్పు చక్రం వుపయోగించి లేదా మోటరు ఉపయోగించి తిప్పవచ్చును.పెద్ద పరిమాణంలో వున్న వాల్వు ప్లగ్ లను తిప్పుటకు గేరు బాక్సు ఉపయోగిస్తారు.
 • సంకోచిత గాలి (compressed air) ని ఉపయోగించి కాడను పిప్పు వ్యవస్థ దీనిని న్యూమాటిక్ సిస్టమంటారు.

వినియోగం[మార్చు]

ఈ రకపు వాల్వులను వ్యర్థ జలాల చికిత్స ప్లాంటులలో, గ్యాసు సరాఫరా వ్యవస్థలలో, రసాయన, నూనెల పరిశ్రమలలో, అలాగే అగ్నిమాపక వ్యవస్థలో ఉపయోగిస్తారు.అలాగే ఇంధన సరాఫరా, గాలి సరాఫరా వ్యవస్థలలో కుడాబటరుఫ్లై వాల్వులను ఉపయోగిస్తారు. అలాగే మంచినీటి సరాఫరా వ్యవస్థలో కూడా ఈ రకపు వాల్వులను వాడెదరు.

బయటి లింకుల వీడియోలు[మార్చు]

ఈ వ్యాసాలు చదవండీ[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

 1. "valve". whatis.techtarget.com. Text "accessdate02-03-2018" ignored (help)
 2. "How It Works: Butterfly Valves". cameron.slb.com:80. Text "accessdate-02-03-2018" ignored (help)
 3. "What Is A Butterfly Valve?". processindustryforum.com. Retrieved 02-03-2018. Check date values in: |accessdate= (help)