బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు
గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు
లాంక షైర్ బాయిలరుకు ముందుభాగాన అమర్చినబాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరులు
బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు

బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు అను ఉపకరణం బాయిలరులో వున్న నీటి మట్టాన్ని తెలుపుతుంది.గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు బాయిలరు లోని నీటిమట్టాన్ని నేరుగా కచ్చితంగా చూపును.గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు బాయిలరు మీద అమర్చబడి వుండు ముఖ్యమైన ఉపకరణం. గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరును బాయిలరు వాటరు గేజ్ అనికూడా అంటారు[1].

బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు ఆవశ్యకత[మార్చు]

బాయిలరు పనిచేయునప్పుడు, బాయిలరులోని నీరు ఆవిరిగా మారడం వలన నీటిమట్టం క్రమంగా తగ్గుతుంది.బాయిలరులోని నీటిమట్టం బాయిలరు లోపలి బాయిలరు గొట్టాల కన్నతక్కువ మట్టానికి పడిపోయిన, ఫ్లూగ్యాసేస్ ఉష్ణోగ్రతకు బాయిలరు ట్యూబులు అమితంగా వేడెక్కి పేలి పోవును.అందువలన ఆవిరిగా మారుతున్న నీటి ప్రమాణానికి సరి పడా నీ టిని బాయిలరులోనికి ఎప్పడికప్పుడు పంపు ద్వారా పంపించ వలసి వున్నది.బాయిలరు డ్రమ్ములో నీటి మట్టం బాయిలరు లోణి హీటింగు ట్యూబుల బండిల్ మట్టాన్నిదాటి,షెల్ లో దాదాపు గరిష్టంగా మూడు వంతులు ఉండును.పంపు ద్వారా నీటిని ఎప్పటి కప్పుడు లోనికి మూడు వంతులు ఉండేలా నింపుటకు లోపల ఎంతవరకు నీరు వున్నది తెలియాలంటే బాయిలరు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు ఉపకరిస్తుంది.ఈ వాటరు లెవల్ ఇండికేటరులో వున్న గ్యాసు గొట్టం వలన బాయిలరు లోని నీటి మట్టం క చ్చితంగా తెలుస్తుంది.

గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరులోని భాగాలు[మార్చు]

  • గ్లాసు ట్యూబు:ఇది సాధారణంగా 1/2" లేదా 3/4"సైజులో వుండును.10.5నుండి 24.7 కేజిల పిడనాన్ని, 220°Cనుండి400°C ఉష్ణోగ్రత తట్టుకో గల్లును.పొడవు బాయిలరును బట్టీ 400-500 మిల్లి.మీటర్లు వుండును.గ్లాసు బోరోసిలికెట్ తో చెయ్యబడి దృఢంగా వుండును.
  • కాక్ లు(Cocks)+ఇవి సాధారణంగా ఇత్తడి లేదా కంచుతో చేసినవి.
  • గ్లాసు ట్యూబు రక్షక గాజు పలకల స్టీలు ఫ్రేము

గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరు అమరిక[మార్చు]

గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరులో మందమైన గాజు గొట్టం, మూడు కాక్ /వాల్వులు వుండును.అందులోఒకటి స్టీము కాక్, రెండవది వాటరు కాక్, మూడవది డ్రైన్ కాక్.గాజు గొట్టం అధిక వేడిని, స్టీము పీడనాన్ని తట్టుకునే దృడత్వము కల్గి వుండును.స్టీము కాక్ బాయిలరు లోని స్టీము బాగంకు అతికించబడి వున్న పైపు ఫ్లాంజికి బిగించబడి వుండును. ఈ స్టీము కాక్ తో ఇండికేటరుపరికరానికి స్టీమును వచ్చేలా, ఆగేలా చెయ్య వచ్చును. స్టీము కాక్ గ్లాసు ట్యూబుకు పైభాగాన అమర్చబడి వుండును. అలాగే వాటరు కాక్ బాయిలరులో నీరు వుండే బాగానికి అతుకబడి/వెల్డ్ చెయ్యబడిన ఒక పైపు ఫ్లాంజికి బిగించబడి వుండును.ఈవాటరు కాక్‌ని తెరచిన బాయిలరు నీరు ట్యూబులోకి వచ్చును, కాక్ మూసిన నీరు ఆగిపోవును. ఇక మూడో కాక్ డ్రైన్ కాక్.ఇది గ్లాసు గొట్టం లోని నీటిని బయటకు వదులు టకు ఉపయోగ పడును. పరికరం యొక్క గ్లాసు ట్యూబు చుట్టూ రక్షణగా ఒక లోహనిర్మిత చట్రం వుండి దానికి మందమైన గాజు పలకలు అమర్చబడివుండును.[2] బాయిలరు నుండి స్టీము వున్న చోటునుండి, నీరు వున్న చోటు నుండి రెండు మందమైన ఉక్కు పైపులు భూసమాంతరంగా వుండి చివర్లో ఫ్లాంజి కల్గి వుండును.ఈ రెండు పైపులకు రెండు స్టీము వాల్వులు వుండును.ఏదైనా అవసరం వుండి,లేదా గ్లాసు ట్యూబు పాడైన మార్చుటకు/లేదా గ్యాస్కేట్ పాడైన మార్చుటకు ఈ వాల్వులు ఉపయోగ పడును.వాటరు లెవల్ ఇండికేటరును ఈ reMDu వాల్వులను మూసి వేసి, ఈ ప్ల్లాంజిలకు లెవల్ ఇండికేటరును అమర్చెదరు. అమర్చిన తరువాత వాల్వులు తెరచెదరు. లెవల్ ఇండికేటరు గ్లాసు పొడవుకు అనుగుణ్యంగా స్టీము, వాటరు పైపులు బాయిలరుకు ఆతుకబడి వుండును.[3]

గ్యాసు ట్యూబు పగిలినపుడు ప్రమాద నివారణ ఏర్పాటు[మార్చు]

బాయిలరు నుండి వాటరు కాక్, స్టీము కాక్‌కు కలిపిన రెండు పైపులలో,ఐసోలేట్ స్టీము వాల్వుల తరువాత రెండు స్టీల్ బంతులు(ball) వుండును. ఏదైనా కారణం వలన గ్లాసు ట్యూబు పగిలిన బాయిలరు నుండి వేగంగా వచ్చు స్టీము, నీరు ఈ స్టీల్ బంతులను ముందుకు నెట్టడం వలన అవి వెళ్ళి వాటరు లెవల్ ఇండికేటరుయొక్క వాటరు, స్టీము కాక్‌కు అడ్డుపడటం వలన స్టీము,నీరు బయటికి వెళ్ళకుండా ఆగిపోవును.

ఉపయోగించు విధానం/పని చెయ్యు విధానం[మార్చు]

బాయిలరుకు సాధారణంగా రెండు గ్లాసు ట్యూబు వాటరు లెవల్ ఇండికేటరులను కొద్ది దూరంలో అమర్చెదరు. రెండు వాటరు లెవల్ ఇండికేటరులలోని గ్యాసు ట్యూబుల్లో నీటిమట్టం సమానంగా వుండాలి, లేనిచో అందులో ఒక ఇండికేటరు తప్పుడు మట్టాన్ని చూపిస్తునదని అర్థం. అందువలన రెండు వాటరు లెవల్ ఇండికేటరులలో నీటిమట్టం సమానంగా లేక తేడా చూపిన వాటరు లెవల్ ఇండికేటరుల డ్రైను వాల్వును తెరచి కొంత నీటిని డ్రైన్ చేసి చెక్ చెయ్యాలి .అలాగే ఈ ఇండికేటరు గ్యాసు గొట్టం మీద మూడు గుర్తులు /మార్కింగులు వుండును. అన్నింటి కన్న పైనున్న మార్కింగు బాయిలరులోని గరిష్ట నీటిమట్టాన్ని తెలుపును. పంపు రన్నింగులో వున్నప్పుడు, ఈ మట్టానికి నీరు చేరిన వెంటనే పంపును ఆపి వెయ్యాలి. మోబ్రే అను ఒక ఉపకరణం అమర్చిన బాయిలరులో నీరు3/4 వంతుకు రాగానే పంపు అటో మాటిక్‌గా ఆగి పోవును.గరిష్ట మట్టానికి కింద మద్యలో వున్న మార్కింగు లెవల్‌కు నీరు వచ్చిన బాయిలరు ఫీడ్ పంపును ఆన్ చెయ్యాలి. మోబ్రే అను ఒక ఉపకరణం అమర్చిన బాయిలరులో నీరుమధ్య మార్కింగు వద్ద కు రాగానే పంపు అటో మాటిక్‌గా ఆన్ అగును. గ్లాసు ట్యూబులోని నీటిమట్టం కింద నున్న మూడవ మార్కింగుకు చేరిన బాయిలరులో నీటిమట్టం ప్రమాద స్థాయికి దగ్గరలో వున్నదని సూచన. ఈసమయంలో బాయిలరుకు ఇంధనం అందించుట వెంటనే ఆపి వెయ్యాలి.అలాగే స్టీము వాలువు కట్టి వెయ్యాలి,I.D, F.Dఫ్యానులను ఆపాలి. మోభ్రే అమర్చిన వున్న బాయిలరులో ఈ లెవల్ కు నీటిమట్టం పడిఫోగానే ఆటోమాటీక్‌గా ఇంధన కంవెయరు,ఫ్యానులు తదితరా లు ఆగి పోవును. కొన్ని సందర్భాలలో పంపు తిరుగుతున్నప్పటికి, నీటిని తోడక పోవడం వల్ల లేదా విద్యుత్తు లోపం వలన పంపు తిరగక పోయిన నీటిమట్టం కనిష్ట స్థాయికి చేరును. ఈస్థితిలో వెంటనే బాయిలరుకు ఇంధనాన్ని ఇవ్వడం ఆపాలి, ప్రధాన స్టీము పంపిణి వాల్వును మూసి వెయ్యాలి. అందువలన బాయిలరు ఆపరేటరు నిరంతరం ఈ గ్యాసు ట్యూబులోని నీటి మ ట్టం మీద ఒకకన్నేసి వుండాలి. వాటరు లెవల్ ఇండికేటరును బాయిలరు ఆపరేటరుకు బాగా కన్పించే విధంగా బాయిలరు షెల్ లేదా వా టరు/స్టీము డ్రమ్ముకు అమర్చెదరు. అనగా బాయిలరు ముందు బాగాన లేదా పక్క బాగాన స్పష్టంగా క న్పించేలా బిగించెదరు[1].

బయటి లింకు వీడియోలు/చిత్రాలు[మార్చు]

ఈ వ్యాసాలు కూడా చదవండి[మార్చు]

మూలాలు/ఆధారాలు[మార్చు]

  1. 1.0 1.1 "Water gauge or Water Level Indicator". mechanical-engineering-info.blogspot.in. Retrieved 08-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  2. "Water Level Indicator ~ Boiler Mountings". mech-engineeringbd.blogspot.in. Retrieved 08-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)
  3. "BOILER MOUNTING - WATER LEVEL INDICATOR". mechanicalhero.com. Retrieved 08-01-2018. {{cite web}}: Check date values in: |accessdate= (help)