సేఫ్టి వాల్వు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

సేఫ్టి వాల్వు అనగా విపత్తు లేదా ప్రమాదం నుండి తప్పించు రక్షక లేదా సురక్షక కవాటం.ఒక పాత్ర లేదా ఒక గొట్టంలో ప్రవహిస్తున్నద్రవం లేదా వాయువు, లేదా ఆవిరి నిర్దేశించిన ప్రమాణం కన్నఎక్కువ పీడన స్థాయికి చేరినపుడు, వాల్వు తెరచుకుని కొంత పరిమాణంలో ద్రవాన్ని లేదా వాయువు/ఆవిరిని బయటికి వదిలి పీడనస్థాయిని తగ్గించు పరికరం సేఫ్టి వాల్వు[1].

బాయిలరులో సేఫ్టి వాల్వు వాడకం[మార్చు]

బాయిలరులో సేఫ్టి వాల్వు వాడకం తప్పని సరి.ఒకటి కాదు రెండు సేఫ్టి వాల్వులను బాయిలరు మీద అమర్చుతారు.ఫైరు ట్యూబు బాయిలరు అయినచో ప్రధాన డ్రమ్ము లేదా సిలిండరు మీద అమర్చుతారు. వాటరు ట్యూబు బాయిలరు అయినచో స్టీము డ్రమ్ము పైన బిగిస్తారు. వాటరు ట్యూబు బాయిలరులో ఒకటి కన్న ఎక్కువ డ్రమ్ములున్నచో, స్టీము కలెక్టు/జమ అగు డ్రమ్ము మీద లేదా ఎక్కువ స్టీము ఉత్పత్తి అగు డ్రమ్ము పైన అమర్చుతారు.ప్రతి బాయిలరుకు రెండు సేఫ్టి వాల్వులు బిగించబడి వుండును.ఒక సేఫ్టి వాల్వును బాయిలరు పనిచేయు పీడనం / వర్కింగు ప్రెసరుకన్న అరకేజీ ఎక్కువ పీడనం బాయిలరులో ఏర్పడగానే తెరచు కునేలా, మరో సేఫ్టి వాల్వును పనిచేయు పీడనం /వర్కింగు ప్రెసరు కన్న ఒక కేజీ ఎక్కువ పీడనం బాయిలరులో ఏర్పడగానే తెరచుకునేలా ఏర్పాటు చెయ్యబడి వుండును. ఇలా రెండు సేఫ్టి వాల్వులు వేరు వేరు పీడనాల వద్ద తెరచు కొనునట్లు అమర్చుటకు కారణం బాయిలరు రక్షణ దృష్టి తోనే.ఏదైనా కారణంచే బాయిలరు పీడనం కన్న అరకేజీ ఎక్కువ ఉన్న సేఫ్టి వాల్వు తెరచుకోననిచొ, ఒక కేజీ ఎక్కువగా సెట్ చేసిన రెండో వాల్వు తెరచు కొనును.

బాయిలరు నందు ఉపయోగించు సేఫ్టి వాల్వులు[మార్చు]

డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు

అవి.1.డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు,2.లివరు సేఫ్టి వాల్వు,3.స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు,4. హై ప్రెసరు- లోవాటరు సేఫ్టి వాల్వు.

డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు[మార్చు]

డెడ్ వెయిట్ సేఫ్టి వాల్వు ఇళ్ళల్లో వాడు ప్రెసరు కుక్కరు ల లిడ్/మూత మీద వున్న సేఫ్టి వాల్వు వంటిదే.కుక్కరు మీద సేఫ్టి వాల్వు చిన్నదిగా వుండును.బాయిలరులో వాడు సేఫ్టి వాల్వు పరిమాణంలో పెద్దదిగా వుండును. స్థిరమైన బరువువున్న వర్తులాకార పోతయినుము బిళ్ళలను వాల్వుమీద ఉంచేదరు. ఈ డెడ్ వెయిట్/బరువు, వాల్వుమీద కింది వైపుకు బలంగా నొక్కి వంచును అనగా అధో పీడనం కలుగ చేయును. దీనిని అధోపీడన బలం అంటారు.అదేసమయంలో బాయిలరు నుండి స్టీము వాల్వు కింది నుండి పై వైపుకు బలంగా వాల్వును పైకి నెట్టే ప్రయత్నం చేస్తుంది.దానిని ఉర్ధ్య పీడనం లేదా ఉర్ధ్యబలశక్తి అంటారు. బాయిలరులో ఏర్పడిన స్టీము పీడనంకన్న సేఫ్టి వాల్వు మీది బరువు కల్గుచేయు బలశక్తి/పీడన శక్తి ఎక్కువగా లేదా సమానంగా ఉన్నంత వరకు వాల్వు తెరచు కొనదు. ఎప్పుడైతే బాయిలరు స్టీము కల్గుచేయు ఉర్ధ్య పీడనం వాల్వు కలుగచేయు పీడనాన్ని మించుతుందో అప్పుడు వాల్వు తెరచుకుని అధిక పీడనం కారణమైన స్టీము బయటికి వెళ్ళును. అధిక పీడనం తగ్గిన వెంటనే, రెండింటి పీడనం సమాన మవ్వగానే వాల్వు యధావిధిగా మూసుకొ నును.ఈ రకపు సేఫ్టి వాల్వులు లోకోమోటివ్ బాయిలరు, మెరీన్ బాయిలరులలో వాడుటకు పనికి రావు. ఈ రకపు బాయిలరులు చలనంలో వున్నప్పుడు అటునిటు కదలడం వలన సేఫ్టి వాల్వు మీది స్టిర బరువు పక్కకు జరిగి పోవును.అందువలన ఇటువంటి సేఫ్టి వాల్వులు నేల మీద స్థిరంగా వుండులాంకషైర్ బాయిలరు లకు సరిపడును[2].

లివరు సేఫ్టి వాల్వు[మార్చు]

లివరు సేఫ్టి వాల్వు

లివరు సేఫ్టి వాల్వులో ఒక పోత ఇనుముతో చేసిన కేసింగు ఉండును.దాని నిలువు రంద్రం స్టీము బయటకు వచ్చు మార్గంగా పనిచేయును.ఈ కేసింగు ఆడుగు భాగాన్ని బోల్టుల ద్వారా బాయిలరు షెల్ పై భాగాన బిగించె దరు.కేసింగు నిలువు రంద్రం/నాజిల్ పైన వాల్వు సిటింగు రింగు వుండును.ఇది ఇత్తడితో చెయ్యబడి వుండును.దీని మీద కరెక్టుగా వాల్వు డిస్క్ లేదా వాల్వు వుండును.వాల్వు వెనుక భాగం ఒక లివరుకు బిగించబడి వుండును. లివరు ఒక చివర లివరుకు బిగించిన వాల్వు డిస్కు, వాల్వు సిటింగు మీద ఖాళి లేకుండా అతుక్కుని ఉండేలా బలాన్ని కలుగ చేయును.లివరు రెండో చివర కేసింగుకు ఒక కీలుతిరిగెడు చీల (pivot) ద్వారా అనుసంధానమై వుండును. లివరు పక్కకు జరుగకుండా ఒక లివరు గైడు రాడ్/కడ్డి వుండును.లివరు చివర వున్న బరువును ముందుకు, వెనక్కి జరపడం ద్వారా వాల్వు మీద బలప్రభావాన్ని పెంచ వచ్చు, తగ్గించ వచ్చు.లివరు బరువు వలన వాల్వు మీద అదో పీడనాన్ని కల్గించడం వలన సిటింగుమీద వాల్వుడిస్కు బలంగా అతుక్కుని ఉండును. బాయిలరులోని స్టీము, లివరు బరువుకన్న ఎక్కువ పీడనబలాన్ని కల్గి నపుడు లివరును వాల్వును పైకి లేపడం వలన అధికంగా వున్న స్టీము బయటకు వెళ్ళును[3].

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు[మార్చు]

ఇందులో వాల్వు డిస్కును నొక్కి వుంచుటకు స్ప్రింగును ఉపయోగించదం వలన దీనిని స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు అంతారు[4] ప్రధాన వ్యాసం :స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వు చదవండి

స్ప్రింగు లోడెడ్ సేఫ్టి వాల్వులో మరొక రకమైన రామ్స్ బాటమ్ (Ramsbottom) సేఫ్టి వాల్వులో రెండు వాల్వులు ఒక స్ప్రింగు వుండును. ఈ రకపు సేఫ్టి వాల్వును లోకోమోటివ్ బాయిలరులలో ఉపయోగిస్తారు.

ఎక్కువ పీడన స్టీము, తక్కువ నీటి మట్టం సేఫ్టి వాల్వు[మార్చు]

ఎక్కువ పీడన స్టీము, తక్కువ నీటి మట్టం సేఫ్టి వాల్వు

ఈ రకపు సేఫ్టి వాల్వు రెండు రకాల పనులు చేయును.ఒకటి స్టీము పీడనం బాయిలరు పనిచేయు పీడనం కన్న ఎక్కువ పీడనంతో స్టీము బాయిలరులో ఉత్పత్తి అయిన ప్రధాన వాల్వును తెరచి స్టీమును బయటకు వదులును. ఇందులో ఒకలివరు వుండి ఆలివరు ఒక చివర నీటిలో తేలు ఫ్లోట్ మరో చివర ఫ్లోట్ బరువును సమతుల్యం చేయు బరువు వుండును.బాయిలరులో నీటి మట్టం తగ్గిన ఫ్లోట్ కిందికి దిగటం వలన లివరుకు మధ్యలో వున్న ముందుకు చొచ్చుకు వచ్చిన బొడిపె వంటిది ప్రధాన వాల్వులోపల అమర్చిన అర్ధ గోళాకారపు మరో వాల్వును పైకి తెరచి పెద్ద శబ్దంతో స్టీమును బయటకు పంపును.ఈ శబ్దం విని బాయిలరు ఆపరేటరు జాగ్రత్త పడి తగు జాగ్రత్తలు తీసుకుంటాడు[5]. ఈ రకపు సేఫ్టి వాల్వును అంతర్గత ఫర్నేసు/కొలిమి బాయిలరులలో ఉపయోగిస్తారు.ఉదాహరణ: లాంకషైర్, కోర్నిష్ బాయిలరులలో ఉపయోగించుటకు అనుకూలం.

ఈవ్యాసాలు కూడా చదవండి[మార్చు]

బయటి లింకుల వీడియోలు[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]