బాయిలరుల వర్గీకరణ

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
టైటానిక్ షిప్పులో అమర్చాటనికి సిద్ధంగా బాయిలర్లు
"O "రకపు వాతరు ట్యూబు బాయిలరు
క్షితిజ సమాంతర ఫైరు ట్యూబు బాయిలరు
వెర్టికల్ ఫైరు ట్యూబు బాయిలరు
పోర్టబుల్ బాయిలరులు/ సులభంగా తీసుకపోదగ్గబాయిలరు
లోకోమోటివ్ బాయిలరు
అంతర్గత ఫర్నేసు ఉన్న స్కాచ్ మెరీన్ బాయిలరు

బాయిలరు అనునది పీడనం కల్గిన నీటి ఆవిరిని ఉత్పతి చేయు లేదా వేడి నీటిని లేదా ద్రవాన్ని అధిక ఉష్ణోగ్రత వరకు వేడి చేయు లోహనిర్మాణం.సాధారణంగా యంత్ర శాస్త్ర పరిభాష ప్రకారం బాయిలరు అనగా అన్ని వైపులా మూసి వుండి, అధిక పీడనం వద్దఅధిక ఉష్ణోగ్రత వద్ద నీటి ఆవిరిని ఉత్పత్తి చెయ్యు లోహ నిర్మాణం.ఈ లోహ నిర్మాణం ఫీడ్ వాటరు వ్యవస్థ, స్టీము వ్యవస్థ, ఇంధన వ్యవస్థలను కల్గి ఉండటంతో పాటు అదనంగా నిర్వహణ, బాయిలరు రక్షణ ఉపకరణాలను కల్గి ఉండును[1].

బాయిలరులు పలు రకాలుగా, లభిస్తున్నవి.వాటిని వాటి నిర్మాణంలో తేడాల వలన, లేదా వాడే ఇంధన పరంగా లేదా స్థితి పరంగా లేదా వాటిని రూపకల్పన చేసి తయారుచేసిన సంస్థల ఆధారంగా బాయిలరును పలు రకాలుగా, తరగతులుగా వర్గీకరణ చేసారు[2].

బాయిలరులో నీరు, ఫ్లూ వాయువుల ఆధారంగా వర్గీకరణ[మార్చు]

వాటరు ట్యూబు బాయిలరు[మార్చు]

ఈ రకపు బాయిలరులో నీరు లోపలి స్టీలు ట్యూబుల్లో వుండి, ఇంధన దహనం వలన ఏర్పడు వేడివాయువులు నీటి పైపుల బయటి ఉపరితలాన్ని తాకుతూ పయనించి ట్యూబుల్లోని నీటిని వేడి చేయును[3].కొన్ని రకాల వాటరు ట్యూబు బాయిలరులు:బాబ్‌కాక్ ఆండ్ విల్‌కాక్సు బాయిలరు ‎, స్టెర్లింగు బాయిలరు, బెన్సన్ బాయిలరులు, త్రి డ్రమ్ము బాయిలరు, డీ రూపం బాయిలరు, ఒ-రకం బాయిలరు

ఫైరు ట్యూబు బాయిలరు[మార్చు]

ఈ ఫైరుట్యూబు బాయిలరులో ఇంధనం దహనం వలన ఏర్పడిన వేడి వాయువులు ట్యూబుల గుండా పయనిస్తూ, ట్యూబుల వెలుపల, షెల్ లోపల వున్న నీటిని వేడిచేయును[4]. కొన్ని ఫైరు ట్యూబు బాయిలరులు: లాంకషైర్, కొక్రేన్ బాయిలరు, కోర్నిష్ బాయిలరు, లోకోమోటివ్ బాయిలరులు

బాయిలరు నీటి సర్కులేసన్/ప్రసరణ విధానం ప్రకారం[మార్చు]

సహజ ప్రసరణ(natural circulation)[మార్చు]

బాయిలరు లోవుండు వేడినీరు, ఫీడ్ వాటరు ఉష్ణోగ్రత వలన కల్గు సాంద్రత వ్యత్యాసం వలన బాయిలరు నీటిలో కల్గు ప్రసరణ.అనగా బాయిలరులో వేడి నిరు ఆపి వైపు పయనించగా, తక్కువ ఉష్ణోగ్రత ఉన్న నీరు ట్యూబుల వైపు పయనించును.ఉదా: బాబ్ కాక్ అండ్ విల్ కాక్ష్, లాంకషైర్, కొక్రేన్, లోకోమోటివ్ బాయిలరులు

ఫోర్సుడ్ సర్కులేసన్ బాయిలరు[మార్చు]

ఈ రకం బాయిలరులో ప్రత్యేకంగా ఒక పంపును అమర్చి దాని ద్వారా బాయిలరులోని నీటిని సర్కేలేట్ చేస్తారు.ఉదా: బెన్సన్, లామోంట్ బాయిలరు, వెలొక్ష్ బాయిలరులు

బాయిలరు వినియోగ స్థితిఆధారంగా[మార్చు]

స్థిర బాయిలరులు:[మార్చు]

ఇవి నేల మిద శాశ్వితం అమర్చినబాయిలరు.పరిశ్రమలలో అమర్చు అన్ని బాయిలరులు స్థిర బాయిలరులే.

పోర్టబుల్ బాయిలరులు/ సులభంగా తీసుకపోదగ్గబాయిలరులు[మార్చు]

ఈ బాయిలరులు కొద్దిగా చిన్న పరిమాణంలో వుండి, చక్రాలను కల్గి వుండును.వీటిని ఇతర వాహనాల సహాయంతో ఒకచోటు నుండి మరో చోటుకు తరలించవచ్చును.

లోకోమోటివ్ బాయిలరులు[మార్చు]

ఈ బాయిలరులు స్టీము ఇంజన్ సహాయంన ఒకచోటు నుండి మరోచోటుకు పయనించును. డిజెల్, ఎలక్ట్రిసిటి ఇంజనులు వాడకంలో లేనప్పుడు ఈ లోకోమోటివ్ బాయిలరులే ప్రయాణికుల, సరికు రవాణా రైలుబండ్లను లాగుటకు ఈ లోకోమోటివ్ బాయిలరులేనే వాడేవారు. అంతేకాదు రోడ్ల మీడ కూడా నడిపేవారు.డిజెల్, ఎలక్ట్రిసిటి ఇంజనులు వాడకం లోకివచ్చాక లోకోమోటివ్ బాయిలరులను రైలు ఇంజనుగా వాడటం మానేశారు.అక్కడక్కడ అరకొరగాఒకటి రెండు బాయిలరులు.పర్వత ప్రాంతాల్లో పనిచేస్తుండవచ్చు. పాత లోకోమోటివ్ బాయిలరులను చాలా పరిశ్రమల్లో ఫైరు ట్యూబు బాయిలరులుగా స్టీము తయారికి వాడేవారు[5].

మెరీన్ బాయిలర్లు[మార్చు]

ఇవి ఫైరు ట్యూబు బాయిలరు రకానికి చెందిన బాయిలరులు, వీటిని నౌకల్లో వాడటం రివాజు. ఇవి నిలువు స్తూపాకార షెల్ లేదా క్షితిజ సమాంతర షెల్ కల్గి వుండును.ఉదాహరణ:స్కాచ్ మెరీన్ బాయిలరు, కొక్రేన్ బాయిలరు

బాయిలరు బయటి షెల్ స్థానము ఆధారంగా[మార్చు]

వీటీని మూడూ రకాలుగా వర్గీకరించారు

  • భూసమాంతర బాయిలరులు,
  • నిలువు బాయిలర్లు,
  • ఏటవాలు బాయిలర్లు

బాయిలరు ఫర్నేసు ఆధారంగా[మార్చు]

బాయిలరుకు ఫర్నెసు అమరి వున్న విధానాన్ని ఆధారంగా కూడా బాయిలరులను వర్గీకరణ చేసారు.

అంతర్గత ఫర్నేసు బాయిలరు[మార్చు]

ఈ బాయిలరు షెల్ లేదా డ్రమ్ము లోపలనే ఫర్నేసు కల్గివున్న బాయిలరులు.ఈ రకపు బాయిలరులో ప్రధాన సిలిండరికల్ /స్తూపాకార నిర్మాణంలోనే ఇంధనాన్ని మండించు ఫైరుబాక్సు ఉండును.

బాహ్య ఫర్నేసు బాయిలర్లు[మార్చు]

ఈ రకపు బాయిలరులలో ఫర్నేసు బాయిలరు షెల్ ముందు భాగంలో ప్రత్యేకంగా రిఫ్రాక్టరి ఇటుకలతో నిర్మించివుండును.ఎక్కువ ఘనపరిమాణంలో ఎక్కువ పీడనం/వత్తిడి స్టీము ఉత్పత్తి చెయ్యు బాయిలర్లు షెల్ వెలుపలి భాగంలో ఫర్నేసు కల్గి వుండును

ఉత్పత్తి చెయ్యు స్టీము పీడనం ఆధారంగా[మార్చు]

తక్కువ పీడన బాయిలరు:[మార్చు]

15-20 Kg/cm2 (బార్) మధ్య స్టీమును ఉత్పత్తి చెయ్యు బాయిలరును తక్కువ పీడన బాయిలర్లు అంటారు.ఈ బాయిలరుల స్టీమును ఇతర పదార్థాలను హీట్ ఎక్చెంజరులద్వారా వేడి చెయ్యుటకు ఉపయోగిస్తారు. అలాగే ఆయిల్ ఫ్యాక్టరిలలో, రిఫైనరీలలో స్టీము ఎజెక్టరులను ఉపయోగించి వాక్యూం సృష్టించాటానికి ఉపయోగిస్తారు.

మధ్య స్థాయి పీడన బాయిలర్లు[మార్చు]

ఈ రకపు బాయిలర్లు 20 నుండి 80Kg/cm2 (బార్) వరకు పీడనం వున్న స్టీమును ఉత్పత్తి చెయ్యును.ఈ రకపు బాయిలరులను విద్యుత్తు ఉత్పత్తి, ప్రాసెసింగు పరిశ్రమలలో ఉపయోగిస్తారు.

అధిక పీడన బాయిలరులు[మార్చు]

ఇవి 80Kg/cm2కు మించి పీడనమున్న స్టీమును ఉత్పత్తి కావించు బాయిలర్లు. ఇవి తిరిగి రెండు రకాలు.అవిఉప క్రిటికల్ బాయిలరు, సూపరు క్రిటికల్ బాయిలరు.

ఉప క్రిటికల్ బాయిలరు[మార్చు]

ఈ రకపు బాయిలరులో క్రిటికల్ ప్రెసరు కొద్దిగా తక్కువ స్థాయి పీడనంతో స్టీము ఉత్పత్తి కావించు బాయిలర్లు.

సూపరు క్రిటికల్/ సందిగ్ధ బాయిలర్లు[మార్చు]

ఈ రకపు బాయిలర్లులలో స్టీము క్రిటికల్ ఉష్ణోగ్రత దాటిన పీడనంతో స్టీము ఉత్పత్తి చేస్తారు

ఇంధన ఆధారంగా బాయిలరు వర్గీకరణ[మార్చు]

బాయిలరులో మండించు ఇంధనం ఆధారంగా బాయిలరును మూడు రకాలుగా వర్గీకరించారు, అవి వాయు ఇంధన బాయిలరు, ద్రవ ఇంధన బాయిలరు, ఘన ఇంధనబాయిలర్లు.అలాగే శిలాజ ఇంధన బాయిలరులు, జీవద్రవ్య ఇంధనాలువాడే బాయిలర్లు అనికూడా వర్గికరణ చేసారు. ఘన ఇంధనం వాడు బాయిలరులను స్థిరమైన గ్రేట్ బాయిలరులు.కదిలే చైన్ గ్రేట్ వున్న బాయిలరులు, పల్వరైజ్డ్ ఫ్యూయల్ బాయిలరులు, ఎఫ్.బి.సి బాయిలరులు, సి.ఎఫ్.బి.సి బాయిలరులు

ఇంధనంఅందించు విధానం ఆధారంగా బాయిలరు వర్గీకరణ[మార్చు]

ఇవికూడా చదవండి[మార్చు]

మూలాలు ఆధారాలు[మార్చు]

  1. "What is a Boiler: Introduction to Boilers". forbesmarshall.com. Retrieved 14-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "oilers: Introduction and Classification". me-mechanicalengineering.com. Retrieved 14-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "Water Tube Boiler". electrical4u.com. Retrieved 14-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  4. "Fire Tube Boiler". electrical4u.com. Retrieved 14-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help); Text "Operation and Types of Fire Tube Boiler" ignored (help)
  5. "Locomotive Boiler". mechanicalbooster.com. Retrieved 14-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)